యడ్యూరప్పకు రైటైనది.. చంద్రబాబు రాంగెలా అవుతుందప్పా?!

Spread the love

– సుప్రీం లాయర్ ముకుల్ వాదనపై సోషల్‌మీడియా ప్రశ్నల వర్షం
– ముకుల్ రోహత్గీ వాదనలు నాడు ఒకలా.. నేడు మరోలా..

స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు పై 17A సెక్షన్ వర్తించదంటూ ప్రభుత్వం తరపున ప్రముఖ లాయర్ ముకుల్ రోహత్గీ చేసిన వాదనల కు న్యాయనిపుణులు సైతం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప కు సంబంధించిన కేసులో.. మాజీ ముఖ్యమంత్రిపై విచారణలకు 17A సెక్షన్ వర్తిస్తుందని… వాదించి అనుకూల ఫలితం సాధించారు.

గతంలో యడ్యూరప్ప అవినీతికి పాల్పడ్డారంటూ ఓ ప్రైవేటు వ్యక్తి లోకాయుక్తలో కేసు వేశారు. దానిపై విచారణకు లోకాయుక్త ఆదేశించింది. ఆ ఆదేశాలు చెల్లవని యడ్యూరప్ప కోర్టుకు వెళ్లారు. ఆ కేసులో యడ్యూరప్ప తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. యడ్యూరప్పకు 17A సెక్షన్ వర్తిస్తుందని, ఆయనపై విచారణ చేయడానికి వీల్లేదని వాదించారు. సుప్రీంకోర్టు ఆయన వాదనను అంగీకరించింది. యడ్యూరప్పపై విచారణ నిలిపివేసింది.

నిజానికి 17A పూర్తిగా చంద్రబాబుకు వర్తిస్తుంది. యడ్యూరప్పపై విచారణకు లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. కానీ ప్రభుత్వం కాదు. ఇక్కడ 17A పూర్తిగా అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై.. తర్వాత వచ్చే ప్రభుత్వాలు కక్ష సాధించకుండా కల్పించిన రక్షణ. ఇక్కడ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని… పార్టియల్ విచారణ జరిపి… అసలు ప్రాజెక్టులో భాగమైన వారిని కనీసం ప్రశ్నించకుండా, నేరుగా ముఖ్యమంత్రిని నిందిడిగా చేశారని స్పష్టమవుతోంది.

అంటే కక్ష సాధింపులేనని అర్థమవుతోంది. అయినా ఇక్కడ ముకుల్ రోహత్గీ మాత్రం… చంద్రబాబుకు ఈ సెక్షన్ వర్తించదని వాదించారు. అందరికీ ఒకే రాజ్యాంగం.. ఒకే చట్టం.. ఒకే న్యాయం . ఈ విషయం ముకుల్ రోహత్గీకి తెలియనిది కాదు. కానీ ఆయన సీనియర్ లాయర్ గా ఉండి.. సుప్రీంకోర్టులో తాను వాదించి మరీ అనుకూల ఫలితం తెచ్చిన తరహా కేసులో, హైకోర్టులో భిన్నమైన వాదనలు వినిపించారు.

ఇలా ఓ లాయర్ వ్యవహరించవచ్చా అనేది నైతిక పరమైన విషయం. కానీ ఇలా పరస్పర విరుద్దమైన భిన్నమైన తీర్పులు వస్తే… వాదిస్తే ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం తగ్గిపోతుందన్న విషయాన్ని, ఈ సీనియర్ లాయర్ ఎందుకు గుర్తించలేకపోతున్నారో చాలా మందికి అర్థం కాని విషయంగా మారింది. యడ్యూరప్పకేసులో రోహత్గీ వినిపించిన వాదనలు… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లైవ్ అండ్ లా హ్యాండిల్లో ఈ వాదనల సమాహారం ఉంది.

– నానా

Leave a Reply