-దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనారిటీలకు అత్యంత సురక్షితమైంది
-ముస్లిం మైనారిటీలకు ఎంఎల్ఏలుగా,ఎంఎల్సిలు,గా నామినేటెడ్ పదవులలో వైయస్ జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు
-చంద్రబాబు ముస్లిం మైనారిటీలను చిన్నచూపు చూశారు
-ముస్లింలపై అక్రమ కేసులు బనాయించారు.ముస్లిం యువకులను వేధించారు
-ముస్లిం మైనారిటీల సమస్యల పరిష్కారానికి అవసరమైతే చట్టసవరణకైనా సిఎం వైయస్ జగన్ సిధ్దంగా ఉన్నారు
-ముస్లిం మైనారిటీలు వైయస్సార్ సిపి కి అండగా నిలవాలని నిశ్చయించుకోవడం శుభపరిణామం
-ముస్లిం మతపెద్దలు,ముస్లిం స్వఛ్చంధసంస్ధలు,పార్టీ మైనారిటీ విభాగం ప్రతినిధుల సమావేశంలో డిప్యూటి సిఎం అంజాద్ భాషా,పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు వైయస్సార్ సిపికి,రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు అండగా ఉండాలని నిశ్చయించుకోవడం శుభపరిణామం అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషా అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మైనారిటీల భధ్రతకు,సంక్షేమానికి,వారి ఉన్నతికి అనేక నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ దే నని అన్నారు. ముస్లిం మైనారిటీ మత పెద్దలు,ముస్లిం స్వచ్చంధ సంస్ధలు,మైనారిటీ విభాగం జిల్లాల అధ్యక్షులతో తాడేపల్లిలోని వైయస్సార్ సిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం సమావేశం జరిగింది. సమావేశానికి పార్టీ మైనారిటీ
విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ భాషా అధ్యక్షత వహించారు. ముస్లిం మైనారిటీలకు వైయస్సార్ సిపి ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు,వారి సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు వాటిని ప్రజలలోకి తీసుకువెళ్ళడం.తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో డిప్యూటి సిఎం అంజాద్ భాషాతోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి,పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ భాషా,హజ్ కమిటీ రాష్ట్ర చైర్మన్ గౌస్ లాజం,శాసనమండలి సభ్యులు రుహుల్లా పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు లేళ్ళ అప్పిరెడ్డి పాల్గొన్నారు.
డిప్యూటి ముఖ్యమంత్రి అంజాద్ భాషా మాట్లాడుతూ వైయస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లు ముస్లిం మైనారిటీ కుటుంబాలలో ఏ విధంగా వెలుగులు నింపాయో నేడు వైయస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ముస్లిం మైనారిటీలు అన్ని రంగాలలో అభివృద్ది చెేందేందుకు దోహదం చేస్తున్నాయని అన్నారు. అయితే ఇటీవల కాలంలో టిడిపి నేతలు,చంద్రబాబు,లోకేష్ వంటి వాళ్లు ఈ ప్రభుత్వం ముస్లింలకు ఏమీ చేయడం లేదంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని వాటిని ముస్లింలందరూ తిప్పికొట్టాలన్నారు. చంద్రబాబు హయాంలో ముస్లింలపై చేసిన అరాచకాలు ప్రతి ముస్లింను గాయపరిచాయన్నారు. వాటిని ముస్లింల ఎవ్వరూ మరిచిపోలేదన్నారు. ముస్లిం జనాభా నివసిస్తున్న ప్రాంతాలలో వైయస్ జగన్ చేసిన మేలును,చంద్రబాబు ముస్లింలపై చేసిన అరాచకాలపై చైతన్యం తేవాల్సిన అవసరం ఉందన్నారు.జిల్లా స్ధాయిలలో ముస్లిం మైనారిటీలతో సదస్సులను నిర్వహించి వారిలో చైతన్యం తెస్తామని వివరించారు.
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలను ఓటుబ్యాంకుగా గతంలో రాజకీయపార్టీలు ఉపయోగించుకునేవని అన్నారు. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డిగాని,నేడు వైయస్ జగన్ కాని ముస్లిం మైనారిటీలలో వెనకబాటుతనాన్ని రూపుమాపాలనే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ముఖ్యంగా ముస్లింలకు వైయస్సార్ ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లు వారి కుటుంబాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయని అన్నారు. నేడు వైయస్ జగన్ ముస్లిం మైనారిటీలను ఎంఎల్ఏలుగా,ఎంఎల్సిలుగా,నామినేటెడ్ పదవులలోను,స్దానికసంస్ధల్లోను విశేష ప్రాధాన్యం ఇచ్చారన్నారు. నేడు అమలు జరుగుతున్న అమ్మఒడితోపాటు షాదితోఫా,విదేశీ విద్య వంటి అనేక పధకాలు ముస్లింలలో పేదరికాన్ని పొగొట్టేవిధంగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఆ పధకాలు అందుకుంటున్న ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ సోదరులు వాటిని వారి కమ్యూనిటిలో చెప్పడంతోపాటు వారిలో చైతన్యం తేవాలన్నారు. దేశంలో ముస్లిం మైనారిటీలకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంలో వైయస్సార్ సిపి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాత్రమేననేది దేశంలోని ఇతర ప్రాంతాలలోని ముస్లిం మైనారిటీలందరూ ముక్తకంఠంతో చెబుతున్నారని అన్నారు. వైయస్ జగన్ ముస్లిం మైనారిటీల సమస్యల పరిష్కారం పట్ల ఎంత కృతనిశ్చయంతో ఉన్నారంటే వారికి ప్రయోజనం కలుగుతుందంటే అవసరమైతే చట్టాలు సైతం మార్చడానికి సిధ్దంగా ఉన్నారని వివరించారు. ముస్లిం మైనారిటీలు వారికి జరుగుతున్న మేలును వారి కుటుంబాలలో ప్రతి ఒక్కరికి తెలియచేయడంతోపాటు వైయస్ జగన్ పాలనలో ముస్లిం మైనారిటీలు సురక్షితంగా ఉన్నారనే విషయాన్ని కూడా చెప్పాలని కోరారు. ముస్లిం మైనారిటీల సమస్యలను పార్టీ కేంద్ర కార్యాలయానికి గాని,తన దృష్టికి గాని నేరుగా కాని తెలియచేస్తే వారి సుాచనలు,సలహాలు తీసుకుంటానికి ఎల్లప్పుడూ సిధ్దంగా ఉన్నామని అన్నారు.
పలవురు ముస్లిం స్వచ్చంధ సంస్ధల ప్రతినిధులు మాట్లాడుతూ వైయస్సార్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లభించినన్ని పదవులు గతంలో మరే ప్రభుత్వంలో లభించలేదన్నారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి వైయస్ జగన్ తీసుకుంటున్నారని సదా ఆయనకు రుణపడి ఉంటామని అన్నారు.