– నుడా చైర్మన్ కోటంరెడ్డి డిమాండ్
నెల్లూరు: జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని.. ఆ ప్రస్టేషన్లోనే పోలీసులపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. అరాచకాలకు, విధ్వంసాలకు జగన్మోహన్ రెడ్డే బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం పోయినా.. జగన్ లో ఇంకా అహంకారం తగ్గలేదన్నారు. ఈ మేరకు కోటంరెడ్డి ఇక్కడి జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. పోలీస్ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి. అదే పోలీసులను అడ్డం పెట్టుకుని రఘురామ కృష్ణంరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టలేదా అని కోటంరెడ్డి ప్రశ్నించారు.
పోలీసులను ఎలా వాడుకోవాలో, ప్రత్యర్దులపై ఎలా అక్రమ కేసులు పెట్టించాలో జగన్ పాలనలో చూశామన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎప్పుడూ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చెయ్యలేదన్నారు. పోలీస్ వ్యవస్థ పట్ల, ప్రజాస్వామ్యం పట్ల జగన్మోహన్ రెడ్డికి గౌవరం లేదన్నారు.
అసెంబ్లీ ప్రతిష్ఠను నాశనం చేశారు
దేవాలయం లాంటి అసెంబ్లీలో జిప్ విప్పడం, మహిళలను కించపరచడం చేసిన వారికే జైలే గతి అని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన చంద్రబాబుపై, ఆయన సతీమణిపై వంశీ చేసిన వ్యాఖ్యలను ఇంకా రాష్ట ప్రజలు మరిచిపోలేదన్నారు. కొడాలి నానికి కూడా చిప్పకూడు తప్పదన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని మండిపడ్డారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు మామిడాల మధు, మాజీ కార్పొరేటర్ పిట్టి సత్య కువ్వరపు బాలాజీ, షైక్ జహీర్, మొయుదిన్, తంబీ సుజన్, షాహిద్, పిరిగల నవీన్, వినుకుల సుధాకర్, టీడీపీ నాయకులు హాజరయ్యారు.