– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్
తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, యువగళం పాదయాత్ర సమన్వయకర్త కిలారు రాజేష్ పై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నా .. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి చంద్రబాబు , లోకేష్ , కిలారు రాజేష్ , అచ్చన్నాయుడు , అయ్యన్నపాత్రుడు , యనమల రామకృష్ణుడు , దేవినేని ఉమా , కొల్లు రవీంద్ర , చింతమనేని ప్రభాకర్ , ప్రభాకర్ రెడ్డి , అమరనాథ్ రెడ్డి , నల్లారి కిషోర్ కుమార్ కుమార్ రెడ్డి , బీసీ జనార్ధన్ రెడ్డి అందరి ముఖ్య నాయకుల పై తప్పుడు కేసులు మోపుతున్నారు.. తెలుగుదేశంలో కీలకంగా ఉన్న నేతలని నేరుగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక తాడేపల్లి ప్యాలెస్ చేసే కుట్రల ఫలితమే ఈ వరుస కేసులు..
4.5 ఏళ్లుగా కిలారు రాజేష్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి రాజేష్ అజ్ఞాతంలో ఉన్నారని బ్లూ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేశారు .. కానీ నేటికీ రాజేష్ పాత్రపై ఒక్క ఆధారం కూడా చూపించలేక పోయారు.. నేడు ఇంకొక మెట్టు ముందుకు వెళ్లి రాజేష్ & ఆయన కుటుంబసభ్యుల ప్రయాణాలకు హాని తలపెట్టే పిరికి పంద చర్యలకు తెగబడుతున్నారు..
హైదరాబాద్ లో రాజేష్ ని దుండగులు వెంబడించడం వెనుక ఉన్న కుట్ర కోణం బయటపడాలి.. దుండగులు చెప్పిన వాళ్ళ నాయకుడు ఎవరు .. రాజేష్ ని బెదిరించాలని ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు ?
ఇలాంటి పిరికి పంద చర్యలకి తెలుగుదేశం పార్టీ భయపడుతుందని అనుకోవడం హాస్యాస్పదం .. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా , కుటుంబసభ్యులని ఇబ్బందులు పెట్టినా కిలారు రాజేష్ ఈ నియంత ప్రభుత్వంపై పోరాడుతూనే ఉన్నారు .. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాడుతూనే ఉంటారు కూడా ..
పసుపు జెండా & పసుపు సైన్యం ఇందిరమ్మకే తోనేకాలేదు మీ తప్పుడు కేసులేంత .. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి పిరికి చర్యలకు కక్ష సాధింపుకి స్వస్తి పలకకపోతే ఎన్నికలకి 5 నెలలు కూడా సమయం లేదని గుర్తుచేస్తూ .. వీటికి తగ్గ ప్రతి చర్యలకి రానున్న రోజుల్లో సిద్ధంగా ఉండాలని వైసీపీ నాయకులని హెచ్చరిస్తున్నాను.