-టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ
వాట్సాప్ లో వచ్చిన వీడియోను ప్వార్డాడ్ చేయటం ఏమైనా దేశ ద్రోహమా? అదేదో జాతీయ సమస్య అయినట్టు టెర్రరిస్ట్ మాదిరి దారపనేని నరేంద్రను అర్దరాత్రి అరెస్టు చేస్తారా? అక్రమ కేసులు అర్దరాత్రి అరెస్టులు చెల్లవని తెలిసి కూడా శారీరకంగా, మానసికంగా హింసిచేందుకు అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న తప్పులకు భవిష్యత్ లో పోలీసులు పశ్చాత్తాపం చెందక తప్పదు. విచారణలో నరేంద్ర ఒంటిపై ఒక్క దెబ్బపడినా టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఊరుకోరు.