కూటమి వస్తేనే రామరాజ్యం

-వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాల్లోనూ అవినీతే
-ఎస్సీ, ఎస్టీ, బీసీల నిధులు దారిమళ్లించారు
– విజయవాడ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

టీడీపీతో కలిసి వెళ్లాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. మూడు పార్టీల కలయిక చారిత్రక అవసరం. అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలని నిర్ణయించాం. పొత్తుల వల్ల కొంతమంది ఆశావహులకు నిరాశ ఎదురైంది. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తులు తప్పదని భావించాం. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను చేతుల్లోకి తీసుకుంది. భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారు.

సచివాలయాలు, ప్రభుత్వ భవనాలనూ తనఖా పెట్టేశారు.ప్రభుత్వ ఆస్తుల తనఖా అధికారం ఈ ప్రభుత్వానికెక్కడిది? వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాల్లోనూ అవినీతే. ఎస్సీ, ఎస్టీ, బీసీల నిధులు దారిమళ్లించారు. ఎస్సీ యువకుడిని హత్యచేసిన ఎమ్మెల్సీతో కలిసి తిరుగుతున్నారు.

ఎస్సీలకు జగన్ చేసిన న్యాయం ఇదేనా? బీజేపీ అభ్యర్థులనే కాదు.. కూటమి గెలుపునకు పనిచేయాలి. మూడు పార్టీల జెండాలు వేరైనా.. అజెండా మాత్రం ఒక్కటే. కూటమి ప్రభుత్వంలోకి వస్తేనే ఏపీలో రామరాజ్యం సాధ్యం.

Leave a Reply