– పోలీసు వ్యవస్థ అరాచక వాదులకు అనుగుణంగా నడుస్తున్నారా?
– జగన్ అధికారం శాశ్వతం కాదు
– 23న చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరతా
– ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కన్నా విమర్శలు
23వ తారీకున నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరతాను, నాతో పాటు అనుచర గళం కూడా వస్తారు.జగన్ మీడియా నాపై అసత్య ఆరోపణలు చేయటానికి సిద్ధంగా ఉన్నది. మీ నాయకుడు జగన్ మాటలను ఒక్కసారి తిరిగి ఆలోచించుకోండి. జగన్ అధికారంలోకి వచ్చిన 6నెలల లోపే అరాచకపాలన మొదలు పెట్టారు.అరాచక పాలనకు తోడు పోలీస్ వ్యవస్థ కూడా దిగజారిపోయింది.
అరాచకాలు చేస్తున్న వారిని వదిలిపెట్టి పోరాటం చేసే వారిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. పోలీసు వ్యవస్థ అరాచక వాదులకు అనుగుణంగా నడుస్తున్నారా ? జగన్ అధికారం శాశ్వతం కాదు అని హెచ్చరించారు.
పట్టాభిని ఎక్కడ దాచారో తెలపాలని డిమాండ్ చేశారు. గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాము. రాష్ట్రంలో ఎవరికయినా అన్యాయం జరిగితే పోలీసులను ఆశ్రయిస్తారు, పోలీసులే పట్టించుకోకపోతే ఎవరిదగ్గరకు వెళ్లాలని ప్రశ్నించారు.
డిజిపి తక్షణమే రాష్ట్రంలో జరిగే అరాచకాలకి స్వస్తిపాలకలని సూచించారు.
దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.ఒకసారి ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి రాష్ట్ర సంపద దోచుకుంటున్నారు.నవరత్నాలు పంచి ప్రజలు ఓట్లు కొల్లగొడదామని చూస్తున్నారు.అమరావతి నుంచి రాజధాని మార్చడం జగన్ దోపిడి కోసమే. అమరావతిని కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలపై ఉంది. ఏపీని బీహార్ కంటే అధ్వాన్నంగా తయారు చేస్తున్నారు.
జగన్ వచ్చిన మరుక్షణం నుంచి రాక్షస పాలన సాగుతోంది.వైసీపీ అరాచకాలకు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.మళ్లీ అధికారంలోకి వస్తారనే నమ్మకం ఉంటే ఎందుకు ప్రతిపక్షాలను చూసి భయపడుతున్నారు.రాజ్యాంగ బద్దంగా పోలీసులు ప్రజలకు సేవచేయాలి లేకపోతే ప్రజలు తిరగబడతారు.మోదీ నాయకత్వం బాగున్నా ఏపీ బీజేపీ నాయకత్వం సరిగా లేదు.టిడిపిలో నాపాత్ర ఏమిటో పార్టీ తీసుకొనే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. పార్టీ అధినేత ఏవిధంగా నిర్దేసిస్తే ఆవిధంగా నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.