Suryaa.co.in

Features

అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది

వాస్తవంగా ఇప్పుడు అక్షయ తృతీయ నాడు బంగారం వెండి లాంటి విలువైన వస్తువులు కొనడం రివాజుగా మారింది. కానీ అప్పోసొప్పో చేసి ఈ పండుగ జరుపుకోకూడదు. గుర్తుంచుకోండి. ఈ రోజు అప్పు చేస్తే అది అక్షయమవుతుంది. వాస్తవంగా ఈ అక్షయ తృతీయ నాడు విరివిగా దాన ధర్మ కార్యములు చేసేవారు. ఎందుకంటే ఈ రోజు చేసే జప , తపములు , దాన ధర్మములు అక్షయమవుతాయని శాస్త్రాలు చెపుతున్నాయి.

మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా , జపమైనా , హోమమైనా , దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే ,

పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది . ఈ నాడు , తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే విశేష పూజనీయమైనది. ఈ నాడు ఉపవాస దీక్ష జరిపి , ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయముగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు.

LEAVE A RESPONSE