– బీసీల ద్రోహి కాబట్టే, బీసీలసభకు జగన్ రెడ్డి సరైన పేరుకూడా పెట్టలేకపోయాడు. జగన్ పెడుతున్నది బీసీద్రోహుల భజనసభ. చంద్రబాబు వస్తేనే బీసీల జీవితాల్లో సుఖసంతోషాలు.
• మూడున్నరేళ్లలో ఒక్క బీసీకైనా జగన్ న్యాయంచేశాడా?
• 34శాతం బీసీరిజర్వేషన్లు, 24శాతానికి తగ్గించి 16,800 స్థానికసంస్థల పదవుల్ని బీసీలకు లేకుండా చేసినందుకు జగన్ బీసీసభ పెడుతున్నాడా?
• టీడీపీప్రభుత్వం బడ్జెట్లో బీసీసంక్షేమానికి రూ.38వేలకోట్లుకేటాయించి, రూ.32వేలకోట్లు ఖర్చుపెట్టింది మరి జగన్ రెడ్డి మూడున్నరేళ్లలో ఎంత ఖర్చు చేశారో చెప్పే ధైర్యం ఉందా?
• ఎన్నికుట్రలు, కుతంత్రాలుచేసినా బలహీనవర్గాలు తనకు, తనతండ్రికి సహకరించలేదన్న అక్కసు జగన్ నరనరాల్లో ఉంది.
• 56 మంది బీసీకార్పొరేషన్ల ఛైర్మన్లు, 652 డైరెక్టర్లు, బీసీలకు ఏం చేశారని ప్రశ్నిస్తున్నాం?
• రెండేళ్లు పదవిలో ఉండి, రూ.36కోట్ల ప్రజలసొమ్ము తినేశారు
బలహీనవర్గాలను తెలుగుదేశం నుంచి వేరుచేయాలన్న కుటిల బుద్ధితోనే జగన్ బీసీల జపం మొదలెట్టాడు : కింజరాపు అచ్చెన్నాయుడు
“తెలుగుదేశం అంటే బీసీలు, బీసీలంటే తెలుగుదేశంపార్టీ. తెలుగుదేశం పార్టీ స్థాపించాకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బలహీనవర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా గుర్తింపు లభించింది. 40ఏళ్ల టీడీపీ సుదీర్థ ప్రయాణంలో నిరంతరం పార్టీకి అండదండగా నిలిచింది బలహీనవర్గాలే. రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి బలహీనవర్గాలపై కక్షకట్టారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయావర్గాలు తమకు సహకరించడం లేదన్న అక్కసు వారి నరనరా ల్లో ఉంది. బలహీనవర్గాల్ని తెలుగుదేశంపార్టీ నుంచి విడదీయాలన్న కుటిల బుద్ధితోనే జగన్ ఈ మధ్య బీసీల జపంచేస్తున్నాడు.
2.14కోట్ల మంది బీసీలుంటే, 47లక్షలమందికి అరకొరసాయం చేస్తే ఉద్ధరించినట్టా?
జగన్ రెడ్డి తనపాలనలో బలహీనవర్గాలకు ప్రత్యేకంగా ఏంచేశాడో చెప్పగలడా? రాష్ట్రంలో 139బీసీ కులాలు, 2.14 కోట్ల మంది బీసీలుంటే, జగన్ రెడ్డి నవరత్నాల సాయం కేవలం 4.7లక్షలమందికే అందుతోంది. మిగిలిన వారంతా బలహీనవర్గాలు కాదా.. లేక వారు తనపార్టీ వారు కాదని జగన్ రెడ్డి వారిని విస్మరించాడా అని ప్రశ్నిస్తున్నాం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోనే బలహీనవర్గాలు బాగుపడతాయనే వాస్తవాన్ని జగన్ విస్మరించాడు. చంద్రబాబు హాయాంలో బలహీనవర్గాలకోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకల్పనా కేంద్రాలుగా విలసిల్లాయి. జగన్ రెడ్డి కులాలవారీగా ఏర్పాటుచేసిన కార్పొరేషన్లు అలంకారప్రాయంగా మారాయి. ఒక్క కార్పొరేషన్ కు కూడా రూపాయి కేటాయించింది లేదు. టీడీపీప్రభుత్వంలో ఎన్నిబీసీ కార్పొరేషన్లు ఏర్పాటుచేసి, ఎన్ని నిధులు ఇచ్చామో చెప్పడానికి మేం సిద్ధం. జగన్ రెడ్డి సిద్ధమా? టీడీపీ ఐదేళ్ల పాలనలో కార్పొరేషన్ల ద్వారా సుమారు 3.75లక్షల మందికి రూ.లక్ష సబ్సిడీతో రుణాలిచ్చాము. రూ.2 లక్షల రుణాలిచ్చి స్వయంఉపాధి కల్పించాము. ఫెడరేషన్ల ద్వారా 75000 గ్రూపులకు రుణాలిచ్చి, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు దిశగా బలహీనవర్గాలను ప్రోత్సహించాము. మూడున్నరేళ్ల తనపాలనలో జగన్ రెడ్డి ఒక్కబీసీకి, ఒక్కపైసా రుణమైనా ఇచ్చాడా? ఒక్కరికైనా స్వయంఉపాధి కల్పించాడా? జగన్ రెడ్డి ఏర్పాటుచేసిన బీసీకార్పొరేషన్లు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావు. తన ప్రభుత్వంలో ఒక్క బీసీకైనా న్యాయంచేసినట్టు జగన్ చెప్పగలడా?
తన మాట వినరనే బలహీనవర్గాలపై జగన్ రెడ్డికి కక్ష…
బలహీనవర్గాలు బాగుంటే తన మాట వినరు, తనకు ఓట్లేయరన్న అక్కసుతోనే వారికి గతప్రభుత్వాలు అమలుచేసిన పథకాలన్నింటినీ రద్దుచేశాడు. 50శాతం ఉన్న బలహీనవర్గాలకు చంద్రబాబు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ పెట్టి రూ.34వేలకోట్ల నిధులిస్తే, జగన్ రాగానే ఆ నిధులు దారిమళ్లించాడు. జగన్ కు దమ్ముంటే ఆ వివరాలు, లెక్కలు అన్నీబయటపెట్టాలి. ఎన్టీఆర్, చంద్రబాబు బీసీలకు రాజ్యాధికారం కల్పించేందుకు స్థానికసంస్థల్లో రిజర్వేషన్లు పెడితే, జగన్ రెడ్డి వచ్చాక వాటిని 10శాతం తగ్గించాడు. రాష్ట్రవ్యాప్తంగా 16,800 మంది బీసీలకు పదవుల్ని దూరంచేశాడు. జిల్లాపరిషత్ ఛైర్మన్లు, మండలపరిషత్ ఛైర్మన్ల వంటి
పదవులు లేకుండా చేశాడు. చంద్రబాబుగారు ఆదరణ పథకం కింద చేతి, కులవృత్తుల వారికి సాయం చేసేందుకు ప్రభుత్వం 90శాతం వాటాతో, లబ్దిదారులు 10శాతం వాటాతో వారుకోరిన పనిముట్లు, పరికరాలు పంపిణీచేశారు. ఆ పరికరాలు అన్నీ జగన్ రెడ్డివచ్చాక గోదాముల్లో తుప్పుపట్టి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. బలహీనవర్గాల లబ్దిదారులు తమవాటాకింద చెల్లించిన రూ.47కోట్ల సొమ్ముని కూడా జగన్ దిగమింగాడు. చంద్రబాబు పాలన బలహీనవర్గాలకు ఎనలేని సుఖ సంతోషాలనిచ్చి పండుగలా సాగింది. పెళ్లికానుక, చంద్రన్నబీమా, బీసీ యువత విదేశాల్లో చదువుకునేందుకు విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, స్టడీసర్కిళ్ల ద్వారా గ్రూప్స్, సివిల్స్ వంటి ఉన్నత ఉద్యోగాలకు కోచింగ్ ఇవ్వడం వంటివి చంద్రబాబు అమలు చేశారు. ఈ విధంగా గతంలో బీసీలకు పథకాలిచ్చి, వారిని ఆర్ధికంగా నిలదొక్కుకునేలా, రాజకీయంగా ఎదిగేలా అమలుచేసిన అన్నిపథకాలను జగన్ రద్దుచేశాడు.
బీసీలను దారికితెచ్చుకోవడానికే నాలాంటి బీసీ నేతలపై తప్పుడు కేసులు…
బీసీలకు మేథాసంపత్తి, వాక్చాతుర్యం ఉన్నాయి. వాటిని చూసిఓర్వలేకనే జగన్ బీసీ నేతలపై తప్పుడుకేసులు పెట్టి, వారిని జైళ్లకు పంపుతున్నాడు. టీడీపీలోఉన్నామన్న అక్కసుతో, నాతో సహా ఎంతో మంది టీడీపీ నేతలపై తప్పుడుకేసులు పెట్టంచి, రాక్షసానందం పొందాడు. బీసీలుగా పుట్టడమే తాము చేసిన తప్పా? బీసీలపై జగన్ రెడ్డికి ఎందుకింత కక్ష. బీసీల ప్రేమాభిమానాలు చూరగొనాలంటే జగన్ వారికి మంచిచేయాలిగానీ, కక్షసాధింపులతో కాదు. జగన్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ఛైర్మన్లు అంతా వారివారి కులాల్లో నగుబాట్లకు గురై అవమానంతో చచ్చిపోతున్నారు. ముఖ్యమైన పదవులు, నిధులున్నస్థానాలను తనవర్గాలకు కట్టబెట్టిన జగన్ రెడ్డి, ఉత్సవవిగ్రహాల్లాంటి పదవులు, పైసా నిధులులేని కార్పొరేషన్లను బీసీలకు ఇచ్చాడు. వెన్నెముక, నోట్లోనాలుక లేకుండా మంత్రులుగా ఉన్న వైసీపీ బీసీ నేతలతో బీసీలకు ఈ ప్రభుత్వంలో ఏం ఒరిగింది? బలహీనవర్గాల గౌరవం, ఆత్మాభిమానాన్ని జగన్ రెడ్డి నడిబజారులో పడేసినా స్పందించలేని దుస్థితిలో బీసీమంత్రులు ఉన్నారు. బీసీమంత్రులకు సిగ్గుందా అని ప్రశ్నిస్తున్నాం. ఒక మంత్రి వై.వీ.సుబ్బారెడ్డి కాళ్లకు మొక్కుతాడు. మరోమంత్రి విజయసాయి ముందు చేతులు కట్టుకుంటాడు. బొత్స సత్తిబాబు నోరెత్తితే ఏం చేస్తారో అనే భయంతో బతుకుతున్నాడు.
రేపటి బీసీల సభ కూడా అట్టర్ ప్లాపే….
బీసీలకోసం జగన్ రెడ్డి ‘జయహోబీసీ’ కార్యక్రమం పెట్టాడు. జయహోబీసీ పేరు ఎవరిది? 2018లో చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకోసం రాజమహేంద్రవరంలో నిర్వహించిన సభకు ఆపేరు పెట్టాం. సొంతంగా పేరుపెట్టుకోలేని బడుద్దాయిలు బీసీలను ఉద్ధరిస్తారా? బస్సులు పెట్టి, భోజనాలు పెడతామని చెప్పి, వేల మందిని తరలించాలని చూస్తున్నారు. రాయలసీమలో గర్జన అన్నారు. 10రోజులు మంత్రులంతా అక్కడే ఉండి, వందల కోట్ల డబ్బు కుమ్మరించి ప్రచారంచేసి, బలవంతంగా ప్రజల్ని తరలించినా, ఆ కార్యక్రమం అట్టర్ ప్లాప్ అయ్యింది.
రేపటి బీసీల సభ పరిస్థితి కూడా అదే విధంగా అట్టర్ ఫ్లాప్ కాబోతోంది
సామంతరాజుల్ని పెట్టి పెత్తనం చేస్తుంటే, బీసీ మంత్రులు నోరెత్తలేని స్థితిలో ఉన్నారు…
రాష్ట్రాన్ని ఐదుగురు సామంతరాజులు ఏలుతుంటే, బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు నోరెత్తలేని స్థితిలో ఉన్నారు. బీసీ మంత్రులు ఎవరైనా సరే, ఉత్తరాంధ్రలో సొంతంగా ఒక కానిస్టేబుల్ ని బదిలీ చేయించగలరా? సజ్జల రామకృష్ణారెడ్డి, అయోధ్యరామిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు జగన్ కు సామంతరాజుల్లా పనిచేస్తున్నారు. రెడ్లకు పెత్తనం అప్పగించిన జగన్, బీసీలకు న్యాయంచేస్తున్నానని చెప్పడం వారిని మోసగించడం కాదా? బీసీమంత్రులు ఇప్పటికైనా రాష్ట్రంలోని బీసీలకు జరుగుతున్న అన్యాయంపై నోరువిప్పాలి. లేకుంటే బీసీ ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారు. బీసీ కులాలన్నీ ఏకమై, ఒక్కతాటిపైకి వచ్చి, ఈ ప్రభుత్వంపై, జగన్ రెడ్డిపై పోరాటం చేయడానికి సిద్ధమయ్యాయి. జగన్ ను, వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపకపోతే, రాష్ట్రంలోని బీసీలకు మనుగడ లేదని ఘంటాపథంగా చెబుతున్నారు.”
ఏం పీకావని 175స్థానాలు వస్తాయి జగన్ రెడ్డి? : చింతకాయల అయ్యన్నపాత్రుడు
“జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని కులాలకు తీవ్ర నష్టం జరుగుతోంది. హింసించే రాజు పులకేశి సినిమా చూస్తే జగన్ రెడ్డే గుర్తొచ్చాడు. సినిమాలో హీరో వేషధారి మీసం… ఆ హావ భావాలు అన్నీ జగన్ రెడ్డిమాదిరే ఉన్నాయి. జగన్ రెడ్డి కూడా ఆ సినిమా ఒకసారి చూస్తే తాను ఎంతటి మూర్ఖుడో వారికే అర్ధమవుతుంది.
‘బీసీగర్జన’ ఎందుకోసం పెడుతున్నారో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. బీసీలను అడుగడుగునా అణగదొక్కుతూ, అరాచకానికి బలిస్తూ.. బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా? 34శాతం బీసీ రిజర్వేషన్లు 24శాతానికి తగ్గించినందుకు గర్జన పెడుతున్నావా? 26 మందిని హత్య చేసినందుకు పెడుతున్నారా? వందలాదిమందిపై దాడులు చేసి, అక్రమ కేసులు పెట్టినందుకు సభ పెడుతున్నారా? బీసీలకు తానేం చేశాడో జగన్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయగలడా?
పదవులు రెడ్లకు, పనికిమాలిన స్థానాలు బీసీలకా?…
ఎన్టీఆర్, చంద్రబాబు బీసీలను నాయకుల్ని చేస్తే.. జగన్ రెడ్డి పదవులన్నీ రెడ్లకు కట్టబెట్టి.. పనికిమాలిన, నిధులు, విధులు లేని స్థానాల్లో బీసీలను నియమించి నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో ఎందరు బీసీలున్నారు? యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లలో ఎంతమంది బీసీలు ఉన్నారు? ఏం పీకావని 175స్థానాలు ఇవ్వాలి జగన్ రెడ్డి? పరిపాలించడం చేతగాని వ్యక్తికి 54 మంది సలహాదారులా? ఆ సలహాదారుల్లో ఒక్కరైనా బీసీ ఉన్నారా? 56 మంది బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, బీసీలకు ఏం చేశారు? రెండేళ్లు పదవుల్లో ఉండి, రూ.36కోట్ల ప్రజల సొమ్ము జీతాలుగా తినడం తప్ప.. వారి కులాలకు రూపాయి అయినా మేలు చేశారా? పోలవరం ప్రాజెక్ట్ కట్టి ఉంటే, ఉత్తరాంధ్రప్రాంత బీసీలకు ఎంతో మేలు జరిగేది. సుజల స్రవంతి ప్రాజెక్ట్ ను ఎందుకు పూర్తిచేయలేకపోయావు? ఎంతమంది వచ్చినా తనవెంట్రుక కూడా పీకలేరంటున్నాడు. రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా కులాలు, మతాలకు అతీతంగా జగన్ రెడ్డికి సమాధికట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నీ రాజ్యంలో అన్నివర్గాల ప్రజలు ఏడుస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని బీసీలు జగన్ కు సమాధికట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఏం నష్టం జరిగిందని ఆదరణ పథకం ఆపేశావు?
భారతికి ప్యాలెస్ కట్టడానికి రుషికొండకు బోడిగుండు కొడుతున్నారు
ఇసుక, మైనింగ్, మద్యం మాఫియాల్లో మునిగితేలుతున్నారు. అదిచాలక నీ భార్య పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బయటకొచ్చింది. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి, ప్రజలు తన్నుకునేలా చేసి అధికారంలోకి రావాలనుకుంటున్నాడు. అందుకే రాయలసీమ గర్జన, బీసీ గర్జన అంటున్నాడు. ఉత్తరాంధ్రను కేటుగాడు విజయసాయికి అప్పగించి, మొత్తం దోచేస్తున్నారు. భారతి రెడ్డికి ప్యాలెస్ కట్టడానికి జగన్ రెడ్డి రుషికొండకు బోడిగుండు కొట్టేశాడు. రూ.40వేలకోట్ల విలువైన భూముల్ని కబ్జాచేసి, వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు కొట్టేస్తున్నారు. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుకి చేతగాదని జగన్ రెడ్డి, విజయసాయిని అక్కడ సామంతరాజుగా నియమించాడా? పోలీసుల్లేకుండా రోడ్డుపైకి వచ్చే ధైర్యం జగన్ కు ఉందా? ఏ మీటింగ్ కు వెళ్లినా, పరదాలు కట్టుకొని పోవాల్సిందే. అప్పులపాలైన రాష్ట్రానికి మరింత నష్టం చేకూర్చకుండా జగన్ రెడ్డే ఒకపరదా కప్పుకొని వెళ్తే మంచిది. మన రాష్ట్ర భవిష్యత్, పిల్లల భవిష్యత్ కోసం చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం ప్రజలంతా ఏకంకావాల్సిన సమయం వచ్చింది. బీసీల బతుకులు బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిందే.”
1983లో బీసీలకు 90 స్థానాలిచ్చి తెలుగుదేశం చరిత్ర సృష్టించింది : మాజీమంత్రి కళావెంకట్రావు
బీసీల బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం. బీసీల విషయంలో జగన్ వైఖరి, పులిని చూసి పిల్లివాతలు పెట్టుకున్నట్టుంది. 1983లో 90స్థానాలు బీసీలకు ఇచ్చి, వారిని రాజకీయాల్లో కీలకమైన వారిగా మార్చింది తెలుగుదేశంపార్టీ. రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న బీసీలకు న్యాయం చేయడానికి రహస్యంగా సాగే పరిపాలనను ఎన్టీఆర్, చంద్రబాబు ప్రజల వద్దకే పాలన అంటూ పరిపాలనను ప్రజల ముందుకు తెచ్చారు. టీడీపీ నుంచి బీసీలను వేరు చేయడం ఎవరివల్లాకాదు. జగన్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయి గానీ, బీసీలకు చేయడానికి మనసురాదు.
మండల వ్యవస్థ తీసుకొచ్చి, బీసీలను రాజకీయంగా పైకి తెచ్చింది తెలుగుదేశమే…
మండల వ్యవస్థను తీసుకొచ్చి, ప్రజలకు పాలన చేరువ చేయడం ద్వారా తెలుగుదేశం బీసీలను రాజకీయంగా ఎదిగేలాచేసింది. 300 సమితులను, 1020 మండలాలుగా మార్చిన చరిత్ర తెలుగుదేశానిదే. బీసీలు రాజకీయంగా ఎదగడం కోసం ఏం చేయాలనే దానిపై టీడీపీ ప్రభుత్వం 1986లో మంత్రులకమిటీ వేసింది. మహిళా రిజర్వేషన్లతోపాటు, బీసీలకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చింది ఎన్టీఆర్, చంద్రబాబులే. దేశంలో తొలుత పింఛన్ ఇచ్చింది తెలుగుదేశంపార్టీ, స్వర్గీయ అన్న ఎన్టీఆర్ లే. స్వర్గీయ ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా ఉన్నప్పుడే మండల్ కమిషన్ ఏర్పాటైంది. ఐఏఎస్, ఐపీఎస్ ల ఎంపికలో బీసీలకు ప్రాతినిధ్యం దక్కింది. కేంద్ర ప్రభుత్వం, 50శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాతో బీసీ ఫైనాన్ష్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. బీసీల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టింది తెలుగుదేశం. టీడీపీ రాకముందు బీసీలకు సరైనఇళ్లుకూడా లేవు. దళితులు, బలహీనవర్గాలకు శాశ్వతంగా ఉండేలా ఇళ్లు కట్టించింది టీడీపీనే. జగన్ రెడ్డి బీసీలకు చేస్తున్నది శూన్యం. మూడున్నరేళ్లలో బీసీలకు ఏంచేశాడో, ఎంతఖర్చుపెట్టాడో చెప్పగలడా? జగన్ రెడ్డి పెట్టిన 56 కార్పొరేషన్లతో బీసీలకు ఏంచేశావు? జగన్ పాలనలో ఉపాధి, కంపెనీల అడ్రస్ ఎక్కడుంది? దోపిడీదారులు, కబ్జాకోరులు, కేసులున్నవారిని టీటీడీ బోర్డులో వేస్తారా? చట్టం, న్యాయం సక్రమంగా పనిచేయకపోతే, అంతిమంగా నష్టపోయేది బీసీలు, ఎస్సీ, ఎస్టీలే. హరిజన, గిరిజన, బడుగుబలహీన వర్గాల్నికూడా దోపిడీచేస్తూ, అవినీతిలో మునిగి తేలుతున్న జగన్ రెడ్డిని, ఆయనపార్టీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాల్సిన సమయం వచ్చింది. చంద్రబాబు గారు వస్తేనే రాష్ట్రసర్వతోముఖాభివృధ్ధి సాధ్యమవుతుంది. బలహీనవర్గాల ప్రజలంతా ప్రజల్ని, రాష్ట్రాన్ని కాపాడటానికి చంద్రబాబుగారితో చెయ్యి కలపాలి.” బీసీలంతా ఏకమై జగన్ రెడ్డికి ఘోరీ కట్టి బంగాళాఖాతంలో పడేసేందుకు సిద్ధమయ్యారు. కట్టుబానిసలుగా చూడాలనుకుంటున్న బీసీల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాం
బండెనక బండి కట్టి.. 54 బండ్లు కట్టి జగన్ రెడ్డి పాలనకు చెరమగీతం పాడుతాం : కొల్లు రవీంద్ర
“బీసీల సభకు పేరుపెట్టుకోవడానికి జగన్ రెడ్డికి దిక్కులేదు. జగన్ రెడ్డి పెడుతున్నది బీసీ మహాసభ కాదు… బీసీ ద్రోహుల భజన సభ. మూడున్నరేళ్లలో బలహీనవర్గాల్ని దగాచేసి, నిలువునా వంచించి సిగ్గులేకుండా సభలు పెడతారా? టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో సబ్ ప్లాన్ ద్వారా రూ.36 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తే.. జగన్ రెడ్డి మూడున్నరేళ్లలో రూపాయి కూడా ఖర్చు చేయలేదన్న విషయం వాస్తవం కాదా? జగన్ ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టడం నిజం కాదా. 56 కార్పొరేషన్లతో ఒక్క బీసీకి మేలు జరిగిందని జగన్ రెడ్డి చెప్పగలడా? జగన్ రెడ్డి ప్రాపకం కోసం కాళ్లు నొక్కుతూ బీసీ కులాలను తాకట్టుపెట్టే వైసీపీలోని ప్రతి బీసీ నాయకుడూ బీసీ ద్రోహే. రాష్ట్రంలో దాదాపు 140 బీసీ కులాలుంటే, ఏ కులానికి ఏం సాయంచేశాడో, కులాలవారీగా ఎందరు బీసీలకు, ఎలాంటి సాయం చేశాడో జగన్ రెడ్డి చెప్పగలడా?
టీడీపీ అమలుచేసిన పథకాలు రద్దు చేయడం బీసీ సంక్షేమమా?
టీడీపీ ప్రభుత్వం బీసీల సర్వతోముఖాభివృద్ధి కోసం అమలుచేసిన వందలాది బీసీ పథకాలకు పేర్లు మారిస్తే, బీసీలకు మంచి జరుగుతుందా? చంద్రబాబు గారు ఫెడరేషన్ల ద్వారా బీసీలకు ఎంతమొత్తం ఇచ్చారో చెప్పగలం.. మీప్రభుత్వంలో మీరు ఏమి ఇచ్చారో చెప్పగలరా? నాయీబ్రాహ్మణులు, రజకులు రాష్ట్రంలో ఎంతమంది ఉంటే, ఎందరికి సాయంచేశారు? దర్జీల్లో ఎక్కువమంది బీసీలుంటే, వారికి అన్యాయంచేశారు. జీవోనెం – 217తో మత్స్యకారుల జీవితాల్ని రోడ్డునపడేసింది జగన్ రెడ్డికాదా? ఫీజురీయిబర్స్ మెంట్ కింద 16లక్షలమంది విద్యార్థులు టీడీపీప్రభుత్వంలో లబ్ధి పొందితే, జగన్ రెడ్డి వచ్చాక ఆ సంఖ్య 10లక్షలకు తగ్గించడం ద్రోహం కాదా? టీడీపీ హాయాంలో బీసీవిద్యార్థులకు విదేశీవిద్య, స్టడీసర్కిళ్లు, స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు పెట్టి విద్యాపరంగా ప్రోత్సాహం అందించాం. కానీ నేడు కేసులు పెట్టి బీసీనేతల్ని భయపెట్టి, తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలని జగన్ రెడ్డి చూస్తున్నాడు. కల్లబొల్లిమాటలు, సభలతో బలహీన వర్గాల్ని మోసగించడం నీతరం కాదు జగన్ రెడ్డి. నీ మోసాలు బయటపెట్టి, నీకు ఘోరి కట్టేవరకు టీడీపీ బీసీయంత్రాంగం నిద్రపోదు. కట్టుబానిసలుగా చూడాలనుకుంటున్న బీసీల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాం. జగన్ రెడ్డి బీసీ దగాను ఎండగట్టేందుకు 54 సాధికార కమిటీలు ఏర్పాటు చేశాం. ఆకమిటీలతో.. బండెనక బండి కట్టి.. 54 బండ్లు కట్టి జగన్ రెడ్డి పాలనకు చెరమగీతం పాడుతాం.”
బీసీలసభలో మూడున్నరేళ్లలో దోచుకున్నసొమ్ము వివరాలు బయటపెట్టగలరా : బుద్దా వెంకన్న
“బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి. మూడున్నరేళ్లలో బీసీల సంక్షేమాన్ని గాలికొదిలేసిన వ్యక్తికి జయహో బీసీ అని నినదించే అర్హత ఎక్కడిది? వైసీపీకి దమ్మూ, ధైర్యం ఉంటే జయహో బీసీ సభలో ఈమూడున్నరేళ్లలో దోచుకున్న దోపిడీసొమ్ము వివరాలు బయటపెట్టండి. ఉత్తరాం ధ్రలో ఎక్కువ శాతం నివసించే బీసీలను దోచుకోడానికి విజయసాయి రెడ్డి అనే కేటుగాడిని జగన్ రెడ్డి ఇన్ చార్జ్ గా వేశాడు. కోతి నుంచి మనిషి వచ్చాడనడానికి విజయ సాయే నిదర్శనం. ఇప్పటికే ఉత్తరాంధ్రలో రూ.50 వేలకోట్ల ఆస్తులను పండుకోతి విజయసాయి దోచుకున్నాడు. బీసీల సమాధులపై పునాదులు వేసుకున్న చరిత్ర వైఎస్ కుటుంబానిది. బీసీ కులానికి చెందిన వ్యక్తి జింకా వెంకట నర్సయ్య దగ్గర రోజువారీ కూలీగా చేరిన రాజారెడ్డి అతన్నే చంపాడు. అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర సహా పలువురు బీసీ నేతలపై అక్రమ కేసులపై పెట్టి జైలు పాల్జేశారు. మాపై దాడులు చేయించారు. బీసీలు ఉన్నత స్థానాల్లో ఉండకూడదని, రాజకీయంగా ఎదగకూడదని జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. బీసీలను అణగదొక్కుతున్నాడు. చంద్రబాబు సభలకు బీసీలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయడంతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది. అందుకే జయహో బీసీ అంటూ నేలవిడిచి సాముచేస్తున్నాడు. ప్రభుత్వం పెట్టే సభకు వెళ్లేందుకు బీసీలెవరూ సిద్ధంగాలేరు. బీసీల అభ్యున్నతికి పాటుపడింది ఒక్క చంద్రబాబు గారే. జగన్ రెడ్డి బీసీలకు చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా కలెక్టరేట్ల ఎదుట నిరసన తెలుపుతాం.”
జయహో బీసీ కార్యక్రమం పచ్చిబూటకం : దువ్వారపు రామారావు
“టీడీపీ, బీసీలు అవిభక్త కవలలు. ఈ రెంటినీ వేరుచేసి చూడటం అసాధ్యం. వైసీపీ నిర్వహించనున్న జయహోబీసీ కార్యక్రమం పచ్చిబూటకం. అన్న ఎన్టీఆర్ టీడీపీ స్థాపించినప్పటి నుంచి బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నారు. ఎంతోమంది బీసీ నేతలకు రాజకీయ జీవితం ఇచ్చారు. చంద్రబాబు గారు బీసీల సంక్షేమానికి అనేక పథకాలు తెచ్చా రు. బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి ప్రతి ఏడాది రూ.10 వేల కోట్ల చొప్పన కేటాయించారు. నాలుగున్నరేళ్లలో రూ.37 వేలు ఖర్చు చేశారు. అత్యంత వెనుకబడిన 32 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు గారిదే. జయహో బీసీ గర్జన అని మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదు. ఈ మూడున్నరేళ్ల జగన్ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. మన బీసీలకు న్యాయం జరగాలంటే మళ్లీ చంద్రబాబు గారు అధికారంలోకి రావాలి. చంద్రన్నను గెలిపించుకోవాల్సి బాధ్యత మన బీసీలందరిపై ఉంది.”
బీసీ సభ ఎందుకు పెడుతున్నావో చెప్పు జగన్ రెడ్డి? : రెడ్డి సుబ్రమణ్యం
“ఇదేం ఖర్మ – మన రాష్ట్రానికి అని ఏపీ ప్రజలు బాధపడుతున్నారు. జయహో బీసీ నిర్వహిం చడానికి జగన్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గులేదా? మూడున్నరేళ్లలో బీసీలకు ఏంచేశారని మీరు సభ పెడుతున్నారో చెప్పాలని రాష్ట్ర బీసీల తరపున అడుగుతున్నాం. 1983లో టీడీపీ స్థాపన తర్వాత బీసీలకు స్వాతంత్ర్యం వచ్చిందన్నది ఎవరూ కాదనలేని నిజం. అన్న ఎన్టీఆర్ స్థానికసంస్థల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు ఇస్తే, వాటిని చంద్రబాబు గారు 34 శాతానికి తీసుకెళ్లారు. కానీ జగన్ రెడ్డి వాటిని 24శాతానికి కుదించి,16,800 పదవులు లేకుండా చేసినందుకు జయహో బీసీ పెడుతున్నాడా?
బీసీ సబ్ ప్లాన్ నిలిపేసింనందుకు సభ పెడుతున్నావా జగన్ రెడ్డి.. లేక ఆదరణ పథకం రద్దు చేసి 124 కులవృత్తులకు చెందిన 964 కోట్లవిలువైన 341రకాల పనిముట్లను తుప్పు పట్టించినందుకా? 24మంది బీసీ నేతలను అత్యంత క్రూరంగా హత్య చేసినందుకా లేక 650 మంది బీసీలపై మీరు దాడులు చేసినందుకు జయహో బీసీ పెడుతున్నారా? బీసీ నేత జింకా వెంకట నర్సయ్యను అత్యంత కిరాతకంగా నరికిచంపినందుకా, జీవో 217తో మత్స్యకారులను బిచ్చగాళ్లుగా మారుస్తున్నం దుకా? దేనికి సభ పెడుతున్నాడో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.
పేరుకి పదిమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి వారిపై రెడ్లతో పెత్తనం చేయిస్తున్నారు. బీసీలకు చెందిన 8 వేల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కున్నారు. బీసీలకు చెందిన రూ. 36 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. రాష్ట్రానికి పట్టిన జగన్ రెడ్డి ఖర్మ పోవాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. ప్రజలందరి మనసుల్లో ఇదేఉంది. తక్షణమే బీసీ జనగణన జరిపించాలని కేంద్రాన్ని కోరుతున్నాం. కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడంతోపాటు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.”