– టీడీపీ పోలీసులపై యుద్ధంచేస్తోందని కొందరు ప్రభుత్వపెద్దలు, పోలీస్ అధికారులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు
• పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి, మాదకద్రవ్యాల విక్రయాలు పోలీస్ శాఖకు మాయనిమచ్చకాదా?
• మన పిల్లలు గంజాయికి బానిసలైతే మనమెంత బాధపడతామో, పేద బడుగు, బలహీనవర్గాలు, దళితుల పిల్లలు మత్తులో జోగుతుంటే వారూ అంతేబాధపడతారని పోలీస్ అధికారులకు తెలియదా?
• అధికారపార్టీ ఆదేశాలతొ రాజకీయపార్టీలపై నిఘాపెట్టడం మానేసి, ఏపీ పోలీస్ శాఖ గంజాయి మాదకద్రవ్యాల వ్యాప్తిపై ఉక్కుపాదం మోపాలి
– యువగళం పాదయాత్ర ప్రదేశంలో (పుంగనూరు) టీడీపీ శాసనసభ్యులు, పీ.ఏ.సీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్
పోలీస్ యూనిఫామ్ గౌరవాన్ని పెంచి, ఖాకీచొక్కా గర్వపడేలా చేసింది చంద్రబాబు, టీడీపీప్రభుత్వాలే. పోలీస్ వ్యవస్థలోని కొందరు అధికారుల ఓవరాక్షన్ నే టీడీపీ తప్పుపడుతోంది. “యువగళం యాత్రలో లోకేశ్ ను, ప్రజల్లోకి వెళ్తున్నప్రధానప్రతిపక్షనేత చంద్రబాబుని అడ్డుకోవడానికి ఈ ప్రభుత్వం పోలీస్ శాఖనే యథే చ్ఛగా ఉపయోగిస్తోందనే వాస్తవాన్ని పోలీస్ వ్యవస్థ గుర్తించాలి. యువగళంలో లోకేశ్ మైక్ లో మాట్లాడకూడదు.. స్టూల్ పై నిలబ డకూడదు, ఆఖరికి కనీసం ప్రజలకు అభివాదం చేయకూడదు అనే స్థాయికి పోలీసులు వచ్చారు. వారిని అంతహీనస్థాయికి దిగజార్చింది ఈ ప్రభుత్వమే. టీడీపీ నేతలు పోలీసులపై యుద్ధంచేస్తున్నట్లు వారిని ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నట్లు ప్రభుత్వంలోని పెద్దలు కొందరు ప్రచారంచేస్తున్నారు. ముఖ్యంగా నిన్న చిత్తూరుజిల్లా ఎస్పీ మాట్లాడుతూ, టీడీపీ నేతలు పోలీసుల్ని శత్రువులుగా చూస్తున్నారు అని మాట్లాడారు. దేశంలోనే ఏపీ పోలీస్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేలాదాన్ని తయారుచేసింది, సాంకేతికంగా పోలీస్ శాఖను ఆ ధునికీకరించింది చంద్రబాబు. పోలీస్ యూనిఫామ్ గౌరవాన్ని పెంచి, ఖాకీచొక్కా గర్వం గా పనిచేసేలా టీడీపీప్రభుత్వం పనిచేసింది. కానీ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రపోలీస్ వ్యవస్థ దిగ జారిపోయింది అనేది వాస్తవం. ఖాకీదుస్తులు వేసుకున్న ప్రతిఒక్కరూ మథనపడే పరిస్థితిని వైసీపీప్రభుత్వం కల్పించింది. పోలీస్ శాఖపనితీరుపై రహస్యఓటింగ్ పెడితే, ఖాకీలమనోగతం ఏమిటో డీజీపీకి తెలుస్తుంది. ఎండనక, వాననక, కుటుంబాలను కూడా పట్టించుకోకుండా, విధినిర్వహణే ధ్యేయంగా పని చేసే కానిస్టేబుళ్లే నిజమైన పోలీసులు. మాకు సంబంధించినంతవరకు ఫేస్ ఆఫ్ ది పోలీస్ కానిస్టేబుళ్లే. డీజీపీ కేవలం బాస్ ఆఫ్ ది పోలీస్ మాత్రమే. పోలీస్ యంత్రాంగాన్ని టీడీపీ గౌర వించిన విధంగా మరేపార్టీ గౌరవించలేదు..ఇకపై గౌరవించలేదు.
కొందరు పోలీస్ అధికారులే జగన్ ప్రభుత్వంలో ఐపీఎస్ చట్టాలకు విరుద్ధంగా పనిచేస్తూ, మొత్తం పోలీస్ వ్యవస్థకే కళంకం తీసుకొస్తున్నారు. వారి హోదాలు, పేర్లతో సహా టీడీపీ గుర్తుపెట్టుకుంటుంది. తెలుగుదేశం ఎప్పుడూ పోలీసుల్ని శత్రువులగా చూడలేదు. చూస్తున్నట్టు ప్రభుత్వపెద్దలు, కొందరు పోలీ స్ అధికారులు దుష్ప్రచారం చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థపనితీరు, కొందరు అధికారుల వ్యవ హారశైలిపై ప్రభుత్వం రహస్యఓటింగ్ పెడితే, ఆశాఖలోని డొల్లతనం, కిందిస్థాయి సిబ్బంది మనోగతం బహిర్గతమవుతుంది. రాష్ట్రం గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు కేరాఫ్ గా మారిందన్న జాతీయ, అంతర్జాతీయ నివేదికలపై, పొరుగురాష్ట్ర పోలీస్ అధికారుల వ్యాఖ్యలపై చిత్తూరుఎస్పీ, డీజీపీ ఏం సమాధానం చెబుతారు? పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి దొరకడం, విద్యార్థులు జీవితాలు మత్తుకు బలికావడంపై నిన్న లోకేశ్ మాట్లాడారు. దానిపై ఆయన అసత్యాలు, అవాస్తవాలు చెప్పారంటున్నారు. పా ఠశాలలో గంజాయి ప్యాకెట్లు దొరకడం, అవిపడేసి పిల్లలు పారిపోవడం, ఆప్యాకెట్ల తాలూకా వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది నిజమో, కాదో చిత్తూ రుఎస్పీ సమాధానం చెప్పాలి. గంజాయిసాగు, సరఫరా, విక్రయాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉందనేది వాస్తవం.
ఈమాట తాము అనడంలేదు. జాతీయ, అంతర్జాతీయస్థాయి నివేదికలన్నీఏపీ గంజాయికి కేరాఫ్ గా మారిందని చెబుతున్నాయి. పొరుగురాష్ట్రాల పోలీస్ అధికారులు తమ రాష్ట్రాల్లోకి ఏపీనుంచే గంజాయివస్తుందని బహిరంగంగానే చెబుతున్నారు. నివేదికలను, పొరుగురాష్ట్ర పోలీస్ అధికారుల వ్యాఖ్యలను చిత్తూరుఎస్పీ, డీజీపీ కాదనగలరా? రాష్ట్రంలో గంజాయిసాగు, సరఫరా, విక్రయాలు ఆగుతున్నాయా? పోలీసులు, ఎక్సైజ్ శాఖ గంజాయి, ఇతరమాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టగలిగాయా? 10వేల హోర్డింగ్ లుపెడితేనే, లక్ష బ్యానర్లు వేస్తేనే, ప్రచారాన్ని హోరెత్తిస్తేనో గంజాయిసాగు, సరఫరా,విక్రయాలు ఆగవు చిత్తూరుఎస్పీ గారు. పోలీస్ శాఖ కఠినం గా వ్యవహరించాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంపై ప్రజలకు నమ్మకం కలగాలి. రాజకీయపార్టీలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహించి, సమాజాన్ని మత్తులో జోగేలా చేస్తున్న అరాచకశక్తుల ఆటకట్టించండి. గంజాయిసాగు అనేది రాత్రికిరాత్రి జరిగేదికాదు. పోలీ స్ శాఖ నిఘామొత్తం రాజకీయపార్టీలు, ఆపార్టీ కార్యకలాపాలు, కదలికలపై ఉంటే సమాజం లోకి గంజాయి, మాదకద్రవ్యాలు రాక ఏమవుతాయి? సమాజానికి చీడపురుగుల్లా మారిన వ్యవస్థలపై పోలీస్ శాఖ నిఘాపెడితే, గంజాయి, మాదకద్రవ్యాలవ్యాప్తి అరికట్టగలుగతుంది. పాఠశాలల్లో చదివే బడుగు, బలహీనవర్గాలు, దళితులబిడ్డల్ని కూడా తమగంజాయి వ్యాపా రానికి బలిచేస్తున్న దుర్మార్గుల్ని, వారికి కొమ్ముకాస్తున్న అధికారపార్టీని నిలువరించే సత్తా, నిరోధించే ధైర్యం పోలీస్ శాఖకు ఉందా అని చిత్తూరుఎస్పీని, డీజీపీని ప్రశ్నిస్తున్నాం.”