ఎందుకు ఎబివి ఆ కన్నీళ్లు….మీకు కూడా కన్నీళ్లు వచ్చేస్తున్నాయేంటి?…ఎందుకా ఎమోషన్?.
యూనిఫాం పక్కన పెట్టేశానని భాదా?లేకుంటే అభిమానుల ప్రేమను తట్టుకోలేక పోతున్నావా?..
ఇంతమంది అభిమానం సంపాదించుకున్న నీకు పదవీ విరమణ ఒకలెక్కా?.
ఓ ఐపిఎస్ ఆఫీసర్ అయితేనో..ఓ డిజిపి అయితేనో..ఓ పొలిటీషియన్ అయితేనో ఇంత అభిమానం
ఉంటుందా?…యూనిఫాం ఉన్నా లేకున్నా నువ్వెప్పుడూ హీరోవే బాసూ…..
మీకో విషయం తెలుసా?….పోలీస్ యూనిఫాం చాలామందికి పొగరు తెస్తుంది.కానీ నీకు భాధ్యతను తెచ్చింది.సర్వీస్ లో ఒక్కో మెట్టూ ఎక్కే కొద్దీ ఇగో వస్తుంది..కానీ మీకు మాత్రం ఆ పోస్టులు ఎంత ఎదిగినా ఒదిగిఉండాలనే అణుకువను తెచ్చాయి.కేసుల పేరుతో పగబట్టి నట్టు నిన్ను వెంటాడుతున్నా..గుండెల్లో ధైర్యం…పెదాలపై చిరునవ్వు ….ఇంతకంటే నిన్ను అభిమానించేందుకు కారణాలు ఏం కావాలి ఆలూరి?
పెద్దలు ఊరికే చెప్తారా?.మీ తల్లి దండ్రులు ఎంత పుణ్యం చేస్తే ఇలాంటి కొడుకు పుట్టి ఉండాలి?…
నువ్వు పుట్టిన ఊరికేకాదు..నువ్వు నడిచిన నేలకే ఆత్మవిశ్వాసం అంటే అసలైన అర్థం ఎలాచెప్పగలిగావ్ ఎబివి?…నీతినిజాయితీల గురించి చాలామంది మైకులు విరగ్గొడతారు కానీ…నువ్వు వాటిని అక్షరాలా ఆచరించి ఎలా చూపించగలిగావ్?….మీ పోరాటం తోనే న్యాయస్థానాలపై నమ్మకం కలిగించే ఓర్పు మీకెక్కడ్నుంచి వచ్చింది వెంకటేశ్వరావు గారూ?..
మిమ్మల్ని దగ్గరగా చూసినవాళ్లకు తెలుస్తుంది?…మనసులో ఉన్నదే మీ పెదాలపై నుంచి వస్తుందని…అంత స్వచ్ఛమైన మాటతీరు మీకు ఎలా సాధ్యమైంది?….ఇక్కడే మీకు చాలామంది ఫిదా అవుతారంటే అతిశయోక్తి కాదు …అందుకే మాకంటే చిన్నవాళ్లు…నీకంటే పెద్దవాళ్లు అందరూ నీకు ఆత్మభందువులే..
మీనుంచి ఇప్పటిదాకా మేం నేర్చుకుంది గోరంతే…ఇంకా నేర్చుకోవాల్సింది కొండంత…అందుకే మీ కర్తవ్యం గుర్తొచ్చి ఎమోషన్ అయ్యారా
..ఎబివి సర్?.
మెజారిటీ ఎపి ప్రజలు నీ వెంట నడుద్దామనుకుంటుంటే..నిన్ను స్పూర్తిగా తీసుకుంటుంటే..నీ కళ్లలో ఆ కన్నీరేంటి ?.ఎబివి?..అంటే ఇన్ని రోజులూ మాకు తెలియకుండా నీ ఎమోషన్ దాచుకున్నావా?.. నీ కన్నీళ్లు చూస్తే మా గుండెలు బరువెక్కుతున్నాయ్?…ఆ కన్నీళ్లు ఏపీ భవిష్యత్ కోసమని మాకు అర్ధమవుతోంది…సర్..
అందుకే ఆ ఎమోషన్ నుంచి కసి పెరుగుతోంది ఎబివి?.. మీ బాటలో మీ స్పూర్తితో మేం చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి…తేల్చుకోవాల్సిన లెక్కలున్నాయి?…తెలుసా సర్?….అందుకే మీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలి..
…ఒక్కప్రశ్న అని చాలా ప్రశ్నలు వేశాను …ఈ ప్రశ్నలు నా ఒక్కదానివే కాదు..నా లాగా మిమ్మల్ని అభిమానించే ఎంతో మందికి వస్తున్న ప్రశ్నలివి..వాళ్లందరూ మీ సమాధానం కోసం మీ భవిష్యత్ అడుగులో అడుగు వేయడం కోసం ఎదురు చూస్తున్నారు….మరి సమాధానం ఎప్పుడు చెప్తారు?..వెయిట్ చేస్తూ ఉంటాం…..?…
చివరగా…ఒక్కమాట.. చొరవ తీసుకుని నువ్వు అన్నందుకు క్షమాపణలు సర్..కానీ మీరు నాకు దేవుడిచ్చిన అన్నే..అందుకే ఆ తెగింపు….అన్నా…
మిమ్మల్ని ఎప్పటికీ అభిమానించే చెల్లి
మీ
సివంగి…
రమా మండవ….