Suryaa.co.in

Andhra Pradesh

ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి త్వరలో అరెస్ట్ కాక తప్పదు…

టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు…

వైఎస్ వివేకా హత్యకేసుకు సంబందించి మారుతున్న సమీకరణలు బట్టి చూస్తే..ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి త్వరలో అరెస్ట్ కాక తప్పదు. వివేక హత్య కేసులో అప్రూవల్ గా మారిన దస్తగిరి ప్రాణభయం తో ఇబ్బంది పడుతున్నాడు. దస్తగిరి ప్రాణాలకు రక్షణకల్పించాల్సిన బాధ్యత సిఎం వైఎస్ జగన్ దే. వైయస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ డ్రైవర్ దస్తగిరి తన భద్రత విషయంలో చేసిన ఆరో పణలపై ఆలోచించాలి. దస్తగిరి తనకు ప్రాణ హాని జరిగితే సిఎం బాధ్యత వహించాలని చెప్పడం చూస్తే సిఎం పాత్ర ఉందని రూడీ అవుతోంది. వివేకా హత్య కేసులో ఎంపి, ఇతర ముఖ్య నేతల పై కేసు నమోదు చేయడం.. దస్తగిరి వాగ్మూలం కీలకం కావడంతో అతనికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. సుప్రీం కోర్టు లో వివేకా నిందితుల విషయంలో ఇస్తున్న తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నాయి. వివేకా హత్య వెనుక ఎవరున్నారు అనే విషయం పులివెందుల ప్రజలకు తెలుసు. వివేకా కేసులో జైల్లో ఉన్న నిందితులకు ఇక బైయిల్ వచ్చే పరిస్థితి లేదు. వివేకా హత్య కేసులో సీబీఐ కి ఇటీవల షర్మిల వాంగ్మూలం సునీతకు అనుకూలంగా చెప్పినట్లు తెలుస్తోంది. దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్న నేతల ప్రమేయాన్ని షర్మిల సీబీ ఐ కి స్టేట్ మెంట్ ఇచ్చినట్లు సమాచారం.

LEAVE A RESPONSE