• 16 సర్క్యూట్లకు రేటింగ్లు కోరగా ఐదింటికి మంచి రేటింగ్లు వచ్చాయి
• త్వరలో ఐదు టెంపుల్ టూరిజం సర్క్యూట్లు ప్రారంభం
రాష్ట్ర దేవాదాయశాఖ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, పర్యాటక శాఖమంత్రి ఆర్కె రోజా
అమరావతి,21 సెప్టెంబరు:రాష్ట్రంలో దేవాదాయశాఖ మరియు పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర దేవాదాయశాఖ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మరియు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు.ఈమేరకు బుధవారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకు మీడియా పాయింట్ వద్ద ఇరువురు మంత్రులు మీడియాతో మాట్లాడారు.
ముందుగా ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలోని అధిక దేవాలాయాలు గల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.ఎపిలో ప్రాముఖ్యత కలిగిన అనేక దేవాలయాలువున్నాయని వాటిని ఆధ్యాత్మికంగాను పర్యాటక పరంగాను పర్యాటకులను ఆకర్షించే రీతిలో అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ,పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
దీనిలో భాగంగా మొత్తం 16 టెంపుల్ టూరిజం సర్క్యూట్లను గుర్తించి వాటికి రేటింగ్ ఇవ్వాల్సిందిగా ప్రజలు, భక్తులు, పర్యాటకులు అభిప్రాయాలను ఆన్లైన్ ద్వారా కోరగా వాటిలో 5 సర్క్యూట్లకు అత్యధిక రేటింగ్ లు ఇచ్చారని ఉప ముఖ్యమంత్ర కొట్టు సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు.అత్యధిక రేటింగ్లు వచ్చిన వాటిలో విజయవాడ నుండి పంచారామ యాత్ర, విజయవాడ నుండి అష్టశక్తి యాత్ర,విజయవాడ నుండి త్రిలింగ యాత్ర,తిరుపతి నుండి కృష్ణదేవరాయ యాత్ర,తిరుపతి నుండి గోల్డెన్ ట్రయాంగిల్ యాత్ర సర్క్యూట్లకు అత్యధిక రేంటింగ్లు వచ్చాయని తెలిపారు.
ఈఐదు సర్క్యూట్లను ముందుగా త్వరలో ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు.టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా ఆయా రూట్లలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు,దేవాలయాలను అనుసంధానిస్తూ ఈటెంపుల్ టూరిజం సర్క్యూట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ వెల్లడించారు.
రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖామాత్యులు ఆర్కె రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రాంతాలు ప్రముఖ దేవాలయాలకు ఆలవాలంగా ఉన్నాయని పేర్కొన్నారు.టెంపులు టూరిజంలో భాగంగా పర్యాటక ప్రాంతాలను దేవాలయాలను టెంపుల్ టూరిజం సర్క్యూట్లుగా అభివృద్ధి చేయడంతో అటు భక్తులకు ఇటు పర్యాటకులకు అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉంటుందని ఆమె చెప్పారు.ఈవిధంగా టెంపుల్ టూరిజం సర్క్యూట్లు ఏర్పాటుతో అటు దేవాలయాలు,ఇటు పర్యాటక ప్రాంతాలను సందర్శించాలన్న కోరిక నెరవేరుతుందని చెప్పారు.
ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర్రంలో పర్యాటక రంగాభివృద్ధికి పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే రీతిలో వివిధ పర్యాటక కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నట్టు మంత్రి రోజా వివరించారు.
అంతకు ముందు సచివాలయం రెండవ బ్లాకు ఉప ముఖ్యమంత్రి వర్యుల చాంబారులో పర్యాటక శాఖమంత్రి ఆర్కె రోజాతో కలిసి దేవాదాయ మరియు పర్యాటక శాఖల అధికారులతో మంత్రులు ఇరువురు ఈవిషయమై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో దేవాదాయశాఖ కమీషనర్ హరి జవహర్,రాష్ట్ర పర్యాటక శాఖ ఎండి కన్నబాబు పాల్గొన్నారు.