గుంటూరు: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఫ్) శాఖలో మధుసూదనరావు అందించిన సేవలు సాటిలేనివని ఆర్పీఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమీషనర్ షణ్ముగం వడివేలు పేర్కొన్నారు. పట్టాభిపురంలోని డి.ఆర్.ఎం కార్యాలయంలో జరిగిన డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ గోళ్లమూడి మధుసూదనరావు ఉద్యోగ విరమణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
దీనికి అసిస్టెంట్ కమిషనర్ శైలేష్ కుమార్ అధ్యక్షత వహించారు. వడివేలు మాట్లాడుతూ.. శాఖ పరంగా మధుసూదనరావు కు దక్కినన్ని అవార్డులు, రివార్డులు మరే అధికారికి దక్కలేదన్నారు. మధు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ యేడాది ఆయనకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ లభించటం శాఖకు గర్వ కారణమన్నారు.
డిప్యూటీ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ వల్లేశ్వర బి. తోకల మాట్లాడుతూ.. విధి నిర్వహణలో సమర్థత, విశ్వసనీయత, దక్షత ఉంటే ఏ అధికారైనా తప్పక రాణిస్తారన్నారు. డిపార్ట్మెంట్ లో మధుసూదనరావు తన శక్తిమేర పనిచేసి మంచి గుర్తింపు పొందారని కొనియాడారు.
రిటైర్డ్ అధికారి మధుసూదనరావు మాట్లాడుతూ..కష్టపడితే ఏదైనా సాధించవచ్చునన్నారు. ఉద్యోగులు అందించిన సహకారం మరువలేనన్నారు.
విధి నిర్వహణలో మధుసూదనరావు చూపిన ప్రతిభ, నైపుణ్యాన్ని వివిధ ఉద్యోగులు ప్రశంసించారు.
ఈ సందర్బంగా మధుసూదన రావును పెద్ద ఎత్తున సన్మానించారు. అనంతరం మధుసూదనరావు దంపతులను మేళతాళాలతో టాపు లేని జీపులో ఊరేగించి, ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో ఆర్ పి ఎఫ్ అధికారులు శైలేష్, పవన్ సింగ్, చెంచయ్య, మర్రి సాంబశివరావు, అక్కేశ్వరరావు, మురళికృష్ణ, రవిశంకర్, చంద్రశేఖర్, దుర్గా ప్రసాద్, నారాయణ కుటుంబ సభ్యులు గోళ్లమూడి భాస్కరరావు, శ్రీనివాస్, సుశీల, బోడెపూడి అనిల్, జ్యోతి, గుమ్మడి సుబ్బారావు, భార్గవి పాల్గొన్నారు.