– నిరుద్యోగులకు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మోసం
– ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. వి ప్రణవ్ గోపాల్
ప్రతి సంవత్సరం జనవరిలో ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ పై జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ .ఐ మరియు కానిస్టేబుల్ నియామకాల కోసం నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మెగా డీఎస్సీ అని నిరుద్యోగులను నిలువునా ముంచారు.పాదయాత్రలో ఇచ్చిన మోసపూరిత హామీలను విస్మరించినందుకే నిరుద్యోగులతో చలో అసెంబ్లీ నిర్వహిస్తున్నాం.చలో అసెంబ్లీకి నిరుద్యోగులు అందరూ వేలాదిగా అసెంబ్లీకి తరలిరావాలి.
ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తారా? లేక గద్దె దిగుతారో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి .ఏపీపీఎస్సీ జగన్ రెడ్డి జేబుసంస్థగా, రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చాడు.జాబ్ ఎక్కడ జగన్ రెడ్డి ? అని అడుగుతున్న నిరుద్యోగులకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.రేపు నిరుద్యోగులతో నిర్వహిస్తున్న చలోఅసెంబ్లీని అందరూ విజయవంతం చేయాలి.ప్రభుత్వం మరియు పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా చలో అసెంబ్లీ నిర్వహిస్తాం.