Suryaa.co.in

Telangana

99 సెకన్ల కథలు ప్రతీ సమస్యకు ఓ పరిష్కారం…

99 సెకన్ల కథలు…ఈ టైటిల్ వినగానే ఆశ్చర్యంగా..ఆసక్తిగా ఉంది కదూ…అవును.. జస్ట్ 99 సెకన్లలో ఓ కథ చదివేయొచ్చు.. పుస్తకాలు తిరగేయలేక వదిలేసేవారికి…ఈ తరం వారికి…రాబోయే తరం వారికి నీతి కథలు ఎన్నో…మరెన్నో.. ఇలా పుస్తకంలో కథలు రాసింది ఎవరాని ఆలోచిస్తున్నారా…? సాహితీలోకానికి సుపరిచితులు సీనియర్ పాత్రికేయులు, రచయిత జి.వల్లీశ్వర్.. అనువాద రచయితగా ఎన్నో సంచలనమైన కథారచనలతో పుస్తకాలను సాహితీలోకానికి పరిచయం చేసిన వల్లీశ్వర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదేమో.

సీనియర్ పాత్రికేయులు, రచయిత వల్లీశ్వర్ కలం నుంచి మరో పుస్తకం .. ఆలోచనలోంచి పుట్టుకొచ్చిన సరికొత్త అక్షరాలకు రూపకల్పన ‘‘ 99 సెకన్ల కథలు ’’ .. ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేసే విధంగా ఉండడమేగాకుండా..ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమస్యతో సతమతమవుతూనే ఉంటారు..ఇలాంటివాటికి ఓ పరిష్కారంగా తక్కువ పదాల్లోనే బోధిస్తూ కథలుగా మల్చిన వల్లీశ్వర్ గారి పుస్తకం నారపల్లిలోని స్వాధ్యాయ రిసేర్చ్ సెంటర్ లో ఆవిష్క్రుతమైంది… ఎన్నో పుస్తకాలు..గ్రంథాలను రచించి ఈ లోకాన్ని తట్టిలేపిన మహనీయులు, ప్రముఖ సాహితీవేత్త కోవెల సుప్రసన్నాచార్యుల గారి చేతుల మీదుగా వల్లీశ్వర్ రచించిన ‘‘ 99 సెకన్ల కథలు ’’ ఆవిష్కరణ చేశారు..ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత పాణ్యం దత్త శర్మ, కొల్లూరి సోమశంకర్, కస్తూరి మురళి, సీనియర్ పాత్రికేయులు కోవెల సంతోష్ కుమార్ , ab6News చీఫ్ ఎడిటర్ విష్ణుదాస్ శ్రీకాంత్ లు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE