రైతుపై రెచ్చిపోయిన ఇసుక మాఫియా

188

– అడ్డుకుంటావా అంటూ….భౌతిక దాడి
– ముసాపేట్ లో మళ్ళీ రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
– డబుల్ బెడ్ రూమ్ ల పేరిట అక్రమ దందా
– గత మూడు రోజులుగా 300 వాహనాల్లో ఇసుక అక్రమ రవాణా
– కేసులు వద్దంటున్న మాఫియా…. పైరవీలు షురూ
– ముసాపేట్ పోలీసులపై ఒత్తిడి తెస్తున్న ఓ టీఆర్ఎస్ నేత
– చోద్యం చూస్తున్న రెవిన్యూ, పోలీస్,మైనింగ్ అధికారులు
– ఇసుక మాఫియాను….అడ్డుకుంటాం
– సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటాం….ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గతంలో కలెక్టర్, ఎస్పీలు జారీ చేసిన ఆదేశాలు నీటిమీద రాతలుగా మిగిలిపోతున్నాయి. గత మూడు రోజులుగా ముసాపేట్ మండలంలోని తాళ్లగడ్డ వాగు నుండి ప్రతీ రోజు దాదాపు 20 ట్రాక్టర్ లతో ఇసుకను ఇప్పటికే దాదాపు 300 అక్రమంగా తరలిస్తున్న సంబంధిత రెవిన్యూ, పోలీస్, మైనింగ్, అధికారులు
mhb మాత్రం తమకేమీ పట్టనట్టుగా, తాపీగా చోద్యం చూస్తున్నారు. ఇదిలా ఉంటే గురువారం మధ్యాహ్నం ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ రైతుపై రెచ్చిపోయిన ఇసుక మాఫియా….మమ్మల్ని అడ్డుకుంటావా అంటూ….బట్టలు చించి మరి ఇసుక మాఫియా దాడి చేసిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

డబుల్ బెడ్ రూమ్ ల పేరిట అక్రమ దందా
మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట్ మండలంలో డబుల్ బెడ్ రూమ్ ల పేరిట ఇసుక మాఫియా మళ్ళీ రెచ్చిపోతుంది. జానంపేట్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం కోసం కేవలం నామమాత్రపు అనుమతులు పొంది, గత మూడు రోజులుగా విచ్చలవిడిగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక మాఫియాకు ఒకవైపు రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో అటువైపు రెవిన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు వెళ్లేందుకు జంకుతున్నారు. దింతో ఇసుక మాఫియా 3 ట్రాక్టర్లు …..6 భారత్ బెంజ్లు అన్న చందంగా ముసాపేట్ మండలంలో యథేచ్ఛగా ఇసుకను అక్రమ రవాణా తరలిస్తుంది.

కేసులు వద్దంటున్న మాఫియా…. పైరవీలు షురూ
ఇదిలా ఉంటే కేసులు వద్దంటూ ఇసుక మాఫియా…. పైరవీలు షురూ చేసింది.స్థానిక ఓ అధికార పార్టీ నేత రంగంలోకి దిగి కేసు….గీసు వద్దు….ఏమైనా ఉంటే నేను మాట్లాడుతా….అంటూ బేరసారాలు షురూ చేశారు. ఇసుక మాఫియా దాడిలో గాయపడిన తాళ్లగడ్డకు చెందిన రైతు నరేష్ పిర్యాదు చేసేందుకు ముసాపేట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడన్న విషయాన్ని తెలుసుకున్న సదరు అధికార పార్టీ నేత….ఎట్టి పరిస్థితుల్లోనూ కేసులు నమోదు చేయొద్దంటూ…. పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

డబుల్ బెడ్ రూమ్ లకు అనుమతి ఇచ్చాం: తహసీల్దార్ మంజుల
ముసాపేట్ మండల పరిధిలోని జానంపేట్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం పేరిట ఇసుక మాఫియా ఇసుకను గత మూడు రోజులుగా దాదాపు 300 ట్రాక్టర్లు అక్రమంగా తరలిస్తున్నరని నేను సైతం స్వచ్ఛంద సంస్థ గురువారం ఫిర్యాదు చేయగా, డబుల్ బెడ్ రూమ్ ల కోసం కేవలం 20 ట్రిప్పులు అనుమతులు ఇచ్చామని ముసాపేట్ తహసీల్దార్ మంజుల తెలుపడం గమనార్హం. కేవలం 20 ట్రిప్పులు మాత్రమే అనుమతులు పొంది, గత మూడు రోజులుగా విచ్చలవిడిగా దాదాపు 300 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తరలించడం కొసమెరుపు.

ఇసుక మాఫియాను….అడ్డుకుంటాం
మహబూబ్ నగర్ జిల్లా దేవర్ కద్ర నియోజకవర్గo ముసాపేట్ మండలంలో ఇసుక మాఫియా మళ్లీ, మళ్ళీ రెచ్చిపోతున్న….అడ్డుకోవాల్సిన పోలీస్, మైనింగ్, రెవిన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా, తాపీగా చోద్యం చూస్తున్నారని, గతంలో ఇసుక మాఫియాకు స్థానిక పోలీసులు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయన్నారు సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ jకుమార్. రైతు నరేష్ పై దాడి చేసిన ఇసుక మాఫియాపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఇకనైనా ముసాపేట్ మండల రెవిన్యూ, పోలీస్ అధికారులు స్పందించి ఇసుక మాఫియాపై, సదరు కాంట్రాక్టర్ లపై వాల్టా చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో …” నేనుసైతం” ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకుంటామని …..సామాజిక కార్యకర్త, …” నేనుసైతం” స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు.