-దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేస్తావా?
-ఆ విషయాన్ని ధైర్యంగా ప్రకటించగలవా?
-సన్నాసిన్నర.. శుంఠన్నర.. భాష మార్చుకో
-ఇంకోసారి ఇలా మాట్లాడితే నాలుక చీరేస్తాం
-చంద్రబాబు కోసమే.. చంద్రబాబు డైరెక్షన్‌లో
-అదే పవన్ రాజకీయం
-ముసుగు తొలగించిన చంద్రబాబు, పవన్
-పేర్ని నాని స్పష్టీకరణ
-చంద్రబాబు కాళ్లు పిసకను. నొక్కను అని చెప్పు
-చంద్రబాబు బూట్లు కూడా నాకబోనని చెప్పు
-ఇవన్నీ చేస్తే, నీపై మా వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటాం
-వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి, -ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని)
తాడేపల్లి: ప్రెస్‌మీట్‌లో పేర్ని నాని ఇంకా ఏం మాట్లాడారంటే..:
ముసుగు తొలగించిన పవన్:
2018 నుంచి ఈరోజు వరకు ఒక రాజకీయ పార్టీ పేరుతో ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ నడుపుతున్న ఒక వ్యక్తిని దత్తపుత్రుడు అని వైయస్సార్ కాంగ్రెస్ పారీ ప్రశ్నిస్తుంటే.. నిన్నటి వరకు బింకాలు పోయి బీరాలు పలికిన ఆ దత్తపుత్రుడు ఇవాళ ముసుగు తొలగించాడు. ఇదంతా మేము ముందు నుంచి చెబుతున్నదే. ఈ ముసుగు వెనకాల చంద్రబాబుకు గులాంగిరి ఉంది. ప్రత్యక్షంగా చెప్పలేక, ప్రజలను, తన అభిమాన సంఘాలను ముసుగు చాటున చేస్తున్నాడు. చివరకు ఈ ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్‌ను జాగ్రత్తగా చంద్రబాబుకు అప్పజెప్పడమే అతడి అంతిమ లక్ష్యమని మొదటి రోజు నుంచి చెబుతున్నాం.
చెప్పకనే చెప్పేశాడు:
సంతోషం. ఇవాళ ముసుగు తీశాడు. తేటతెల్లం చేశాడు. రేపటి నుంచి రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారబోతున్నదని చెప్పకనే చెప్పాడు. బీజేపీతో కలిసి ఉంటున్నాను కానీ, వారితో కలిసి ఉద్యమం చేయలేకపోతున్నాను. మనసు రావడం లేదు. బీజేపీ అంటే నాకు నచ్చడం లేదని ఇవాళ తెగతెంపులు కూడా చేశాడు. ఈ విషయం రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి కూడా తెలుసని అన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలిమెంటరీ స్కూల్ పిల్లవాడిని అడిగినా కూడా చెబుతాడు. 2019 ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్ సింగిల్‌గా పోటీ చేశాడు కదా.. రేపు 2024లో కూడా అలాగే వెళ్తాడా.. అంటే లేదు. చంద్రబాబుతో వెళ్తాడని చెబుతాడు. ఈ ముసుగు తీయమనే మేము గత నాలుగేళ్లుగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అందుకే ముసుగుతీసి మెల్లగా చంద్రబాబుతో చట్టాపట్టాల్ వేయడానికి సమయం వచ్చిందని అందరికీ అర్ధం అవుతుంది. ఇదేదో ముందు నుంచి చెబితే, అతడు నిఖార్సయిన వ్యక్తి అని మాట్లాడుకునే వాళ్లం. కానీ ఆ అవకాశం లేకుండా దాస్తూ వచ్చాడు.
నీ వాళ్ల చొక్కాలే పట్టుకో:
వైయస్సార్‌సీపీలో గుండాలను ఇంట్లో నుంచి చొక్కా లాక్కుని వచ్చి కొడతానన్నాడు. కానీ అందుకు ఏ మాత్రం అవకాశం లేదు. ఎందుకంటే వైయస్సార్‌సీపీలో గుండాలు లేరు. వారున్నది తన పార్టీలోనే. కాబట్టి వారినే ఇంట్లో నుంచి లాక్కుని వచ్చి కొట్టాలి.
అది ప్యాకేజీ కాక మరేమిటి?:
ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెట్టి 175 స్థానాల్లో ఒక్కటంటే ఒక్కచోట కూడా అభ్యర్థిని పెట్టకుండా, బీ–ఫామ్ ఇవ్వకుండా, చివరకు ఆ పార్టీ పెట్టిన వ్యక్తి కూడా పోటీ చేయకుండా, ఫలానా వారికి ఓటేయమని కోరితే ఏమంటారు? ప్యాకేజీ ఉంటే అంటారా? ప్యాకేజీ లేకపోతే అంటారా? అసలు రాజకీయ పార్టీ ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే కదా? మరి 2014లో ఎందుకు పోటీ చేయలేదు?
ఆ తర్వాత 2019లో బీజేపీని పచ్చి బూతులు తిట్టి, మోదీని తిట్టి, నిర్ణయాధికారంలేని వెంకయ్యనాయుడిని తిట్టి, చంద్రబాబునాయుడును తిట్టకుండా ఆయన కొడుకును తిట్టి.. వెధవ, సన్నాసి అని గుంటూరులో విమర్శించి.. వామపక్షాలు, మాయావతితో జతకట్టి, పోటీ చేసి, చివరి క్షణం వరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అభ్యర్థులను, పొత్తులను మారుస్తూ వచ్చిన తంతును ప్యాకేజీ అనకుండా ఏమంటారు?
ఎన్నికలు అయిన తెల్లవారే బీజేపీతో చెట్టాపట్టాల్ వేసుకుని, వారి చంకను ఎత్తడాన్ని ఏమంటారు? బీజేపీని తిట్టిన నోరు తడారకముందే, వారి చంక ఎక్కి అంట కాగడాన్ని ఏమంటారు? నీ రాజకీయా పార్టీకి ఏం విలువలు ఉన్నాయి? చంద్రబాబు గెలవాలని అంటాడు. అందుకోసం బీజేపీ కూడా కలిసి రావాలని అంటున్నాడు. అది వారికి నచ్చకపోతే, వారి తీరు ఆయనకు నచ్చడం లేదు.
ఇదే మా సవాల్:
ఇవాళ కూడా చెబుతున్నాం. సవాల్ చేస్తున్నాం. మీరు 2024 ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో మీ ఈవెంట్ ఆర్గనైజేషన్‌ను పోటీలో పెట్టండి. నీవు ప్యాకేజీ నాయకుడివి అన్న మాట వెనక్కు తీసుకుంటాం.
నీవు తిట్టినట్లు మా కాపు నా కొడుకులందరి తరపున నేను చెబుతున్నాను. నీవు 175 సీట్లలో పోటీ చేయి. మా మాటలు వెనక్కు తీసుకుంటాం. చంద్రబాబుతో అంట కాగను, ఆయన చంక కింద దూరను, ఆయన కాళ్లు పిసకను, బూట్లు నాకను అని చెప్పండి. మేము మా మాటలు వెనక్కు తీసుకుంటాం.
సోదరా అంటేనే అంత రోషమా?:
పవన్ దత్తపుత్రుడు. అదే విధంగా సన్నాసిన్నర సన్నాసి. ఎవరో అంట ఆయన బంతి చామంతి సోదర.. ఏరా నా కొడక ఏం సోదరరా? నీకు నాకు చుట్టరికం ఏమిట్రా? అని మాట్లాడుతున్నాడు ఈ దత్తపుత్రుడు. సన్నాసిన్నర సన్నాసి. నిన్ను సోదరా అంటేనే.. ఒరే దత్తపుత్రుడు. సన్నాసిన్నర సన్నాసి. నిన్ను చుట్టరికం లేకుండానే నిన్ను సోదరా అంటేనే నీకు అంత కడుపు రగిలితే.. వైయస్సార్‌సీపీలోని కాపు ఎమ్మెల్యేలందరినీ నా కొడుకుల్లారా అంటే, నీ బలుపు ఏమిటి? మేమెంత ఫీల్ కావాలి? మాకెంత ఫ్రస్టేషన్ రావాలి?
ఆ పుస్తకాల్లో అదే చదివావా?
సోదరా అంటేనే ఏరా, ఒరేయ్, నా కొడుకుల్లారా అంటున్నావు. సిగ్గు, శరం వదిలేసి కొంపల్లె సుందరం గారి పుస్తకం. పూలే గారి పుస్తకం. ఇంకా రామ్‌మనోహర్ లోహియా రాసిన కులాల ప్రస్తావన పుస్తకాన్ని ఆయనకు చలంగారు ఇచ్చారట. ఆయన 1979లో చనిపోయాడు. మరి పుస్తకం ఎప్పుడు ఇచ్చాడో. మరి ఈ బూతులన్నీ ఆ పుస్తకాల్లో చదివాడా? వాటినే కదా మేమూ చదువుకోవాల్సింది. శుంఠన్నర శుంఠ. వాటినే కదా మేము వైయస్సార్‌సీపీలోని కాపు నాయకులమంతా? రాజకీయ నాయకుడికి కులం ఉంటుందా? ప్రజలు ఉంటారా? ప్రజా సేవ చేయడానికి వచ్చిన వాడికి కులం ఉంటుందా?
అదే నీ బాధ. దుగ్ధ:
ఈ సన్నాసిన్నర సన్నాసి బాధ, దుగ్ధ అంతా ఏమిటంటే, జగన్‌గారు కాపులకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. 25 మంది మంత్రుల్లో 5గురు కాపులున్నారు. విధాన నిర్ణయంలో వారికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. వారి గురించి ఎంత మాట్లాడుతున్నా, రెచ్చగొడుతున్నా.. ఒక్క కాపు నాయకుడు కూడా టీడీపీవైపు రావడం లేదన్న దుగ్ధ, బాధ. అందుకే ఈ భాష. ఏ నాయకుడైనా అలా మాట్లాడతాడా? కాపులు అత్యధికంగా జగన్‌గారి వైపు ఉన్నారు. అభిమానిస్తున్నారు. 2019లో అండగా నిల్చారు. 2024లో కూడా ఉంటారు.
వాళ్లే అలా మాట్లాడతారు:
అసలు పదే పదే కులం గురించి మాట్లాడుతోంది ఎవరు? కుల రాజకీయం చేస్తోంది ఎవరు? కుల రాజకీయాలు చేసే వాడే కులాల గురించి మాట్లాడతాడు. అసతు తనకు కులం, మతం లేదని అన్న శంఠన్నర శుంఠ ఎవరు? రంగా గురించి మాట్లాడుతున్నాడు. రంగా ఉన్నప్పుడు ఈ శుంఠన్నర శుంఠ ఎక్కడున్నాడు?
అప్పుడు నీ నోరు పడిపోయిందా?:
కానీ నీ ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభం ని, ఆయన కోడలు, భార్య, కొడుకుని ముతక మాటల్లో చెప్పలేని విధంగా మాట్లాడారు. ఈ విషయాన్ని ముద్రగడ స్వయంగా చెప్పారు. మరి ఆరోజు పవన్ ఏమయ్యాడు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? నీదే కదా ప్రభుత్వం? నోరు పడిపోయిందా? గొంతుకు పక్షపాతం వచ్చిందా? ఒరేయ్ సన్నాసిన్నర సన్నాసి. నా కొడకా.. నాలుక చీరేస్తా. పీలికలు పీలికల కింద చీరేస్తా.. అని నేను అనలేనా? కానీ నాకు సంస్కారం ఉంది. బాధ పడితే మన్నించండి. నేనూ బూతులు మాట్లాడగలను. మా పార్టీలో కూడా అలా మాట్లాడే వారున్నారు. వారు మాట్లాడితే చెవులు మూసుకోవాలి.
పాపం అర టికెట్లు. అమాయకులైన పిల్లలు. ఓటు హక్కు రాని పిల్లలను తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టుకుని బూతులు తిడితే సరా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మీ పార్టనర్‌తో పార్టీ ఆఫీస్ నుంచి బోసిడికే అని బూతులు తిట్టించినప్పుడు నీ నోరు పడిపోయిందా?
నీవు అన్నావు కాబట్టే స్పందించాం:
నీ పెళ్ళిళ్ల గురించి ఎవరికి అవసరం? ఎప్పుడైతే అరే సన్నాసిన్నర సన్నాసి.. నాకు కుదిరింది. కావాలంటే మీరు కూడా మూడు పెళ్ళిళ్లు చేసుకొండి అని నువ్వు అన్నావో అప్పుడే మేము మాట్లాడాల్సి వచ్చింది.
నీవు కార్లు కొనుక్కుంటే ఎవరెందుకు కామెంట్లు చేస్తారు? కానీ ఎందుకు మాట్లాడారు. నా కింద పని చేసే వారికి జీతాలకు డబ్బులు లేవు. కారుకు ఈఎంఐ కట్టలేకపోతున్నానని నీవే కదా అన్నావు? నీవు ఏం కొనుక్కుంటే మాకేమిటి? విమానం కొనుక్కో. వైయస్సార్‌సీపీ మాకేమిటి?
వారిని నీవు పంపావా?:
మా పార్టీ నాయకులు, ఒక పెళ్లి చేసుకుని 30 మందితో తిరగతారట. అంటే ఆ స్టెప్నీలను నీవు పంపావా? నీవేమైనా సప్లై కంపెనీయా? లోపల దురుద్దేశంతో పిచ్చి మాటలు. పచ్చి భాష. నిర్లజ్జగా, ఇంత పచ్చిగా ఎవరూ మాట్లాడలేదు. దేశంలో ఎవరూ అలా మాట్లాడలేదు.
సిగ్గు విడిచి మాటలు..:
పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చుని, సిగ్గు విడిచి, అసభ్య పదజాలంతో రెచ్చిపోయావు. నీవు తప్ప, ఆ పని ఎవరూ చేయడు. చేయబోరు కూడా. పార్టీ పెట్టింది కొట్టుకోవడం కోసమా? ఎవర్రా నీ కొడుకులు?
అరే సన్నాసిన్నర సన్నాసి. నేను నిఖార్సయిన కాపును నేను. కల్తీ గిల్తీ లేదు. మేము జగన్ దగ్గర పని చేస్తే, మేము ఊడిగం చేస్తున్నామా? మరి నీ పక్కన నాదెండ్ల మనోహర్ ఏం చేస్తున్నాడు? కాళ్లు ఒత్తుతున్నాడా? కాళ్లు పిసుకుతున్నాడా? ఒళ్లు ఒత్తుతున్నాడా? ఏం చేస్తున్నాడు? మాట్లాడితే ఒక పద్ధతి ఉండాలి. నీ వంటి వాడితో ప్రత్యక్షంగా రాజకీయం చేయడానికి మాకు సిగ్గు వేస్తోంది.
అదే పవన్ లక్ష్యం:
చంద్రబాబు కోసం దిగజారి రాజకీయం చేస్తున్నావు. జగన్ పట్ల కాపులు ప్రేమతో ఉన్నారని రగిలిపోతున్నావు. అందుకే జగన్ , కాపుల మధ్య విభేదాలు సృష్టించి, కాపులను చంద్రబాబుగారికి దగ్గర చేయాలని నీవు ప్రయత్నిస్తున్నావు. ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్, చంద్రబాబుతో కలిసి పని చేస్తాడు. ఆయన సీఎం కావడమే పవన్ లక్ష్యం. పవన్ కొన్ని సీట్లలోనే పోటీ చేస్తాడు. ఒక బాధ్యత కలిగిన నాయకుడు యువతకు ఏం సందేశం ఇస్తున్నాడు? కాపు యువకులంతా హాకీ స్టిక్‌లు పట్టుకుని రోడ్లు ఎక్కాలట. దేశంలో ఇంతలా దిగజారి పోయిన నాయకుడు మరొకరిని చూడబోం. కాపు కులస్తులందరినీ చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టాలనేదే పవన్ ఆలోచన.
ఈక కూడా పీకలేవు:
నీకు ఒక కాలుకే చెప్పు ఉందేమో? మాకు రెండు చెప్పులున్నాయి. టీవీ ఛానళ్ల ముందు చెప్పు తీసి, సినిమా డైలాగ్‌లు చెబితే, నా కొడుకుల్లారా అని అంటే నీ నోటి దూల తీరుతుందేమో కానీ, రాజకీయంగా జగన్‌ఈక కూడా పీకలేవు. అది 2024 ఎన్నికల్లో నీకు అర్ధం అవుతుంది సన్నాసిన్నర సన్నాసి.
మాకు సంస్కారం ఉంది:
దిగజారి నీకన్నా అసహ్యంగా తిట్టే సమర్థత, సత్తా, భావజాలం నాకుంది. కానీ నా తల్లి ఇచ్చిన సంస్కారం అడ్డు వస్తుంది. ఇంతకు మించి నిన్ను అసభ్య పదజాలం వాడను. అవి కూడా నీవు మాట్లాడావు కాబట్టి.. నేనూ మాట్లాడాల్సి వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్‌లో ఉన్న కాపు నాయకులు కూడా బూతులు తిట్టగలరని చెప్పడం కోసమే అలా మాట్లాడాను సన్నాసిన్నర సన్నాసి.
తాటాకు చప్పుళ్లకు భయపడం:
ఒక వంద, రెండొందల మందిని పోగేసి వారికి కర్రలు ఇచ్చి, మంత్రుల మీద దాడి చేస్తే, నీ తాటాకు చప్పుళ్లకు వైయస్సార్‌సీపీ ఏ మాత్రం భయపడదు. ఈ సన్నాసిన్నర సన్నాసి ఉడత ఊపులకు మేము భయపడం. నీవు నోరు జాడిస్తే సన్నాసిన్నర సన్నాసి.. ఇక్కడ కూడా 100 నోళ్లు జారుతాయని హెచ్చరిస్తున్నా.
ఇద్దరూ కలిసి కుట్ర:
చంద్రబాబు, సన్నాసిన్నర సన్నాసి.. ఇద్దరూ కుట్ర చేసి, గర్జన ర్యాలీ రోజు కావాలనే విశాఖలో కార్యక్రమం పెట్టుకున్నారు. అక్కడ ఎందుకు గొడవ చేయించాడు? ఎయిర్‌పోర్టుకు కర్రలు ఎందుకు తీసుకుపోవాలి?
ఉద్దేశపూర్వకంగా అక్కడ ఏదో జరుగుతోందని చెప్పే ప్రయత్నం చేశారు. మర్నాడు జనవాణి నిర్వహించుకోమని పోలీసులు కోరితే, అక్కడికి పోలేదు. కావాలనే తన పార్టీ కార్యకర్తలను హోటల్ వద్దకు పిలిపించుకుని నానా హంగామా చేశాడు. మంత్రుల మీద దాడి చేస్తే, చంద్రబాబుతో సహా, అన్ని పార్టీల నాయకులు పవన్‌కు ఫోన్ చేయడం విచిత్రం. ఇదంతా ఉమ్మడిగా, కలిసి కుట్ర చేసి, ప్లాన్ ప్రకారం అక్కడికి పోయారు. మళ్లీ ఇక్కడికి వచ్చి మూడు, నాలుగు గంటలు బూతు పంచాంగం.
నాలుక చీరుతాం:
అలా మానసిక ఆనందం పొందుతున్న సన్నాసిన్నర సన్నాసికి ఒకటే హెచ్చరిక. చంద్రబాబు కోసం ఎంతకైనా దిగజారుతున్న నీవు, ఈ రాష్ట్రాన్ని, రాష్ట్రంలో శాంతి భద్రతలను నాశనం చేయొద్దు. చంద్రబాబు డైరెక్షన్‌లో, ఆయన కోసమే పవన్‌కళ్యాణ్ పని చేస్తున్నాడు. జగన్‌కి, కాపులకు మధ్య గొడవలు పెట్టి, కాపులను చంద్రబాబుకు దగ్గర చేయడమే పవన్ ఉద్దేశం. నా కొడకా ఇంకోసారి ఇలాంటి పదజాలం వాడితే నాలుక చీరుతాం.