పాఠశాల విద్యార్థులను లాకప్ లో పెట్టడం దారుణం

– జంగారెడ్డిగూడెంలో స్టూడెంట్స్ ను లాకప్ లో పెట్టడాన్ని ఖండించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

ఫ్యాన్ రెక్కలు విరగొట్టారని జంగారెడ్డి గూడెం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులను లాకప్ లో పెట్టడం దారుణం. చిన్న తప్పుకు విద్యార్థులను పోలీసులు కొట్టడమే కాకుండా ఏకంగా లాకప్ లో పెట్టడం నివ్వెరపరిచింది. ఫ్యాన్ రెక్కలు పాడు చేయడం ఏమన్నా హత్యానేరమా? పాఠశాల విద్యార్థులను పోలీస్ స్టేషన్ లో మరుగుదొడ్లు కడగాలి అని చెప్పడం…సంతకాలు పెట్టించుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఘటనకు బాధ్యులందరి పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ విద్యార్దులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి.