కంటి చూపు లేని ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతని గంజాయి మత్తులో అతి కిరాతకంగా నరికి చంపిన రాజు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన రాజు ప్రవర్తనపై అమ్మకి పెద్దమ్మకి తెలియచేసిన యువతి.. రాజుని నిలదీసిన తల్లి నాకే పాపం తెలీదు రాణి నా చెల్లి లాంటిది అని నమ్మ పలికిన ఐదు నిమిషాల్లోనే విచక్షణ కోల్పోయి గంజాయి మత్తులో టెడ్డీబేర్ తో ఆడుకుంటున్న రాణిని అతి దారుణంగా తలపై అనేకమార్లు నరకటంతో హుటా హుటిన ఆసుపత్రి తరలించిన దక్కని ప్రాణం.. హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు అనే పోలీసు తో పాటు వారి ఇంటి సమీపంలో వివాహిత మీద గతంలో గొడ్డలితో దాడి చేసిన ఘటనలు
రాజుకి పోలీసులతో ఉన్న స్నేహాల వల్ల ఇలాంటి దారుణాలు తెగబడుతున్నాడని తమ ఆవేదన వ్యక్తపరుస్తున్న స్థానిక ప్రజలు. కళ్ళు కానరాని నా కూతుర్ని అతి దారుణంగా నరికి చంపిన కఠినంగా శిక్షించాలని కన్నీటి పర్వతమైన కుటుంబ సభ్యులు… పోలీసుని కొట్టినప్పుడే రాజుపై కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఇలాంటి దుర్ఘటన జరిగే కాదని ఇతని వల్ల మాకు ఎప్పటికైనా ప్రమాదమే అని తమ ఆవేదన తెలుపుతున్న సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా నివసిస్తున్న బాధితులు. ఘటనా స్థలంలో మారణాయుధాన్ని స్వాధీనం విచారణ చేపట్టిన తాడేపల్లి పోలీసులు…