Suryaa.co.in

Andhra Pradesh

ఘనంగా డాక్టర్ అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు

మాజీ రాష్ట్రపతి ఏపిజే అబ్దుల్ కలామ్జ యంతి కార్యక్రమం తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యలయం పర్యవేక్షకులు, ఎంఎల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తో పాటు పార్టీ లీగల్ సెల్ రాష్ర్ట అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ షేక్ ఆసిఫ్,మాదిగ కార్పోరేషన్ ఛైర్మన్ కనకారావు మాదిగ,కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపాశేషు,ముదిరాజ్ కార్పోరేషన్ ఛైర్మన్వెం కటనారాయణ, కృష్ణాజిల్లా డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ తదితరులు ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఏపిజే అబ్దుల్ కలామ్ దేశానికి అందించిన సేవలు అందరికీ ఆదర్శం అని అన్నారు. కలలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడి పనిచేయండి అంటూ కలామ్ చెప్పిన మాటలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

LEAVE A RESPONSE