Suryaa.co.in

Andhra Pradesh

ములాయం సింగ్ యాదవ్ కుటుంబసభ్యులకు యనమల రామకృష్ణుడు పరామర్శ

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు విచారం వ్యక్తం చేశారు. ములాయం స్వగ్రామమైన ఉత్తరప్రదేశ్ లోని ఇటావా జిల్లా సాయీఫాయీ వెళ్లిన యనమల ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ములాయం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ తో మాట్లాడి ధైర్యం చెప్పారు. ములాయం మరణంతో దేశం ఒక దార్శనికుడిని , గొప్ప రాజకీయ నేతను కోల్పోయిందన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన సాధించిన విజయాలు అసాధారణమైనవని, తన జీవితకాలం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే ములాయం పనిచేశారని ఈ సందర్భంగా యనమల గుర్తుచేసుకున్నారు.

LEAVE A RESPONSE