Suryaa.co.in

Telangana

ఫార్మా రంగానికి ఉజ్వల భవిష్యత్తు

-వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఫార్మా పరిశ్రమ మద్దతు అవసరం
-ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల వల్ల ప్రజలకు 50 నుంచి 90 శాతం తక్కువ ధరకు మందులు
-హైటెక్స్ లో జరిగిన ఇండియన్ ఫార్మాసూటికల్ కాంగ్రెస్ 73వ సమావేశం లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: ఫార్మా పరిశ్రమకు చెందిన రీసెర్చ్ అండ్ డెవెలప్ మెంట్, క్వాలిటీ కంట్రోల్, అస్యూరెన్స్, మార్కెటింగ్ రెగ్యులేటరీ వంటి వివిధ విభాగాలకు ప్రాతినిధ్యం వహించే 50 వేల మంది ఫార్మసీ ప్రొఫెషనల్ పాల్గొన్న ఈ సమావేశంలో మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది హైదరాబాద్ ను ఫార్మసీ హబ్ గా మార్చిన ఫార్మా ఇండస్ట్రీకి నా ధన్యవాదాలు.

మనదేశ ఎగుమతుల్లో ఫార్మా ఉత్పత్తులే ఐదో అతి పెద్ద కమాడిటీ. ఎగుమతుల్లో 5 శాతం కన్న ఎక్కువ వాటా ఈ ఫార్మా రంగానిదే. గత ఏడాది మన దేశం 1లక్ష 83 వేల కోట్ల రూపాయల విలువైన ఫార్మస్యూటికల్ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇందులో 35 శాతం, అంటే 67 వేల కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను ఒక్క అమెరికాకే ఎగుమతి చేశాం. భారతీయ ఫార్మస్యూటికల్ ఉత్పత్తులు నాణ్యతలో, అన్ని విధాల బెస్ట్ అని దీని ద్వార రుజువవుతున్నది.

కరోన కష్టకాలంలో భారత దేశం యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ తయారు చేసి యావత్ ప్రపంచానికి అందజేసింది. భారత దేశం దాదాపు 75 మిలియ డోసుల వ్యాక్సిన్ ను 94 దేశాలకు, ఐక్య రాజ్య సమితికి చెందిన రెండు ఎంటిటీలకు అందజేయడంతో భారత్ విశ్వబంధు గా ప్రపంచంలో కీర్తి పొందింది. అందుకే ఈ 73 వ సమావేశంలో ప్రపంచంలో భారతీయ ఫార్మా రంగం యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తుంది వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం ఫార్మా పరిశ్రమ మద్దతు చాలా అవసరం.

ప్రస్తుతం మనది ప్రపంచంలో అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. త్వరలోనె 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలనేది లక్ష్యం. 2027 నాటికి భారత్ ను ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకల్పంతో అద్భుతమైన మౌలిక సదుపాయాల కల్పనకోసం భారత్ పనిచేస్తుంది పి ఎం గతి శక్తి ద్వారా ఈ ప్రయత్నం కొనసాగుతుంది.

ప్రస్తుతం మన దేశంలో 74 ఆపరేషనల్ విమానశ్రయాలు ఉన్నాయి. రవాణా, హైవే బడ్జెట్ కేటాయింపులు చూస్తే 2014 తర్వాత 500 శాతం పెరిగాయి. మన నేషనల్ హైవే నెట్ వర్క్ 2014 లో 91 వేల 287 కిలోమిటర్లు ఉంటే ఇప్పుడు లక్షన్న కిలోమీటర్లకు, అంటే 60 శాతం పెరిగింది.

రైల్వే శాఖ దాదాపు 3 వేల కిలొమీటర్ల డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ నిర్మాణం తలపెట్టింది. మన దేశం విద్యుత్ డిమాండ్ 2013-14 లో 136 గిగా వాట్స్ ఉండేది. 2023 నాటికి 244 గిగా వాట్స్కు, అంటే 508 శాతం పెరిగింది.

ఈ మౌలిక సదుపాయల వల్ల ఫార్మ వంటి రంగాల్లో మరింత వృద్ధి సాధ్యమవుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అవినీతి రహిత పాలన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గ్యారంటీ ఇస్తుంది. కాలం చెల్లిన 1562 చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసింది.

ఆధార్, యుపీఇ, జన్ ధన్ బ్యాంక్ ఖాతాల ద్వారా అద్భుతమైన పబ్లిక్ ఇంఫ్రాస్ట్రక్చర్ ఎకో సిస్టం ను ప్రభుత్వం రూపొందించింది. ఈ చర్యల వల్ల్ల ఫార్మా రంగాన్ని ఆత్మనిర్భర్ లో భాగంగా స్వయం సమృద్ది సాధించేందుకు అవకాశం ఉంది.

దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి 15 వేల కోట్లను కేటాయించింది. రాబోయే బల్క్ డ్రగ్ పార్కులో కామన్ ఇంఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ని పెంచడానికి మోదీ ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుంది. భారతీయ ఫార్మ రంగం అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేలా ఫార్మస్యూటికల్ టెక్నాలజీ అప్ గ్రేడేషన్ అసిస్టెన్స్ స్కీం దోహదపడుతుంది.

భారత ఫార్మా పరిశ్రమ శక్తిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దానికి అవసరమైన సహాకారాన్ని అందిస్తుంది. ఆరోగ్య రంగంపై మా ప్రభుత్వ చర్యల వల్ల మెడికల్ కాలేజీలు 2014లో 388 ఉంటే ఇప్పుడు 706కు, పెంచాం అంటే 82 శాతం పెరిగింది. MBBS సీట్లు112 శాతం పెరిగాయి. 2014లో 51 వేల 348 MBBS సీట్లు ఉంటే అవి ఇప్పుడు లక్షా 9 వేలకు పెరిగాయి. పీజీ సీట్లు కూడా 127 శాతం పెంచాం.

ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 12 కోట్ల కుటుంబాలకు 5 లక్షల రూపాయల వరకు వైద్య బీమా కల్పిస్తున్నాం. ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల వల్ల ప్రజలకు 50 నుంచి 90 శాతం తక్కువ ధరకు మందులు అందిస్తున్నాం. ఫార్మా రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని దానికీ మా ప్రభుత్వం సహకారం ఉంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించాలని కోరారు ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి మోడీ దృష్టికి తీసుకెళ్లి నా వంతు ప్రయత్నం చేస్తాను.

LEAVE A RESPONSE