-అందుకే పోలింగ్ రోజునే పోలీసు అభ్యర్దులకు దేహదారుడ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు
-జగన్ కుట్రల్ని విద్యావంతులు తిప్పికొట్టాలి
– పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ది భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగితే గెలవలేమని వైసీపీ కుట్ర రాజకీయాలకు తెరతీసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ రోజునే పోలీసు నియామకాలకు దేహధారుడ్య పరీక్షలు నిర్వహించటం వైసీపీ కుట్రలో భాగమే. మార్చి 13.2023 న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ముందుగానే ప్రకటించింది. కానీ నిరుద్యోగ పట్టభద్రులు ఓటింగ్లోన పాల్గొనకూడదన్న కుట్రతో అదేరోజు పోలీసు అభ్యర్దులకు దేహధారుడ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
జగన్ ఎన్నికలకు ముందు యువతకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. 2.30 లక్షల భర్తీ, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్న జగన్ మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయి. జగన్ చేసిన మోసంపై నిరుద్యోగుల కడుపు మంటతో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తారని గ్రహించి జగన్ ఇటువంటి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారు. అందుకే నిరుద్యోగుల్ని ఎన్నికకు దూరంగా ఉంచాలని పోలింగ్ రోజే దేహదారుడ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కుట్రలను విద్యావంతులు తిప్పికొట్టాలి. దీనిపై ఈసీ జోక్యం చేసుకుని మరో రోజు దేహదారుడ్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి.