Suryaa.co.in

Andhra Pradesh

జగన్ అడ్డగోలు నిర్ణయాలతో నమ్మిన ఎమ్మెల్యేలు మోసపోయారు.. ఉన్నవారన్నా జాగ్రత్తపడాలి

-మూడు రాజధానులన్నావు నిర్మాణంలో మూడు అంగుళాలు కూడా ముందుకు పోలేదు
– తండ్రి ఆత్మగా పిలవబడే కేవీపీ రామచంద్ర, సూరీడు తదితరులు కనుమరుగుకు కారణం జగన్
-మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు

జగన్ అడ్డగోలు నిర్ణయాలతో నమ్మిన ఎమ్మెల్యేలు మోసపోయారని, ఉన్నవారన్నా జాగ్రత్తపడాలని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు వైసీపీ ఎమ్మెల్యేలకు సూచించారు.మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడిన మాటలు ..

రాష్ట్రానికి హద్దులుంటాయిగానీ జగన్ నమ్మకద్రోహానికి హద్దులుండవు
దేశానికి, రాష్ట్రానికి హద్దులు, అవధులుంటాయి ఉంగాయిగానీ జగన్ నమ్మకద్రోహానికి మాత్రం ఏ హద్దులు ఉండవు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి నైజం. ద్రోహం+దగా= జగన్మోహన్ రెడ్డి అని అందరూ అంటున్నారు. ఈయన చేసే అరాచకాలు, ఆకృత్యలు ప్రతిరోజు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. వాడుకొని వదిలేయడం జగన్ నైజం. తన సొంత ప్రయోజనాల కోసం ఎంతటివారినైనా బలిగొనడం ఆయన పని. జగన్ చెప్పదొకటి, చేసేదొకటి. విశ్వసనీయత గురించి ప్రతిసారి మాట్లాడే జగన్ కు విశ్వసనీయత అనే పదానికి అర్థం తెలియదు.

ఓట్లు వేసి గెలిపించిన పులివెందుల ప్రజలను అడ్డగోలుగా వంచించాడు. కడప, పులివెందులలో పార్టీ మీటింగ్ లు పెడితే వారు కూడా ఛీత్కరించే పరిస్థితులు. జగన్ సమావేశాలంటేనే జనం బెంబేలెత్తుతూ, ఛీత్కరించుకుంటున్నారు. రేపు ఓట్లు అడగడానికి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారో అర్థం కావడంలేదు. రిలయన్స్ అంబానీలే జగన్ తండ్రి వైఎస్ఆర్ మృతికి కారకులని చెప్పి రిలయన్స్ మాల్ లు, పెట్రోల్ బంక్ లు, వారి సంస్థలపై దాడులు చేయించారు. అధికారంలోకి రాగానే రిలయన్స్ వ్యక్తి పరిమళ అంబానీకి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎత్తుకొని పెంచిన చిన్నాన్న పట్ల జగన్ వ్యవహార శైలి అందరికీ తెలిసిందే. సొంత చిన్మాన్న వివేకానందరెడ్డిని చంపిన కజిన్ కి ఎంపీ హోదా కల్పించారు.

బాబాయి ముద్దాయిలను రక్షించడం ఎంతవరకు సబబు?
ముద్దాయిలను రక్షిస్తున్నాడు. వివేకా కుమార్తె సునీత తమకు రక్షణ కావాలని వాపోయింది. వారిపైన కూడా కేసులు పెట్టి వేధించాడు. కడప ప్రజలు ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే కడపలో శంఖుస్థాపన చేసిన కడప స్టీల్ ఫ్యాక్టరీ పునాదిరాయికే పరిమితమైంది. కడప జిల్లా రాజంపేటలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే దిక్కులేదు. కృష్ణ, తుంగభద్ర నీటి వాటా హక్కుల్ని ఇతర రాష్ట్రాలకు ధారాదత్తం చేసి నీటి వాటాల్లో రాయలసీమ ప్రజలకు ద్రోహం చేశారు.

సొంత తల్లికి, చెల్లికి ద్రోహం చేసిన వ్యక్తి జగన్. జగన్ వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న షర్మిలకు అన్యాయం చేశాడు. రాష్ట్ర ప్రజలకే కాదు కుటుంబ సభ్యులకు కూడా ఆయన అంటే భయం. తండ్రి ఆత్మగా పిలవబడే కేవీపీ రామచంద్ర, సూరీడు తదితరులు కనుమరుగుకు కారణం జగన్. జైల్ మెట్ మోపిదేవి వెంకటరమణ పరిస్థితిని అందరూ చూస్తున్నారు.

జగన్ ప్రాపకం కోసం వెంపర్లాడిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని తరిమేశారు
జగన్ ను నమ్ముకొని ఐదారు అమరావతి కేసుల్లో ఇరుక్కిని జగన్ ప్రాపకం కోసం వెంపర్లాడిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని టికెట్ లేదని తరిమేశారు. అనేకమంది ఎమ్మెల్యేలు ఈయనను నమ్మి మోసపోయామని అనుకుంటున్నారు. ఎంతమందిని ట్రాన్స్ ఫర్ చేయబోతున్నాడో తెలియదు. రాజకీయాలకు అర్థాలే మార్చేశాడు. నమ్మి ఓట్లేసిన దళితులు, మైనార్టీల్ని నట్టేట ముంచాడు. తను నియమించిన వాలంటీర్లు కూడా రోడ్డెక్కారు. సీపీఎస్ రద్దు హామీ మీద మాట తప్పి మడమ తిప్పాడు.

దశలవారీగా మద్య నిషేధం విధిస్తానని చెప్పి మోసం చేశాడు. మద్యనిషేధం చేసి ఓట్లడుగుతానన్న వ్యక్తి మద్యం బాబులను 20 ఏళ్ల పాటు బ్యాంకులకు తాకట్టు పెట్టాడు. తయారయ్యే మద్యం, అమ్మబోయే మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నాడు. నాసిరకం మద్యం తాగించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాడు. మహిళల పుస్తెలు తెంపాడు. అమరావతి రాజధానిని మార్చనని, ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పి మూడు రాజధానులు అని అడ్డగోలుగా తెరతీశాడు. ఒక రాజధానికే దిక్కు లేదు.. మూడు రాజధానులంటున్నాడు.

టీడీపీ తయారు చేసిన ఇన్ ఫ్రా స్ట్రక్చర్ నుండే పరిపాలన చేస్తున్నారు
టీడీపీ తయారు చేసిన ఇన్ ఫ్రా స్ట్రక్చర్ నుండే పరిపాలన చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పరిపాలన చేసే సెక్రటేరియేట్ కట్టింది టీడీపీ ప్రభుత్వమే. మూడు రాజధానులన్నావు నిర్మాణంలో మూడు అంగుళాలు కూడా ముందుకు పోలేదు. రైతు భరోసా కింద సంవత్సరానికి 12,500లు ఇస్తానన్నావు, రూ.7,500 లు ఇస్తున్నావు. రూ.5,500 ప్రతి సంవత్సరం ఎగ్గొడుతున్నావు. ఈ 5 సంవత్సరాల్లో 27,500 ఒక్కో రైతులకు బాకీ పడుతున్నావు.

రాగానే 3 వేలు పింఛన్ ఇస్తానని చెప్పి నాలుగేళ్ల తరువాత ఐదేళ్లకు ఇవ్వబోతున్నావు. ఇది మోసం, దగా, వంచన. విద్యుత్ ఛార్జీలు పెంచనని అధికారంలోకి వచ్చి 64 వేల కోట్ల విద్యుత్ భారాన్ని దశలవారీగా 6 సార్లు పెంచి ప్రజల నడ్డివిరిచారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.1.14 లక్షల కోట్లు దారి మళ్లించారు. 3 ఎస్సీ ఎస్టీ కి చెందిన 120 సంక్షేమ పథకాలను రద్దు చేశారు.

గతంలో ఐఏఎస్ లే అరెస్టు అయ్యారు.. రాబోయే రోజుల్లో ఐపీఎస్ లు కూడా
జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని శ్రీలక్ష్మి, రాజగోపాల్, ఆచార్య లాంటి అనేకమంది ఐఏఎస్ లు జైళ్లకు వెళ్లారు. జైలుకు వెళ్లకుండా కేసులు ఎదుర్కొన్నవారు ఐదారుగురు ఉన్నారు. ఆనాడు ఐఏఎస్ లే ఉన్నారు, రేపు ఐపీఎస్ లు కూడా అత్యధికంగా ఉండబోతున్నారని గుర్తు పెట్టుకోవాలి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా రూ. 43 వేల కోట్లు దోచేశారు. 16 నెలలు జైల్లో ఉన్నారు.

ప్రభుత్వంలో ఏ ఫైలు కూడా కరెక్టుగా నడవడంలేదు. నేడు అధికారం చెలాయించే ముఖ్యమంత్రి ఎటుపోతాడో తెలియదు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రాబోతోంది. ఇది నూటికి నూరు శాతం యదార్థం. అడ్డగొలు నిర్ణయాలు తీసుకొని నమ్మినవారిని మోసం చేసిన విషయాన్ని వున్నవారన్నా తెలుసుకోవాలని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు సూచించారు.

LEAVE A RESPONSE