Suryaa.co.in

Andhra Pradesh

మండలి మాదే.. ప్రజలు మా వెంటే

– ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేం మంచి ఫలితాలు సాధించాం
– టీచర్ల మద్దతును చూరగొన్నాం..రెండు చోట్లా మేమే గెలిచాం
– ఈ ఎన్నికల్లో సహజంగా కమ్యూనిస్టులు, యూనియన్లు యాక్టివ్‌గా ఉంటాయి
– ఈ సారి వారంతా తెలుగుదేశానికి మద్దతు పలికినట్లున్నారు
– పీడీఎఫ్‌ లాంటి వేదికలు తెలుగుదేశం పార్టీకి ఓట్లను బదిలీ చేశాయి
– ఈ ఫలితాలను చూసి ఎవరూ సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు
– జగన్మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు అందుకున్న ఓటర్లు దీంట్లో పాల్గొనలేదు
– 2007లో ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ గెలిచినా.. 2009 సాధారణ ఎన్నికలపై ప్రభావం పడలేదు కదా..?
– రానున్న రోజుల్లో కూడా అదే సీన్‌ రిపీట్‌ అవుతుంది
– రెండు స్థానాల గెలుపుతోనే శక్తి పెరిగిందని సంబరాలు చేసుకుంటే చేసుకోనివ్వండి
– ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ పెట్టాక.. సరదాగా పెట్టాం అని అనలేరుగా..?
– తెలంగాణాలో ఇలానే పోటీ పెట్టి.. ఓటుకు నోటు ఇచ్చి దొరికిపోయారు
– ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి

ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:
టీడీపీ వ్యవస్థల్లోకి ఎలా దూరాలో, ఏ విధంగా దుర్వినియోగం చేయాలనే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటుంది. రాయలసీమ పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గంలోనూ ఓట్ల బండిల్స్‌ లో అవకతవకలు చేసినట్లు నిరూపణ అయింది.దానిపై రీకౌంటింగ్‌ కోసం ఫిర్యాదులు కూడా ఇచ్చారు..ఫైనల్‌ కౌంటింగ్‌ అయిపోయిన తర్వాత దాన్ని పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్నది చూడాలి. మేము అయితే ఎన్నికల కమిషన్‌ కి కూడా ఫిర్యాదు చేశాం.

ఈ ఎన్నిక అన్ని వర్గాలకూ ప్రాతినిథ్యం వహించదు:
– ఈ ఎన్నిక అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం వహించేది కాదు.
– ఇది కేవలం ఒక చిన్న విభాగానికి సంబంధించిన ఎన్నిక మాత్రమే
– సహజంగా ఎప్పుడూ ఇలాంటి ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు, యూనియన్లు, అసోసియేషన్లు యాక్టివ్‌ గా ఉంటాయి.
– వారికి ప్రధాన రాజకీయ పార్టీలు సపోర్ట్‌ చేస్తుండేవి.
– ప్రతిపక్ష పార్టీలు గతంలో ఈ ఎన్నికల్లో పాల్గొన్నా.. అధికార పార్టీగా మేం మొదటి సారిగా పాల్గొన్నాం.
– పట్టభద్రులు, టీచర్స్‌ విషయంలో మేం ప్రయోగం చేశాం.
– టీచర్ల నుంచి మంచి ఆదరణ లభించింది.. తొలిసారి మేం పోటీ చేసినా వారు మమ్మల్ని ఆదరించారు.
– పట్టభద్రుల విషయంలో క్షేత్ర స్థాయిలోకి మా మెసేజ్‌ తీసుకెళ్లడం, ఆ ప్రత్యేక ఓటర్లను రీచ్‌ కావడంలో కొంత ఇబ్బంది జరిగినట్టు ఉంది.

ఎవరూ సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు
ఈ ఫలితాలను చూసి ఎవరూ సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు.మిగిలినవన్నీ బాగానే ఓట్లు వచ్చాయి… దీన్ని చూసి ఎవరో సంబరాలు. చేసుకుంటే.. మేము డీలా పడాల్సిన అవసరం లేదు.ఈ నాలుగేళ్లుగా జగన్మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు అందుకున్న ఓటర్లు దీంట్లో పాల్గొనలేదు. కాబట్టి ఈ ఎన్నికలు మొత్తం సమాజాన్ని ప్రతిబింబిస్తాయి అని నేను అనుకోవడం లేదు.అలా అని దీన్ని తగ్గించాల్సిన అవసరం లేదు…వచ్చే ఎన్నికల్లో మరింత గేర్‌ అప్‌ అవుతాం. ఈ సారి కమ్యూనిస్టు పార్టీలతో ఎక్కువగా ఉండే పీడీఎఫ్‌ లాంటి వేదికలు తెలుగుదేశం పార్టీకి ఓట్లను బదిలీ చేశాయి.వచ్చినవన్నీ తెలుగుదేశం పార్టీ ఓట్లు కావు…వారి అభ్యర్థులు కూడా ఎవరికీ పెద్దగా తెలియదు.వాళ్ల మధ్య ఉన్న అవగాహన వల్ల అన్ని శక్తులు ఏకమవ్వడంవల్ల తెలుగుదేశం పార్టీ లాభపడి ఉంటుంది.ఆ పార్టీల చేతుల్లో ఉన్న ఉపాధ్యాయుల వర్గం మాత్రం ఈసారి మాకు ఆశీస్సులు అందించారు. మన దగ్గర ఉన్న గ్యాడ్యుయేట్లందరూ ఓట్లు నమోదు చేయించుకోలేదు. జరిగిన నమోదు చాలా తక్కువ. ఇలాంటి వాటిలో చైతన్యంగా ఉండే వారే ఓటు నమోదు చేసుకుంటారు.పీడీఎఫ్‌ లాంటి వారు ఇలాంటి ఎన్నికల్లో మొదటి నుంచీ ఉన్నారు.మేం ఇప్పుడే కొత్తగా ఈ ఎన్నికల్లోకి దిగాం. పట్టభద్రులు మినహా ఎన్నికలు జరిగిన అన్నింటినీ గెలుచుకున్నాం..అదనంగా టీచర్లు మాకు మద్దతు పలికారు.

2007లో టీడీపీ గెలిచినా 2009 సాధారణ ఎన్నికలపై దాని ప్రభావం పడలేదు కదా..?
2007లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సిఎంగా ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాడు. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం టీడీపీ రెండు స్థానాలను గెలుచుకుంది.ఆ తర్వాత 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో దాని ప్రభావం ఎమైనా పడిందా…?. లేదు కదా..? పవన్‌ కళ్యాణ్‌తో పొత్తువల్లనో, ఇంకే కారణంతోనో వాళ్ళ బలం పెరుగిందని సంబరాలు చేసుకుంటే వాళ్ల ఖర్మ. ఈ రెండు స్థానాల గెలుపుతోనే.. వాళ్ళ శక్తి పెరిగిందని సంబరాలు చేసుకుంటే వాళ్ల ఆనందం వాళ్లని పొందనివ్వండి. సమాజంలోని అన్ని రంగాల వారు ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు మాకు ఎటువంటి మద్దతు ఉందనేది పరిగణలోకి తీసుకోవాలి. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డి కి ఎంత మద్దతు ఉందో స్పష్టంగా కన్పించింది. రానున్న రోజుల్లో కూడా అదే సీన్‌ రిపీట్‌ అవుతుంది. ఇది ప్రభుత్వ వ్యతిరేకత కానే కాదు..వారంతా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలతో సంబంధం లేని వర్గాలు. అయినా పట్టభద్రుల ఎన్నికల్లోనూ మాకు తక్కువ ఓట్లేమీ రాలేదు. కాకపోతే టీడీపీ నుంచి పోటీ చేసిన వారికి బయట శక్తులు అన్నీ మద్దతు పలకడం వల్ల వచ్చిన ఫలితాలు ఇవి. అసలు మొదటి సారిగా మేం ఈ ఎన్నికల్లోకి దిగినప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు. మొట్టమొదటి సారి దిగాం…ఫస్ట్‌ టైం టీచర్స్‌ నియోజకవర్గాలు రెండూ గెలుచుకున్నాం. ఈ ఫలితాలు ప్రజల అందరి అభిప్రాయంగా భావించడం సరికాదు. మా ప్రయారిటీలు ఏవైతే ఉన్నాయో…అవి ఏ వర్గాలకు రీచ్‌ అయ్యాయో వారంతా ఈ ఎన్నికల్లో లేరు. ఇవి జనరల్‌ ఎన్నికల్లో ప్రభావితం చేయవు…ఈ ఫలితాలను ఏరకంగానూ మాకు ఒక సంకేతంగా అనుకోవడానికి వీలు లేదు.

పట్టభద్రులకు ఉద్యోగ కల్పన చేశాం:
మేం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే లక్షా 30 ఉద్యోగాలు కొత్తగా నియామకాలు చేపట్టడం సాధారణ విషయం కాదు.ఆ తర్వాత 40వేలకు పైగా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలు, మొన్నటి 6వేలకు పైగా పోలీసు ఉద్యోగాలు ఇచ్చాం.ఉద్యోగ, ఉపాధి కల్పనలో కోవిడ్‌ లాంటి ఇబ్బంది కరమైన పరిస్థితుల్లోనూ, ఆర్ధిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా ముందున్నాం.

పోటీ పెట్టాక టీడీపీ వాళ్లు సరదాగా పెట్టాం అని అనలేరు కదా?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వాళ్లు అభ్యర్థిని పెట్టిన తర్వాత గెలుస్తాం అనక ఏమంటారు..? వాళ్లకు సంఖ్యాబలం లేదు…బహుశా తెలంగాణాలో చేసినట్లు ఓటు కు కోట్లు ఇచ్చి చేయాలనుకుంటున్నారేమో..? అక్కడ ఏదో చేయబోయి దొరికారు. సాంకేతికంగా సంఖ్యాబలం ఉన్నప్పటికీ నలుగురు వారివైపు లేరు..అయినా పోటీ పెట్టారు. పోటీ పెట్టాక మేం సరదాగా పెట్టాం..అని అనలేరు కదా?

LEAVE A RESPONSE