• జగనాసుర రక్త చరిత్ర పుస్తకం ముద్రించింది తెలుగుదేశం పార్టీనే. అవగాహన లేకుండా మీ మంత్రులు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారు. ధైర్యం ఉంటే జగనాసుర రక్తచరిత్ర పుస్తకంపై బహిరంగ చర్చకు మీ పార్టీ నాయకులను పంపగలారా?
• రాష్ట్ర ప్రజలంతా వివేకాను చంపిన అసలు హంతకులెవరో తెలుసుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. జగన్ ఇప్పటికైనా నోరు విప్పాలి.
• ప్లేస్, టైం, డేట్ మీరు చెప్పినా సరే…మమ్మల్ని చెప్పమన్నా సరే…మేం సిద్ధం….మీరు సిద్ధమా జగన్?
• మా పార్టీ నుండి ఇద్దరం వస్తాం…మీ పార్టీ నుండి ఇద్దర్ని పంపండి…ముగ్గురు సీనియర్ అడ్వొకేట్ల సమక్షంలో ప్రజాక్షేత్రంలో దీనిపై చర్చిద్దాం..
• 2019, మార్చి 19న సీబీఐ దర్యాప్తు కోరిన మీరు 06-02-2020న హైకోర్టులో ఈ పిటిషన్ ను ఎందుకు వెనక్కి తీసుకున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పగలరా?
• జగన్ రెడ్డి నేటికీ తన బాబాయ్ హత్యపై మౌనం పాటిస్తున్నారు..ఆరోపణలు వస్తున్నా మౌనంగా ఉన్నారు…దీని వెనుక అంతరార్థం ఏంటి?
• అన్ని వేళ్లూ మీ వైపు చూపిస్తున్నప్పుడు మీరు మౌనం వీడి వివేకా హత్యలో మీపాత్ర గురించి రాష్ట్ర ప్రజలకు చెప్పాలి.
• జగనాసుర రక్త చరిత్ర నేడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
• ఈ పుస్తకం విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులే…
• ఇంటింటికీ ఈ పుస్తకాన్ని పంచే కార్యక్రమాన్ని టీడీపీ చేపట్టబోతోంది..రాష్ట్ర ప్రజలందరికీ వివేకా హత్యపై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తుంది.
• ఈ పుస్తకంపై ఉపముఖ్యమంత్రి కొట్టు , మాజీమంత్రి పేర్ని నాని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.
• వివేకా హత్య వెనుక భారీ కుట్ర దాగి ఉంది. జగన్, భారతీ రెడ్డి ఆ కుట్రలో భాగస్తులు కాదా?
• జగన్, భారతీరెడ్డి తమ వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను హత్యకు ముందురోజు రాత్రి తమ వద్ద ఎందుకు పెట్టుకున్నారు?
• అవినాష్ రెడ్డి హత్య జరిగిన వెంటనే సాక్ష్యాలను ధ్వంసం చేశారు..సీఐ శంకరయ్యను ఘటనా స్థలం నుండి బెదిరించి దూరంగా పెట్టారు.
• అవినాష్ రెడ్డి అనుచరులు వివేకా భౌతికకాయంపై ఉన్న గొడలి దెబ్బలకు కుట్లువేసి, బ్యాండేజీలు వేసి, రక్తం మరకలను కడగడం నిజం కాదా?