-కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడు కుంటున్న ఎకైక పార్టీ టి అర్ ఎస్
-ఓ కార్యకర్త కుటుంబానికి బీమా చెక్కును అందచేసిన మంత్రి ఎర్రబెల్లి
పాలకుర్తి, ఫిబ్రవరి 22:కార్యకర్తలే పార్టీ కి పెట్టని కోటలని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడు కుంటున్న ఎకైక పార్టీ టి అర్ ఎస్ మాత్రమే నని, దేశంలో ఇలాంటి పార్టీ లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 60లక్షల సైన్యం ఉన్న పార్టీ కూడా ఇదే అన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ, వారికి ఉచిత బీమా చేసి, వారు చనిపోతే, వారి కుటుంబానికి ఆసరాగా ఉంటున్న పార్టీ కూడా ఇదే అన్నారు.
సీఎం, పార్టీ అధ్యక్షులు కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ల కృషి వల్ల ఇవ్వాళ trs BRS గా మారిందని చెప్పారు. పార్టీ కార్యకర్తలు కూడా పార్టీ కి అండగా ఉండాలని చెప్పారు. పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామానికి చెందిన పార్టీ క్రియాశీల కార్యకర్త చిన్నా ల రమేశ్ కొద్ది నెలల క్రితమే ప్రమాదవశాత్తు మరణించగా, ఆయన భార్య మౌనిక కు పార్టీ బీమా రూ.2 లక్షల చెక్కు ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తిరుమల గిరిలో అందచేశారు. కాగా మౌనిక పార్టీకి పార్టీ అధినేతలు కెసిఆర్, కేటీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లకు తమ కృతజ్ఞతలు తెలిపారు.