హుందాతనం ఉన్న నేత కన్నా

-కన్నా స్ఫూర్తితో అందరూ జగన్‌ సర్కారుపై పోరాడాలి
-చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ
-కన్నా అనుచరులకు కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన చంద్రబాబు

మాజీ మంత్రి, బీజేపీ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. కన్నాకు కండువాకు కప్పి, టీడీపీలోకి ఆహ్వానించిన తర్వాత, చంద్రబాబు గతంలో తమ మలధ్య జరిగిన అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే… కన్నాకు పార్టీలోకి స్వాగతం. ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండే నేత కన్నా లక్ష్మీ నారాయణ.సిద్దాంతాలకు కట్టుబడి పనిచేసిన వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ. రాజకీయాల్లో హూందా తనంతో వ్యవహరించిన నేత కన్నా. రాజకీయంగా కన్నాతో విభేదించాం….వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శించుకోలేదు. కన్నా లక్ష్మీనారాయణ హుందాతనం ఉన్న నాయకుడు. ఆయనను ఎన్నికల్లో పెదకూరపాడులో ఓడించాలని నేను సీఎంగా ఉన్నప్పుడు చాలా ప్రయత్నించా. కానీ సాధ్యం కాలేదు.

రాష్ట్రం అభివృద్ది కోసం కలిసి వచ్చిన కన్నాకు స్వాగతం. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని కాదని ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలో చేరారు కన్నా..అమరావతి రాజధానిగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ది చెందాలి అని కన్నా టీడీపీలో చేరారు.నాటి ఉమ్మడి రాష్ట్ర అభివద్దిలో కన్నా పాత్ర కూడా ఉంది. మన రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకు 17 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. నేను కూడా సుదీర్ఘ కాలం సిఎంగా పనిచేశాను.సిఎంలుగా పనిచేసిన వారిలో కొందరు అవినీతి చేశారు..కొందరు అసమర్థలు ఉన్నారు. కానీ రాష్ట్రానికి జగన్ అంత డామేజ్ చేసిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు. జగన్ ది క్రూరమైన మనస్థత్వం….ప్రజా వేదికలో కలెక్టర్ల సమావేశం పెట్టి….వెంటనే దాన్ని కూల్చండి అని ఆదేశాలు ఇచ్చిన నేత జగన్.ప్రజా వేదిక నా సొంత ప్రాపర్టీ కాదు…. జగన్ కు ప్రజా ధనం అంటే లెక్కలేదు.రాష్ట్రంలో వ్యవస్థలు అన్నీ నేడు విధ్వంసానికి గురయ్యాయి. పరిపాలన అంటే అడ్మినిస్ట్రేషన్ మాత్రమే కాదు….సంక్షేమం అని చెప్పిన నేత ఎన్టీఆర్, తెలుగు దేశం పార్టీ.

ఇప్పటి వరకు ప్రతి ముఖ్యమంత్రి పేరు తెచ్చుకోవాలని తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ జగన్ దాడిలో అన్ని వ్యవస్థలూ కుదేలు అయ్యాయి. స్కూళ్లలో నాడు నేడు అన్నాడు….ఒక్క డిఎస్సి కూడా ప్రకటించలేదు. రైతుల ధాన్యం కొనేందుకు మంచి వ్యవస్థను తీసుకువస్తే….ఇప్పుడు ఆర్ బికెలు అని ఆ వ్యవస్థనూ నాశనం చేశాడు. అన్ని వర్గాల కార్పొరేషన్ లను నిర్వీర్యం చేశాడు. జగన్ మోహన్ రెడ్డి ఒకkanna2 ఆర్థిక ఉగ్రవాది. మెడమీద కత్తి పెట్టి ప్రజల ఆస్తులు రాయించుకుంటున్న వ్యక్తి జగన్మోహన్రెడ్డి. రాష్ట్రంలో ఇండస్ట్రీలు పారిపోవడం వెనుక, పెట్టుడబులు తరలిపోవడం వెనుక, ఆస్తులు చేతులుమారడం వెనుక ప్రత్యేకమైన స్టోరీ ఉంది. ఇప్పుడు బీహార్ కూడా ఎపి కంటే చాలా మెరుగ్గా ఉంది. జగన్ పేదల పక్షం అంట….మనం పేదలకు వ్యతిరేకం అంట..నమ్ముతారా? జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు అంతా పేదలు అయ్యారు…జగన్ మాత్రం ధనవంతుడు అవుతూనే ఉన్నారు.నాణ్యత లేని మద్యం అమ్మి జగన్ ప్రజల జీవితాలునాశనం చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అవేదన కలుగుతుంది. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి.

GST సరాసరి ఒడిశా కంటే వెనుక AP ఉంది. ఎపిలో తలసరి GST రూ.5,609 కాగా ఒడిసాలో రూ.8133 ఉంది.తెలంగాణలో రూ.9988, తమిళనాడులో రూ.10,120, కర్నాటకలో రూ.13,428.రాష్ట్రంలో GST కంటే లిక్కర్ ఆదాయం ఎక్కువ ఉంది. తలసరి GST రూ.5,609 కాగా.. రాష్ట్రంలో లిక్కర్ పై తలసరి వ్యయం రూ.6 వేలు. ప్రజల జీవన ప్రమాణాలు పడిపోవడమే దీనికి కారణం. రాష్ట్రంలో గంజాయిkanna3 వినియోగం చాలా ఎక్కువ అయ్యింది. ఇది చాలా ప్రమాదకరం. ఒక్క సారి గంజాయి కి అలవాటు అయిన వారిని మళ్లీ అందులోంచి బయటకు తేవడం చాలా కష్టం.నేడు రాష్ట్రంలో భూముల ధరలు పడిపోయాయి. ఆస్తుల విలువలు తగ్గిపోయాయి.రాష్ట్రంలో ఒకప్పుడు ఎన్జివోలు గట్టిగా ఉండేవాళ్లు…కానీ ఇప్పుడు వాళ్ల పరిస్థితి దరుణంగా ఉంది. ఒకప్పుడు మీడియా గట్టిగా ఉండేది…కానీ ఇప్పుడు జగన్ దెబ్బకు వాళ్లూ రాయలేని పరిస్థితి.రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గతంలో ఇలా చేయలేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. కందుకూరులో మీటింగ్ పెడితే దురదృష్టకర సంఘటన జరిగింది. ఒక్క పోలీసు అక్కడికి రాలేదు. ఆ ఘటన పేరు చెప్పి జీవో నెంబర్ 1 తెచ్చాడు.

జగన్ కు పాలన చేతకాకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి.నేను సిఎంగా ఉన్నప్పుడు జగన్ పాదయాత్ర చెయ్యలేదా…నేను ఆరోజు అనుకుని ఉంటే జగన్ ను బయటకు రానిచ్చే వాడినా. కానీ నేను హూందాగా వ్యవహరించాను.అనపర్తి సభకు అడ్డంకులు సృష్టిస్తే 7 కిలోమీటర్లు నడిచి వెళ్లి సభ నిర్వహించాను. అనేక అడ్డంకులు సృష్టించారు….ప్రైవేటు వాహనాలు తెచ్చి మాకు అడ్డంగా పెట్టారు. కార్యకర్తలు, ప్రజలపై లాఠీచార్జ్ చేశారు. అయినా అన్ని అడ్డంకులు అధిగమించి మీటింగ్ పెట్టాను. రాజకీయ నాయకులకే అడ్డంకులు సృష్టిస్తే….సామాన్య ప్రజల సంగతి ఏంటో ఆలోచించండి.పవన్ కళ్యాన్ నుకూడా ఇలాగే ఇబ్బంది పెట్టారు. ఆయన మీటింగ్ కు స్థలం ఇచ్చారని ఇప్పటంలో ఇళ్లు కొట్టేశాడు. నేను రేపు వచ్చిన తరువాత తాడేపల్లి లో జగన్ ఇంటిమీదుగా రోడ్డు వెయ్యలేనా?

గన్నవరంలో టీడీపీ నేతలపై దాడులు చేశారు..పార్టీ కార్యాలయం ధ్వంసం చేశారు. పైగా మళ్లీ టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారు. పోలీస్ స్టేషన్ లో ఇలా టార్చర్ చెయ్యవచ్చు అని నేను ఎప్పుడూ అనుకోలేదు.ఇప్పుడు హూ కిల్డ్ బాబాయ్ అనేది ప్రధాన చర్చ. అంతా చెపుతున్నారు అబ్బాయ్ కిల్డ్ బాబాయ్.వివేకా హత్య వ్యవహారంపై సినిమా కూడా తీయవచ్చు.. అంత స్టోరీ ఉంది అందులో.వివేకా హత్య కేసు నిందితులు ఆ రోజు అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు. గొడ్డలి వచ్చే వరకు నిందితులు అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు.వివేకాను చంపిన తరువాత కూడా నిందితులు అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లారు.

హత్య అనంతరం డ్రామా మొదలు పెట్టాడు…నారాసుర రక్త చరిత్ర అని నా పై ప్రచారం చేశాడు.నిజమే అని ప్రజలుకూడా కొంత నమ్మారు…జగన్ కు ఓట్లు వేశారు.వివేకా వీళ్ల అధికారానికి అడ్డం వచ్చాడు…అందుకే హత్య చేశారు.షర్మిలకు ఎంపీ సీటు ఇవ్వాలి అంటున్నాడని కక్షగట్టి అడ్డు తొలగించారు. అయితే ఇప్పుడు గూగుల్ తో మొత్తం బయటకు వచ్చింది. కుట్ర బయట పడింది. గూగుల్ టేకౌట్ ద్వారా నిందితులు అవినాష్రెడ్డి ఇంట్లో ఉన్నారని తేలింది.రాష్ట్రం లో పరిస్థితి కేవలం కన్నాకో, చంద్రబాబు నాయుడుకో మాత్రమే చెందిన సమస్య. కాదు…రాష్ట్రం గురించి అంతా ఆలోచించాలి.

రాష్ట్రంలో ఐపిసి యాక్ట్ లేదు…వైసిపి యాక్ట్ ఉంది.గన్నవరం లో కనకారావు అనే సిఐ తో అక్రమ కేసుపెట్టిస్తారు. నాడు సింగిల్ విండో ఎలక్షన్ ల సమయంలో నాటి టీడీపీ నేత సతీష్ రెడ్డి పై ఇలాగే కుట్ర చేశారు. నాటి గొడవలో గన్మెన్ చేతిలో ఒక వ్యక్తి చనిపోతే తప్పుడు ఫిర్యాదుతో సతీష్ రెడ్డీ కాల్చాడు అని కేసు పెట్టారు. దీని కోసం మోజిస్ట్రేట్ కు కూడా లంచం ఇచ్చారు. సుప్రీం కోర్టులో ఈ విషయం తేలడంతో ఆ మెజిస్ట్రేట్ ఉద్యోగం పోయింది. నేను ప్రజా చైతన్యం కోసం ప్రయత్నం చేస్తున్నాను. కన్నా స్ఫూర్తితో అందరూ కలిసి రావాలి.పోలీసు వ్యవస్థను కూడా కోరుతున్నా….మీరు తప్పులు చేసి ఇబ్బందులు తెచ్చుకోవద్దు. ప్రభుత్వ అధికారులకు కూడా చెపుతున్నా…..జగన్ ను నమ్మితే జైలుకు పోవడం ఖాయం.

Leave a Reply