– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
ఒక కన్నుని పొడిచిన మరో కన్నుని సీబీఐ అరెస్ట్ చేసే వేళ, ఆదిరెడ్డి కుటుంబాన్ని సిఐడి అదుపులోకి తీసుకోవడం జగన్ స్టైల్ డైవర్షన్ డ్రామా. ఫిర్యాదులు లేని కేసుల్లో బిసి టిడిపి నేతలైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులని అదుపులోకి తీసుకోవడం ఏ1 దొంగ పాలనలోనే సాధ్యం. వైసీపీలో చేరలేదనే అక్కసుతో బీసీ నేతలైన ఆదిరెడ్డి కుటుంబంపై కక్ష కట్టడం దారుణం. ఆదిరెడ్డి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.