యువకులకు ఉద్యోగాలు కల్పించి జగన్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం

– 5 ఏళ్లకే ఎస్టీ మహిళలకు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి జగన్ మోసం చేశారు
– 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తానని మోసం చేశారు
– గిరిజన ఆలయాల్లో పూజారులను నియమించి గౌరవ వేతనం అందజేస్తాం
– కదిరి నియోజకవర్గం కొక్కంటి క్రాస్ వద్ద ఎస్టీ సామాజిక వర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్

తాండాలు, గూడెంలలో కనీస మౌలిక వసతులు, రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం.మొబైల్ నెట్వర్క్ కూడా ఉండటం లేదు.500 జనాభా ఉన్న తాండాలు, గూడెంలను పంచాయతీలుగా గుర్తిస్తాం అని చెప్పి జగన్ మోసం చేశారు.ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు వైసిపి ప్రభుత్వం భర్తీ చెయ్యడం లేదు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చే జీవో 3 ను వైసిపి ప్రభుత్వం అమలు చేయకపోవడం వలన గిరిజన యువత తీవ్రంగా నష్టపోతున్నారు.చదువుకున్న గిరిజన పిల్లలకు ఉద్యోగాలు దొరక్క ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. గిరిజనులకు వచ్చే అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు.45 ఏళ్లకే ఎస్టీ మహిళలకు పెన్షన్ ఇస్తానని జగన్ ప్రభుత్వం మోసం చేసింది.ఆర్థికంగానూ, రాజకీయంగానూ వెనుకబడి ఉన్నాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మమ్మల్ని ఆదుకోవాలి. కనీసం గిరిజనులు గుడి కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదు.గిరిజన గుడి పూజారులకు కూడా ఆర్ధిక సహాయం అందించాలి.గిరిజనులకి ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తానని పాదయాత్ర లో హామీ ఇచ్చి మోసం చేశారు జగన్. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకపోగా, ఎస్టీల భూములను కబ్జా చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం గిరిజనుల భూముల్ని ఇతర అవసరాల కోసం లాక్కుంటింది. – కదిరి ఎస్టీ సామాజిక వర్గం ప్రతినిధులు

లోకేష్ మాట్లాడుతూ.. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగం పై యుద్ధం ప్రకటిస్తాం.అధికారంలోకి వస్తే జగన్ పై కక్ష తీర్చుకుంటారా అని కొంత మంది యువకులు నన్ను అడుగుతున్నారు. కక్ష సాధింపు మా ఎజెండా కాదు. రాష్ట్రంలో ఉన్న యువతీ, యువకులకు ఉద్యోగాలు కల్పించి జగన్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. 500 కంటే ఎక్కువ జనాభా ఉన్న తాండాలు, గూడెం లను పంచాయతీలుగా గుర్తించింది టిడిపి. తాండాలు, గూడెంలలో సిమెంట్ రోడ్లు వేసింది టిడిపి. గిరిజనుల అభివృద్ధి కోసం ఐటిడిఏలు ప్రారంభించింది టిడిపి.

టిడిపి అధికారంలో ఉన్నప్పుడు 14,200 కోట్లు గిరిజనుల అభివృద్ధి కోసం ఖర్చు చేసాం.ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్ అమలు చేసి గిరిజనులకు భూమి పట్టాలు ఇచ్చింది టిడిపి.గ్రావిటీ ద్వారా 205 నీటి ప్రాజెక్టులు నిర్మించి గిరిజన తాండాలుకు, గూడెంలకు సురక్షిత త్రాగునీరు ఇచ్చింది టిడిపి.గిరిజన ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్స్ లు పెట్టింది టిడిపి. గిరిజనులకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చింది టిడిపి. గిరిజన ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ ఉండేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించి టవర్స్ ఏర్పాటు చేశాం. ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేశాం. ఎస్టీలకు విదేశీ విద్య అమలు చేసాం.గిరిజనులకు సబ్సిడీ రుణాలు అందించాం.

గిరిజన అమ్మాయిలకు పెళ్లి కానుక 50 వేలు ఇచ్చాం.భీమా, తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్, ఫుడ్ బాస్కెట్, గిరి గోరు ముద్ద లాంటి ఎన్నో పథకాల్ని టిడిపి ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రవేశ పెట్టింది. ఎస్టీ లను ఆర్థికంగానూ, రాజకీయంగానూ ఆదుకుంది టిడిపి. జగన్ పాలనలో గిరిజనులను దోచుకోవడం తప్ప చేసిన మేలు ఒక్కటీ లేదు. 45 ఏళ్లకే ఎస్టీ మహిళలకు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి జగన్ మోసం చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తానని మోసం చేశారు. తాండాల్లో ఉంటేనే ఉచిత విద్యుత్ అంటూ కండిషన్స్ పెట్టారు. జిఓ 3 ని వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసి గిరిజన యువత కి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రాకుండా చేస్తున్నారు.ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించారు.విలువైన ఖనిజాల పై జగన్ అండ్ కో కన్ను పడింది అందుకే ప్రాజెక్టుల పేరు చెప్పి గిరిజనుల భూములు లాక్కుంటున్నారు.

గిరిజనులకు టిడిపి ప్రభుత్వం లో అమలు అయిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది.500 జనాభా దాటిన తాండాలని పంచాయతీలు గా గుర్తిస్తాం అని జగన్ ఎస్టీలను మోసం చేశారు.వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క తాండా లో కూడా రోడ్డు వెయ్యలేదు, ఒక్క తాగునీటి ప్రాజెక్టు ఏర్పాటు చెయ్యలేదు. భీమా పథకాన్ని రద్దు చేశారు. ఫుడ్ బాస్కెట్, గిరి గోరు ముద్ద లాంటి పథకాల్ని రద్దు చేశాడు.జగన్ ప్రభుత్వం లో గిరిజనుల పై దాడులు పెరిగిపోయాయి.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన భవనాలు ఏర్పాటు చేస్తాం.గిరిజన ప్రాంతాల్లో గుడి నిర్మాణానికి టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్ధిక సహాయం అందిస్తాం. గిరిజన ఆలయాల్లో పూజారులను నియమించి గౌరవ వేతనం అందజేస్తాం. ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు భూమి హక్కు పట్టాలు అందజేస్తాం.