ప్రముఖ జర్నలిస్ట్ G.భగీరథ గారు రాసిన నాగలాదేవి పుస్తకాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీ కృష్ణ దేవరాయల ప్రేమ కథ పై రచయిత నాగలాదేవి అనే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చారు.
తిరుపతికి సమీపంలోని నాగలాపురం గ్రామానికి చెందిన నాగలాదేవిని శ్రీ కృష్ణ దేవరాయల ప్రేమించి వివాహం చేసుకున్నారు. పెళ్లి అయిన తరువాత నాగలాదేవి పేరును చిన్నా దేవి అని మారుస్తారు. కానీ చరిత్రలో నాగలాదేవి వేరు, చిన్నాదేవి వేరు అనే చర్చ, వాదన ఉంది. కానీ ఇద్దరు వేరు కాదు… ఒకటే అని పుస్తకంలో రచయిత పేర్కొన్నారు. దాదాపు 16 ఏళ్ల పరిశోధన చేసి నాగలాదేవి పుస్తకాన్ని తీసుకువచ్చిన భగీరథను చంద్రబాబు నాయుడు అభినందించారు. రాజ్య పాలనలో నాగలాదేవి శ్రీ కృష్ణ దేవరాయలకు ఎలా సహకరించిందో పుస్తకంలో పేర్కొన్నారు.