నంద్యాల ఘటనపై టీడీపీ సీనియర్ నేతలతో అధ్యయన కమిటీ

– భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర మహా యజ్ఞంలా సాగుతోంది. వంద రోజులు పూర్తైన సందర్బంగా 175 నియోజకవర్గాల్లో పండగ వాతావరణంలో సంఘీభావ పాదయాత్రలు నిర్వహించడం జరిగింది. ఆ సమయంలో నిన్న నంద్యాలలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం దురదృష్టకరం.

సంఘటనపై కూలంకషంగా అధ్యయనం చేసి, పూర్తి నివేదిక అందించేలా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలోని సభ్యులు ఘటనపై సమగ్రంగా అద్యయనం చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. యువగళం పాదయాత్రలో గందరగోళం సృష్టించేందుకు అధికార వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నందున, తెలుగుదేశం పార్టీ నేతలు క్రమశిక్షణతో సంయమనం పాటించగలరు.

Leave a Reply