Suryaa.co.in

Features

కాశ్మీరీ పండిట్ల కష్టాలు.. కారణాలు

క్షత్రియత లేకపోవడమే కశ్మీరీ పండిట్ల కష్టాలకు కారణం
నాగరికతల మధ్య యుద్ధంలో ఎప్పుడూ హార్ట్ పవర్ గెలుస్తుంది
హిందువులం సాఫ్ట్ పవర్ సరిపోతుంది అనే భ్రమ నుంచి బయట పడాలి.

( రాజీవ్ మల్హోత్రా)
కాశ్మీరీ పండిట్లు అన్ని రంగాలలో చాలా నైపుణ్యం సంపాదించారు. అది వారి సాంస్కృతిక ప్రభావం క‌ళ‌లు, సాహిత్యం, క‌విత్వం, త‌త్వం వంటి సాఫ్ట్ ప‌వ‌ర్‌ ఎక్కువ ఉండ‌టం వ‌ల్ల బలవంతపు విధానం, ముఖ్యంగా సైనిక శక్తిని ఉపయోగించడం వంటి హ‌ర్డ్ ప‌వ‌ర్ లేనందువ‌ల్ల వారు వెన‌క‌బ‌డిపోయారు.

మనం చరిత్ర గ‌మ‌నిస్తే… క‌ఠిన‌త్వం (హార్డ్ పవర్) ఎప్పుడు సాంస్కృతిక ప్ర‌భావం (సాఫ్ట్ పవర్) ని జయిస్తుంది. గ్రీకుల‌కు సాంస్కృతిక క‌ళ‌ల ప‌ట్ల మ‌క్కువ ఎక్కువ‌.. వారికి చాలా సాఫ్ట్ పవర్ ఉంది. అయితే హ‌ర్డ ప‌వ‌ర్ ఎక్కువ‌గా ఉన్న రోమన్ల‌తో యుద్ధంలో గ్రీకులు ఓడిపోయారు. తర్వాత రోమన్లు గ్రీకుల నాగరికతని వారికి కావలసినట్టు మర‌ల్చుకున్నారు. గ్రీకు నాగరికత సమూలంగా నశించిపోయింది.

హార్డ్ పవర్ ఉన్నవాడు ఎప్పుడూ వచ్చి సాఫ్ట్ ప‌వ‌ర్ ఉన్న వాళ్ళని ఓడిస్తాడు. అప్పుడు వాడి దగ్గర రెండు శ‌క్తులు ఉంటాయి. మన దగ్గర కళలు, ఆధ్యాత్మికత, గణితం ఇవన్నీ ఉన్నాయని మనం చాలా గర్వపడొచ్చు. కానీ నాగరికతల మధ్య యుద్ధంలో ఎప్పుడూ హార్ట్ పవర్ గెలుస్తుంది. బాబర్ యుద్ధ ఫిరంగులతో వచ్చాడు. పోర్చుగీసు వారు యుద్ధ ఫిరంగులతో వచ్చారు.

కశ్మీరీ పండిట్ల‌కి జరిగిన అన్యాయానికి కారణం వాళ్ల దగ్గర క్షత్రియత లేకపోవడం. చాలామంది క్షత్రియత హిందూ ధర్మం కాదు అనుకుంటారు. అది నిజం కాదు. మనకి మహాభారతం అదే చెప్తుంది.

శ‌శిథ‌రూర్ Why am I Indian అనే పుస్త‌కం రాశారు. ఈ విష‌యంపై నేనూ ఆయ‌న ఒక డిబేట్ పెట్టుకుందామ‌ని అడుగుతున్నాను. కానీ ఆయన ఒప్పుకోవడం లేదు. ఆయన తన పుస్తకం Why am I Indian లో హిందూ, హిందుత్వం రెండు వేరు అని రాశారు. రెంటికి మధ్య తేడా ఆయన ప్రకారం, హిందూ ధర్మానికి రాజకీయం హింస కలిపితే హిందుత్వం అని రాశారు. అదే నిజమైతే మహాభారతంలో కృష్ణుడు ఎందుకు రావాల్సి వచ్చింది.

ఆయన ఎందుకు యుద్ధం చేయమన్నాడు? రాముడు ఎందుకు యుద్ధం చేశాడు? ఆ పరిస్థితుల్లో సాఫ్ట్ పవర్ పరిష్కారం కాదు. మన హిందూ ధార్మికత నుంచి క్షత్రియ అతని తీసేస్తే మన శాస్త్రాలు, ఇతిహాసం, అర్థశాస్త్రం, ధర్మశాస్త్రం అన్నీ తీసేయడమే. మన హిందువులం సాఫ్ట్ పవర్ సరిపోతుంది అనే భ్రమ నుంచి బయట పడాలి. చరిత్ర చూస్తే ఏ ఒక్క శతాబ్దం హింస లేకుండా లేదు. ఇక ముందు ఉంటుంది అని మనం అనుకోలేము.

కాశ్మీరీ పండిట్ల‌కు చాలా సాఫ్ట్ పవర్ ఉంది. కానీ వారి దగ్గర క్షత్రియత లేదు. వారిని వారు రక్షించుకునే పరిస్థితిలో లేరు. కశ్మీరీ పండిట్స్ కాశ్మీరీ క్షత్రియల్ని పక్కన పెట్టేశారు. అక్కడ ఉన్న ముస్లింల‌ను వారు క్షత్రియులుగా చూశారు. ఎందుకంటే రాజులు చాలా హింసలకి పాల్పడుతున్నప్పుడు ఈ ముస్లిం వాళ్ళకి గూడులు కట్టి వాళ్ళకి సాయం చేశారు. కశ్మీరీ పండిట్లు వాళ్లే మనకు క్షత్రియులు అనుకున్నారు. అది కుట్రలో ఒక భాగం తెలుసుకోలేకపోయారు.

ఇప్పుడు మనం దీని గురించి ఏం చేయగలం ?
మనమూ ఎంత‌సేపూ భూభాగాన్ని కాపాడాలని చూస్తున్నాం. అది సరిపోదు. ప్రజల్ని, నాగరికతని కాపాడుకోవాలి. ఆ పని చేయడానికి మనకి మూడు ప‌ద్ధ‌తులు ఉన్నాయి.

1) దలైలామా ప‌ద్ధ‌తి :
ఆయన ప్రపంచాన్ని వాళ్ళకి ఏం జరిగింది అని మర్చిపోనివ్వలేదు. అది ఒక సాఫ్ట్ పవర్ మోడల్. అది ఆయన ఎలా చేయగలిగారంటే ఆయన సాఫ్ట్ పవర్ ని వెస్ట్రన్ హార్డ్ పవర్ తో బాగా సమన్వయం చేశారు. 40 సంవత్సరాలుగా పాశ్చాత్య సిస్టం ని చాలా ప్రభావితం చేశారు. మన దగ్గర దలైలామా లాంటి భావితం చేసే వ్యక్తి లేరు. మన దగ్గర ఉన్న గురువులు అలాంటి పనులు చేయడానికి సిద్ధంగా లేరు. వారి దగ్గర అలాంటి ప్రణాళిక గాని, సామర్థ్యం కానీ లేదు.
2) ఇస్లామీకరణం ప‌ద్ధతి : ఇది మనకి నచ్చదు

3) అమెరికాలో నల్లవారి ప‌ద్ధ‌తి :
అమెరికాలోని నల్లవారు వామపక్షాన్ని జయించారు. ఇప్పుడు వామపక్షం పూర్తిగా నల్ల వారిని సమర్థిస్తుంది. ఇస్లాం కూడా అందులోనే కలిసిపోయింది. మీరు నమ్మకపోవచ్చు కానీ ముస్లింలు అమెరికాలో మేము అనగదొక్కబడిన జాతి అని అందరినీ చక్కగా నమ్మించారు. కశ్మీరీ పండిట్లు కూడా అదే చేయాలి. అంటే ఎవరిని నమ్మించాలి. మనం నమ్మడం కాదు. జ్యుడీషరీలో ప్రొటెక్టెడ్ గ్రూప్ అని ఒక లీగల్ టర్మ్ ఉంది. ఈ జాతి వారు చాలా అనగదొక్కబడి ఉన్నారు, హింసించబడ్డారు. వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది అని ఒక చట్టం తీసుకురావాలి. కాశ్మీరీ పండిట్లు ఆ దిశగా కృషి చేయాలి. ప్రభుత్వం నుంచి ఇది డిమాండ్ చేయాలి. ఒకసారి ఇలాంటి క్లాసిఫికేషన్ జరిగితే మీకు అంతర్జాతీయ వేదికల మీద ప్రత్యేకమైన హక్కులు లభిస్తాయి. కాశ్మీరీ పండిట్లు ఇప్పటివరకు ఇలాంటి ప్రయత్నం చేయకపోవడం కానీ ఇది చాలా ముఖ్య‌మైన విష‌యం.

Source : Infinity foundation
తెలుగు అనువాదం: శిరీష చెన్నాప్రగడ
– VSK Telangana

LEAVE A RESPONSE