Suryaa.co.in

Andhra Pradesh

బందరు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం జగన్‌

బందరు ప్రజల చిరకాల కల ఎట్టకేలకు సాకారం అయ్యింది. సీఎం వైయ‌స్‌ జగన్‌ బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించారు. తపసిపూడి తీరంలో బ్రేక్‌ వాటర్‌ పనులకు శ్రీ‌కారం చుట్టారు. ముందుగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి పైలాన్‌ ఆవిష్కరించారు. వైయ‌స్ జ‌గ‌న్ రాక‌తో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణ నెలకొంది. సోమవారం ఉదయమే తపసిపూడిలో భూమి పూజ చేసి పైలాన్‌ ఆవిష్కరించారు.  సీఎం వైయ‌స్‌ జగన్‌ను చూసేందుకు జనం అక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్లను చూసి ఆయన అభివాదం చేశారు.

LEAVE A RESPONSE