-చెల్లికి న్యాయంచేయని జగన్ మహిళా లోకానికి చేస్తారా?
-కల్తీమద్యంతో వందలాది మహిళల తాళిబొట్లు తెంచిందెవరు?
-తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ
పిన్నమ్మ తాళి తెంచిన జగన్ రెడ్డి ముఠాకు మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా? జిప్పుతీసి చూపిన ఎంపిని సమర్థించిన ఉషశ్రీ చరణ్ కు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా?నాసిరకం మద్యంపోసి డజన్ల కొలదీ మహిళల మాంగల్యాలు మంటగలిపిన జగన్ రెడ్డి ముఠాకు మహిళల గురించి మాట్లాడే నైతికహక్కు లేదు. మద్యనిషేధం చేస్తామని ఓట్లేయించుకుని మద్యన్ని తాకట్టుపెట్టి వేలకోట్లు అప్పులు తెచ్చిన వీరు మహిళల గురించి మాట్లాడటమంటే దెయ్యాలు వేదాలు వల్లించడమే.
హిందూపురంలో వైసిపి నేత రామకృష్ణారెడ్డిని హత్యచేసి ఆయన భార్య తాళితెంచిన ఎమ్మెల్సీని నిలదీయలేని ఉషశ్రీచరణ్ మహిళల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అభయహస్తం నిధులు 2100 కోట్లు దారిమళ్లించి మహిళల నోరుకొట్టిన వైకాపా ముఠాకి మహిళల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? మూడున్నరేళ్లుగా పెళ్లికానుకలకు ఎగనామం పెట్టిన వీరికి మహిళల మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెంచి వంటింటినీ అల్లకల్లోలం చేసిన వైకాపాకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన చట్టం ప్రకారం మహిళలకు సమానహక్కు ఉండగా, ఆ చట్టానికి తూట్లు పొడుస్తూ షర్మిల కు ఆస్తిలో వాటా ఎగ్గొట్టిన జగన్ రెడ్డికి మహిళల గురించి మాట్లాడే హక్కు ఉందా? చెల్లెలు డాక్టర్ సునీతకే రక్షణ కల్పించలేని జగన్ కు మహిళల రక్షణ గురించి మాట్లాడే హక్కు ఉందా? మహిళలపట్ల జగన్ రెడ్డి ముఠావి ముసలికన్నీరు మాత్రమే.