చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం!
యువగళం పాదయాత్ర నుండి నారా లోకేష్
జగన్మోసపురెడ్డి మాటలకు,చేతలకు పొంతన ఉండదనడానికి నిలువెత్తు నిదర్శనం చింతలపూడి ఎత్తిపోతల పథకం. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లా మెట్టప్రాంతంలో రైతులకు గోదావరి జలాలు అందించే లక్ష్యంతో చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం విస్తరణ పనులను శరవేగంతో పరుగులు తీయించారు దార్శనిక నేత చంద్రబాబునాయుడు.
దీనిద్వారా రెండుజిల్లాల్లోని 33మండలాల్లో 4.80లక్షల ఎకరాలకు నీరందించేందుకు గత ప్రభుత్వ హయాంలో రూ.4909 కోట్ల అంచనాలతో పనులు చేపట్టి, అధికారం నుంచి వైదొలగేనాటికి రూ.2289 కోట్లు ఖర్చుచేశాం.
ప్రాజెక్టు విస్తరణకు భూసేకరణ సమయంలో నిర్వాసిత రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి రెచ్చగొట్టిన జగన్… అధికారంలోకి వచ్చాక రైతులకు పరిహారం ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల మాట దేవుడెరుగు… ఉన్న ఎత్తిపోతల పథకాలకు కరెంటుబిల్లులు కట్టలేక పాడుబెడుతున్నారు. విధ్వంసకుడు జగన్ అరాచకానికి, చేతల మనిషి చంద్రన్న సమర్థతకు అద్దం పడుతోంది చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు.