Suryaa.co.in

Andhra Pradesh

రామతీర్థం నుండి కపిలతీర్థం వరకు యాత్ర చేస్తాం

– హిందూ దేవాలయాలు జోలికి వస్తే సహించేది లేదు: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు
– తిరుమల తిరుపతి లో వసతి గదులు ధరలు తగ్గించాలని కోరుతూ కలెక్టరేట్ ల వద్ద బీజేపీ ధర్నా

రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు తిరుమల తిరుపతి లో వసతి గదులు ధరలు తగ్గించాలని కోరుతూ కలెక్టరేట్ ల వద్ద ధర్నా నిర్వహించారు .వైసీపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం గా బిజెపి శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు. దాదాపు అన్ని జిల్లాల కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ధర్నా లు నిర్వహించారు. ప్రభుత్వం ఈ సందర్భంగా అన్ని కలెక్టరేట్ లో వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు తో బందోబస్తు ఏర్పాటు చేసింది.

పలుప్రాంతాల్లో పోలీసులు తో బిజెపి శ్రేణులు వాగ్వాదానికి దిగారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించిన బిజెపి శ్రేణులు ను అభినందించారు రాజమహేంద్రవరం లో జరిగిన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పాల్గొన్నారు ఈసందర్భంగా పెద్ద సంఖ్యలో బిజెపి శ్రేణులు ధర్నా లో పాల్గొన్నారు.

ఈసందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం అందువల్ల అంతర్వేది, రామతీర్థం ఘటనల్లో దోషులను శిక్షించేందుకు పోయింది. ఈ ప్రభుత్వం హిందూ దేవాలయాలు విషయం లో వ్యతిరేక విధానాలను అమలు చేస్తోంది. దర్శనీయ క్షేత్రాలు లో వసతి గదులు ధరలు ఇష్టానుసారం పెంచడాన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అవసరమైతే రామతీర్థం నుండి కపిలతీర్థం వరకు యాత్ర చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హిందూ దేవాలయాలు జోలికి వస్తే సహించేది లేదన్నారు. దేవాలయాలు పరిరక్షణ కు బిజెపి శ్రేణులు ఉద్యమాలు కొనసాగిస్తాయని హెచ్చరించారు

LEAVE A RESPONSE