జగన్..మాతో పెట్టుకుంటే మడతడిపోద్ది!

Spread the love

– సీఎం జగన్‌ను తొడగొట్టి హెచ్చరించిన 12 ఏళ్ల పోరడు
– బాలకృష్ణ సినిమా డైలాగులతో అదరగొట్టేసిన మంగళగిరి బాలసింహం
– అచ్చం రోజా, అంబటి, కొడాలి, పేర్నిలా జగన్‌ను తిట్టిపోసిన బాలుడు
– సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్న జగన్‌కు వార్నింగ్ వీడియో
( మార్తి సుబ్రహ్మణ్యం)

అది మంగళగిరి టీడీపీ నిరసన దీక్షా శిబిరం. చాలామంది నాయకులు మాట్లాడారు. తమ పార్టీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సీఎం జగన్‌ను, టీడీపీ నేతలంతా తలోరకంగా విమర్శించారు. అందులో పెద్ద వైరీటీ ఏమీ లేదు. ఎందుకంటే.. అది ఎక్కడైనా కామనే కాబట్టి!

అయితే రొటీన్‌కు భిన్నంగా.. ఇక్కడే ఓ విచిత్రం జరిగింది. హటాత్తుగా ఓ పన్నెండేళ్ల పోరడు శిబిరంలో ఎంట్రీ ఇచ్చాడు. చూస్తే ఏదో స్కూల్‌లో చదువుకునే కుర్రాడిలా ఉన్నాడు. చేతిలో మైకు అందుకున్నాడు. ఈ బాలబచ్చా ఏం మాట్లాడతాడోనని, చాలామంది ఆసక్తిగా వినడం ప్రారంభించారు. అంతే.. వాళ్ల రోమాలు నిక్కబొడుచుకున్నాయి. భృకుటి ముడిపడింది. కళ్లు అటే చూస్తున్నాయి. చెవులు రిక్కిరించి వింటున్నారు. ఆ లెవల్లో సాగింది ఆ పోర గాడి ప్రసంగం. చేతిలో కాగితం లేకుండా, కెమెరాలనే చూస్తూ ఆ పోరగాడు మాట్లాడిన స్టైల్‌కు అంతా యమా ఫిదా అయిపోయారు.

చంద్రబాబును అరెస్టు చేయడం ఆ పిల్లాడికి అస్సలు నచ్చినట్లు లేదు. అందుకే మైకందుకుని, సీఎం జగన్‌పై మాటల దండయాత్ర మొదలుపెట్టాడు. ఆ దండయాత్ర రేంజ్ ఒక లెవల్‌లో లేదు. ఆ పిల్లాడికి .. తన ‘మేనమామ’ సీఎం జగనన్నకు, మర్యాద ఇవ్వాలన్న సంగతి బొత్తిగా తెలిసినట్లు లేదు. కనీస మర్యాద కూడా ఇవ్వకుండా, జగనన్నను ఒకరేంజ్‌లో ఆడేసుకున్నాడు ఆ పోరడు. అంటే అచ్చం రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్ తిట్ల స్టైల్‌ను ఫాలో అయ్యాడన్న మాట!

‘‘స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏం పీకావురా ? నీ అయ్య చచ్చిన ఇడుపులపాయలో కూడా సెంటర్ పెట్టాడు కదా? అభివృద్ధి చేయడం తప్పా? ఉద్యోగాలివ్వడం తప్పా? రంగుల కోసం 2 వేల కోట్లు వృధా చేశారు. సంచుల కోసం 750 కోట్లు వృధా చేశావు. దాన్నేం చేయమంటావ్??చంద్రబాబును అరెస్టు

చేసి ఏడురోజులయింది కదా? ఏం పీకావ్. చెప్పరా సన్నాసి! అసెంబ్లీలో తీర్మానించే కదా సెంటర్లు పెట్టింది? అసలు నీది అసెంబ్లీకి వెళ్లిన ముఖమేనా? జగన్‌కంత్రీ! గుర్తుంచుకో జగన్మోహన్‌రెడ్డీ.. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇల్లూ మీ ఇంటికి అంతే దూరం. మా భువనేశ్వరికి భూదేవంత సహనం ఉంది. అధికారమనే మదంతో ఒళ్లు బలిసిన చేష్టలతో విర్రవీగితే, అధికారం మాదైనప్పుడు.. నువ్వు జ్వరంతో ఉన్నా జపాన్‌లో ఉన్నా.. తాడేపల్లిలో ఉన్నా థాయ్‌లాండ్‌లో ఉన్నా, నిన్నూ నీ సైకోగాళ్లను రోడ్డుకీడ్చి బుద్ధిచెబుతామని, అన్నగారి ముందు శపథం చేస్తున్నా’’ అంటూ, సీమ సినిమాల్లో బాలకృష్ణ స్టైల్లో.. తొడగొట్టిమరీ జగన్‌ను దునుమాడిన ఆ పోరగాడి ప్రసంగానికి, అంతా తెగ ఫిదా అయ్యారనుకోండి.

ఇదీ.. మంగళగిరి బాలబచ్చా తన ‘మేనమామ జగనన్న’పై రెచ్చిపోయిన తీరు. ఆ పిల్లాడి ప్రసంగానికి చప్పట్ల సంగతి అటుంచితే.. రేపు ఆ పోరగాడిని ఏ నేరం కింద బొక్కలో తోస్తారేమోనన్న డౌటనుమానం.. ఆల్రెడీ టీడీపీ తమ్ముళ్లకు వచ్చేసింది లెండి! చూడాలి ఏం జరుగుతుందో?! ఇప్పుడు ఈ వీడియో సోషోల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హారి భడవా.. ఇంతలేవు అంత ధైర్యం ఏందిరా బిడ్డా అంటూ.. ఆ పోరడి ధైర్యానికి అంతా తెగమెచ్చేసుకుంటున్నారు!

Leave a Reply