ముసుగు దొంగలు బాబు-పవన్ నిజ స్వరూపం బయటపడింది..!

– ముమ్మూటికీ పవన్.. ప్యాకేజీ కల్యాణే..!
– బీజేపీతో పొత్తు.. బాబుతో సంసారం చేస్తోంది వాస్తవం కాదా..?
– మంగళగిరిలో నీ పార్టీ ఆఫీసు ఎలా వచ్చింది.. ప్యాకేజీ కాదా..?
– నీవు చూపించిన ఆ చెప్పు అయినా నీదేనా పవన్ కల్యాణ్..?
– నీవు చెప్పే చూపించావ్.. ఆ చెప్పులతో ప్రజలే మిమ్మల్ని తరిమి తరిమి కొట్టారు కదా?
– సిగ్గులేని సన్నాసిలా 3 పెళ్ళిళ్ళ గురించి గొప్పగా చెబుతావా..!
– బాబు-పవన్ లకు ఒక సిద్ధాంతం లేదు.. అధికారం కోసం ఏ గడ్డి అయినా తింటారు
– సినిమాల్లో మాత్రమే పవన్ ఖలేజా.. రాజకీయాల్లో జగన్ ఖలేజా ఏంటో చూశారు కదా..
– నీకు ఖలేజా ఉంటే.. ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పే ధైర్యం ఉందా..?
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్

జోగి రమేష్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం.. ప్యాకేజీ కల్యాణే
చంద్రబాబు- పవన్ కల్యాణ్.. ముసుగువీరుల ముసుగు తొలగిపోయింది. ముసుగు దొంగలిద్దరూ ఒకచోటికు చేరిపోయారు. విజయవాడలోని నొవాటెల్ హోటల్ వేదిక సాక్షిగా వీరి ముసుగు తొలగిపోయింది. ప్రజలు సందిగ్ధం కూడా తీరిపోయింది. పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు కలుస్తారు, కలవబోతున్నారనేది ఎప్పటి నుంచో మేము చెబుతున్నాం. ప్యాకేజీ స్టార్ అంటే పవన్ కల్యాణ్ రెచ్చిపోతున్నాడు. మళ్లీ మళ్ళీ చెబుతున్నాం… పవన్ కల్యాణ్ ప్యాకేజీ కల్యాణే. ప్యాకేజీ స్టార్ అనటం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కానీ.. ప్యాకేజీ కల్యాణ్ అనడం కరెక్టు.

పార్టీ పెట్టిన దగ్గర నుంచీ ప్యాకేజీల కోసం అమ్ముడుపోయిన వ్యక్తే పవన్ కల్యాణ్. సినిమాల్లో ఏవిధంగా అయితే నటిస్తున్నాడో, రాజకీయ జీవితంలో కూడా ముసుగు వీరుడులా నటిస్తున్నాడు. ప్యాకేజీ తీసుకునే అలవాటు పవన్ కు లేదా? . 2014 లో జనసేన పార్టీ పెట్టుకుని, తన పార్టీని అధికారంలోకి తీసుకు వస్తానని, ముఖ్యమంత్రిని అవుతానని దమ్ము, ధైర్యంగా ఏరోజు అయినా చెప్పగలిగావా?. ఏనాడైనా, నేనే ముఖ్యమంత్రిని అవుతానని పవన్ కల్యాణ్ అన్నాడా?. అంటే, తాను చంద్రబాబు నాయుడు ఆడమన్నట్టు ఆడే ఒక తోలు బొమ్మ అని పదే పదే పవన్ కల్యాణ్ నిరూపించుకున్నాడా, లేదా?

ప్యాకేజీ అంటే కోపం వస్తుంది కదా? నువ్వు ఎక్కడ ఉన్నావు?. మంగళగిరిలో నీ పార్టీ కార్యాలయాన్ని ఎవరు ఇచ్చారు? ఎవరు కట్టించారు?. అచ్చమైన రాజకీయ నాయకుడివే అయితే, చంద్రబాబుకు అమ్ముడు పోనోడివే అయితే, బాబు చంకలో మనిషివే కాకపోతే, దమ్ముంటే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి వైయస్సార్ సీపీ ప్రభుత్వాన్ని ఓడిస్తానని చెబితే ప్రజలు నమ్ముతారు. నీకది చేతకాదు. ప్యాకేజీ వాడివే నువ్వు. ప్యాకేజీ పవన్ అని వందసార్లు అంటాం. నీవు రెండు చోట్ల పోటీ చేస్తే.. రెండు చోట్లా ప్రజలు ఓడించారు. నీ పార్టీ ఒక్క స్థానంలో గెలిచినా… అతడు కూడా నిన్ను చెప్పుతో కొట్టేసి వెళ్లిపోయినా నీకు సిగ్గు రాలేదా? సినిమా డైలాగులు చెప్పడం కాదు. రెచ్చిపోయి మాట్లాడటం సరికాదు. మిడిమిడి జ్ఞానంతో, ప్యాకేజీలకు అమ్ముడు పోయే మీలాంటి వాళ్లను ప్రజలు మళ్లీ 2024 ఎన్నికలలో గట్టిగా బుద్ధి చెబుతారు. మీ తిత్తి తీయడం ఖాయం.

ఆ చెప్పు అయినా నీదేనా పవన్..?
తనను ఎవరైనా ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు తీసుకుని కొడతానని పవన్ కల్యాణ్ చెప్పు చూపిస్తున్నాడు కదా? నువ్వు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడివి అవునా, కాదా. కనీసం ఆ చెప్పు అయినా నీదేనా? లేక ఆ చెప్పులను కూడా నీ యజమాని కొనిచ్చాడా?. చెప్పు తీసుకుని అటూ ఇటూ ఆవేశంగా ఊగిపోతున్నావే? చెప్పులు అందరికీ ఉన్నాయి. అందుకే 2019 ఎన్నికల్లో మిమ్మల్ని చెప్పులు అరిగేలా, మీ చెంపలు చెళ్లుమనిపించేలా ప్రజలు కొట్టారు కదా? అయినా బుద్ధి, సిగ్గు రాలేదా?. ఆ ఎన్నికల్లో మీరు చేసింది యుద్ధమే కదా? సన్నాసులు, చచ్చు దద్దమ్మలంతా ఓడిపోయారు కదా?.
పవన్ కల్యాణ్ కు పొత్తులపై క్లారిటీ ఉంది. బీజేపీతో విడాకులు ఇచ్చి టీడీపీతో జత కట్టాలనుకున్నాడు కాబట్టే అంత రెచ్చిపోయి మాట్లాడాడు. పవన్ బీజేపీని పెళ్లి చేసుకున్నా.. సంసారం మాత్రం చంద్రబాబుతో చేస్తున్నాడనేది అందరికీ తెలిసిన రహస్యమే. మాకు ఎవరితో పని లేదు. జగన్ గారు అంటే జనాలకు ఒక నమ్మకం, ధైర్యం. ఆ నమ్మకాన్ని ఏ కుటుంబం అయినా వదులుకుంటుందా?. జగన్ మీద ప్రజలకు ఉన్న భరోసాను ఎవరూ చెరిపేయలేరు. దూరం చేయలేరనేది చెప్పగలం.

నీవు చెప్పే చూపించావు.. ప్రజలు వాటితోనే కొడతారు..
విశాఖ రాజధాని కావాలంటూ.. ఉత్తరాంధ్ర ప్రజలంతా విశాఖ గర్జనలో తమ మనోభావాలు ప్రస్ఫుటించేలా గొంతెత్తి చాటారు. ఆ గర్జన విజయవంతం కావడంతో కడుపు మంటతో జీర్ణించుకోలేక మంత్రులపై, కర్రలు, రాళ్లతో దాడి చేశారు. జనసేన సైన్యం అని చెప్పుకునే సైకోలను మామీదకు ఉసిగొలిపాడు. ఎంతమంది సైకోలు వచ్చినా.. మమ్మల్నీ ఏమీ చేయలేరు. నీ భాషను రాష్ట్ర ప్రజలంతా చూశారు. నా కొడుకులు అని మాట్లాడుతున్నావే?. మేమూ మాట్లాడలేమా?. మా నాయకుడు మాకు అలా నేర్పించలేదు. నువ్వు చెప్పే చూపించావు. మేము అయితే ఏకంగా చెప్పుతోనే కొడతాం. పవన్ కల్యాణ్ పిచ్చికుక్క అని ఏడాది క్రితమే చెప్పాను. మళ్లీ మళ్ళీ అదే స్పష్టం చేసుకుంటున్నాడు. జగన్ మోహన్ రెడ్డిగారి మీద, మా పార్టీ మీద, మా ప్రజా ప్రతినిధులపై పవన్ కల్యాణ్ మాట్లాడిన సైకో భాషను అందరూ గమనిస్తున్నారు. మేమంతా రానవసరం లేదు. డేట్, టైమ్, ప్లేస్ చెబితే సింగిల్ గానే వచ్చి సమాధానం చెబుతా. నీ వాళ్లు వద్దు… మా వాళ్లు వద్దు పవన్ కల్యాణ్.. నేను ఒక్కడిని వస్తా. పాత్రికేయ మిత్రుల సమక్షంలోనే చర్చించుకుందాం. సిద్ధమేనా? ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విధానం.. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని. వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి, గడప గడపకు చేరాలన్నదే లక్ష్యం. భావి తరాలు, భవిష్యత్ తరాలు మళ్లీ ఉద్యమాలు చేయకూడదని, మన పిల్లలు సోదరభావంతో కలిసి ఉండాలని, సుదీర్ఘ ఆలోచన చేసి అమరావతి, విశాఖ, కర్నూలు ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. మూడు రాజధానులతో మూడు ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందనేది మా అభిమతం.

మీకు అసలు ఒక సిద్ధాంతం ఉందా..?
మా ప్రభుత్వానిది మూడు రాజధానుల విధానం అయితే.. పవన్ కల్యాణ్ ది మూడు పెళ్ళిళ్ళ విధానం. పైగా సిగ్గులేకుండా, ప్రజలకు, కార్యకర్తలకు మూడు పెళ్లిళ్లు చేసుకోమని చెబుతావా? సిగ్గులేని సన్నాసి? ఎంత దౌర్భగ్యం. మా నాయకుడు దూరదష్టితో శతాబ్ధాలు గడిచినా మూడు ప్రాంతాల ప్రజలంతా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలనే యోచనతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, అభివృద్ధి, సంక్షేమం గడప గడపకు వెళ్లాలని సుదీర్ఘ ఆలోచన చేస్తున్నారు. నువ్వు మాత్రం మూడు పెళ్లిళ్లు… ముగ్గురు పెళ్లాలు అని మాట్లాడతావా? ఎవడు ఏ పార్టీతో ఎప్పుడు జత కడతాడు? ఎవడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడు? ఎవడు ఏ పార్టీకి విడాకులు ఇస్తాడు? మీ చరిత్ర ఏంటో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ 2014లో బీజేపీతో కలిసి పోటీ చేసి ముచ్చటగా మూడు ముక్కలై… ఆ తర్వాత బాబు పోయి కాంగ్రెస్ పంచన చేరాడు. పవన్ కల్యాణ్, చంద్రబాబును తిట్టి కమ్యూనిస్టులతో చేరాడు. ఆ తర్వాత విడాకులు ఇచ్చిన బీజేపీతోనే మళ్లీ పొత్తు పెట్టుకున్న ఘనుడు పవన్ కల్యాణ్. పొద్దున బీజేపీకి విడాకులు ఇచ్చి, సాయంత్రం చంద్రబాబును కలిశాడు.

అసలు మీ సిద్ధాంతాలు ఏంటో చెప్పాలి? అధికారం కోసం అర్రులు ఇంతగా అర్రులు చాస్తారా?. మీ రాజకీయ పార్టీలకు ఒక సిద్ధాంతం, విలువలు, విధానం, నీతి,నిజాయితీ ఏ కోశాన అయినా ఉన్నాయా?
ఎంతమంది కలిసినా.. జగన్ ని ఇంచి కూడా కదిలించలేరు .విలువలు లేని, సిద్ధాంతాలు లేని, మీ పార్టీలను ప్రజలంతా గమనిస్తున్నారు. 2019 ఎన్నికల్లో మిమ్మల్ని పాతరేసిట్లుగా, మీరంతా కట్ట కట్టుకుని వచ్చినా… జగన్ మోహన్ రెడ్డి వెంటే, ప్రజలంతా ఒకే త్రాటిమీద నడుస్తారు. కులాల్ని రెచ్చగొడుతున్నావే? అసలు రాజకీయ పార్టీకి కులం ఉంటుందా? పార్టీ పెట్టినోడికి కులం ఉంటుందా?. ముఖ్యమంత్రి జగన్ గారు అందరి వాడు. ప్రతి కుటుంబంలో ఆయన కుటుంబ సభ్యుడిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని వారికి దూరం చేయాలని ఎన్ని కుట్రలు చేస్తున్నారు. హింసను ప్రేరిస్తారా? మంత్రులపై దాడి చేయిస్తారా? సైకోలను ప్రేరేపిస్తారా?

దానికి చంద్రబాబు నాయుడు మద్దతు తెలుపుతూ పవన్ కల్యాణ్ ను పరామర్శించడమా?. ఇంతకాలం వేసుకున్న ముసుగు తీసేసి మళ్లీ పొత్తుకు సిద్ధం అయిపోయారు. ఎన్ని పార్టీలు మార్చుతారు? ఎన్ని పార్టీలతో అంటకాగుతారు? మీ లక్ష్యం ఒకటే. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డిగారిని ఓడించాలనే తపన, ఆరాటమే. మీ తపన తపనగానే మిగిలిపోతుంది. జగన్ మోహన్ రెడ్డి ని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని … చంద్రబాబు, పవన్ … ఎక్స్ ట్రా.. ఎక్స్ ట్రా… ఎంతమంది కలిసి వచ్చినా ఇంచి కూడా కదిలించలేరు. నీకు సినిమాల్లోనే ఖలేజా ఉంటే.. మాకు, మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కి నిజ జీవితంలో ఖలేజా ఉంది.

Leave a Reply