ఇంకు పెన్నులు ఎక్కడ?

మేము చదువుకునే రోజుల్లో ఇంక్ పెన్లదే రాజ్యం. ప్రతీ ఒక్కరూ సైంటిస్ట్ లా అవతారం ఎత్తే వాళ్ళం. సరిగా రాయకపోతే పాళీని బ్లేడ్ తో సెట్ చేసే వాళ్ళం. నోటితో పాళీ తీయడం. నోటి నిండా ఇంక్ మరక. చేతి వేళ్ళకు అయిన ఇంక్ మరకలు గోడకు రాయడం. తర్వాత తిట్లు తినడం. ఇక చొక్కాకు పడే మరకలు చెప్పక్కర్లేదు. స్కూల్ కి వెళ్లి నోట్స్ రాద్దామని ఓపెన్ చేయగానే చేతి నిండా ఇంక్. నోట్స్ లో పేపర్ చింపి పెన్ చివర చుట్టి రాసిన రోజులు మరువలేనివి.

ఇక కొన్నాళ్లకు చైనా పెన్ లు వచ్చాయి గోల్డ్ కాప్ తో. లోపల రబ్బర్ ట్యూబ్ లా ఉండేది. ఇంక్ పోయడం సులువు కానీ ఖరీదు ఎక్కువ. మాస్టర్ ల జేబులో చూసి మురిసిపోవడం. ఇంటర్ కు వచ్చే సరికి కొంచెం మంచి పెన్లు కొనుక్కున్నాం. 1990లో రేనాల్డ్ కంపెనీ బాల్ పెన్ ల విప్లవం. అప్పటి వేసవిలో చెర్మాస్ వైట్ షర్ట్, రేనాల్డ్ బ్లూ కలర్ పెన్ జేబులో ఉండటం ఫ్యాషన్. అబ్బో ఇలా పెన్లపై బోల్డు జ్ఞాపకాలు. ఎన్నెన్నో సరదా కబుర్లు.

వెలగపూడి గోపాలకృష్ణ

Leave a Reply