Suryaa.co.in

Andhra Pradesh

కెమికల్ డిజాస్టర్స్ పైనా దృష్టి

విశాఖపట్నం/అమరావతి: జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ(NDMA) మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(SDMA) సహకారంతో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఆఫ్ సైట్ ఫ్ట్ఫ్యాక్టరీస్,6 జిల్లాల్లో ఆన్ సైట్ ఫ్యాక్టరీలలో కెమికల్ ఎమర్జన్సీ మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహించారు.

విశాఖపట్నంలోని ఈస్ట్ ఇండియా HPCL మాక్ ఎక్సర్సైజ్ నుండి ఎన్డీఎంఎ ప్రతినిధి బ్రిగేడ్ బిఎస్ తకర్,రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బి.ఆర్ అంబేద్కర్,డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి.ఎస్.సి image వర్మ ఈ మాక్ ఎక్సర్‌సైజ్ను పర్యవేక్షించారు.దీనిలోరెవెన్యూ,పోలీస్, ఆరోగ్య,రవాణా శాఖ,ఎస్డీఆర్ఎఫ్,ఎన్డీఆర్ఎఫ్ విభాగాలతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎన్డీఎంఎ ప్రతినిధి బ్రిగేడ్ బిఎస్ తకర్ మాట్లాడుతూ ఈ మాక్ఎక్సర్‌సైజ్ వల్ల కెమికల్ డిజాస్టర్స్ జగిగినప్పుడు ఏవిధంగా పరిశ్రమల యజమాన్యం,జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా సత్వరం తీసుకోవాల్సిన చర్యల తోపాటు లోటుపాట్లు గురించి అధికారులకు అవగాహన కలుగుతుందని తెలిపారు.

రాష్ట్ర విపత్తుల నిరవహణ సంస్థ ఎండి డా.బి.ఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ సహజ, మానవ నిర్మిత విపత్తుల తోపాటు కెమికల్ డిజాస్టర్స్ పై విపత్తుల సంస్థ దృష్టి సారించిందని చెప్పారు.ఇందుకు గాను ముందస్తు అవగాహన కార్యక్రమాలు, జాగ్రత్త చర్యలతోపాటు ప్రణాళికలు రూపొందించడం వలన రసాయనిక ప్రమాదాల స్థాయిని తగ్గించుకోవచ్చని అన్నారు. ఈ మాక్ఎక్సర్‌సైజ్ ద్వారా కెమికల్ డిజాస్టర్స్ సంభవించినప్పుడు ప్రమాదస్థాయిని,తీవ్రతను తగ్గించడానికి దోహదపడుతుందని చెప్పారు.అధికారులతో పాటు ప్రజలకు కూడా ఎక్కడైనా కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే స్థానికంగా అప్రమత్తతో ఉండి,అధికారులకు,సహాయక బృందాలకు సహకరించడం వంటి వాటిపట్ల అవగాహన కలుగుతుందన్నారు.భవిష్యత్తులో వరదలు,తుపానులు మీద కూడ మాక్ డ్రిల్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు.

ఈమాక్ ఎక్సర్‌సైజ్లో భాగంగా ఫ్యాక్టరీల్లో రసాయనిక ప్రమాదం జరిగితే ఎలా ప్రతి స్పందించి చర్యలు తీసుకుంటారో ప్రత్యక్షంగా చూపించారు.ఫైర్ సిబ్బంది వచ్చి ఫ్యాక్టరీలోని మంటలు ఆర్పడం,ఫ్యాక్టరీ సిబ్బందిని ఎన్డిఆర్ఎఫ్,ఎస్డిఆర్ఎఫ్ బృందాలు రక్షించడం,స్థానిక ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం,మెడికల్ క్యాంపులు నిర్వహించడం,త్రాగునీరు మరియు ఇతర వసతులు ప్రత్యక్షంగా ఏర్పాటు చేయడం జరిగింది.

మాక్ఎక్సర్‌సైజ్ జరిగిన 11 జిల్లాల్లో ఆఫ్ సైట్ఫ్యాక్టరీస్,6 జిల్లాల వివరాలు:
కెమికల్ డిజాస్టర్స్ మీద మాక్ఎక్సర్‌సైజ్ జరిగిన 11 జిల్లాల్లోని ఆఫ్ సైట్ ఫ్యాక్టరీస్ వివరాలు
Sl.No. Name of the District Name of the factory where ME is planned.
1. శ్రీకాకుళం NACL ఇండస్ట్రీస్ లిమిటెడ్,
అరినమక్కివలస (గ్రా),
ఎచ్చెర్ల (మం), శ్రీకాకుళం (జిల్లా)
2. విశాఖపట్నం ఈస్ట్ ఇండియా పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్, టెర్మినల్, EXIM పార్క్, నావల్ బేస్, విశాఖపట్నం
3. కాకినాడ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, వాకలపూడి, కాకినాడ రూరల్ (మం), కాకినాడ (జిల్లా).
4. ఏలూరు పైప్‌లైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (PIL), మోర్సపూడి గ్రామం, నూజివీడు మండలం, ఏలూరు
5. ఎన్టీఆర్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ POL టెర్మినల్, కట్టుబడిపాలెం, కొండపల్లి, ఎన్టీఆర్(జిల్లా).
6. ప్రకాశం M/s.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఒంగోలు డిపో
7. తిరుపతి కలర్‌షైన్ కోటెడ్ ప్రైవేట్ లిమిటెడ్, చెన్నూరు (గ్రా), గూడూరు (మం), తిరుపతి (జిల్లా).
8. చిత్తూరు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, చిత్తూరు టెర్మినల్, గుడియాతం రోడ్, యాదమరి (మం), చిత్తూరు (జిల్లా).
9. వైఎస్సార్ IOCL బాట్లింగ్ ప్లాంట్, కడప
10. కర్నూలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, LPG బాట్లింగ్ యూనిట్, లక్ష్మీపురం, కర్నూలు
11. అనంతపురం HPCL (LPG ప్లాంట్),
వడియంపేట (వి),
బుక్కరాయ (మం), అనంతపురం(జిల్లా).
కెమికల్ డిజాస్టర్స్ మీదఆన్ సైట్ లో మాక్ఎక్సర్‌సైజ్ జరుగినజిల్లాలు (06)
Sl.No. Name of the District
1. పశ్చిమ గోదావరి
2. నంధ్యాల
3. SPSR నెల్లూరు
4. అనకాపల్లి
5. శ్రీ సత్యసాయి
6. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ

LEAVE A RESPONSE