Suryaa.co.in

Andhra Pradesh

చేసిన అప్పులు, ఖర్చుపై శ్వేత పత్రం విడుదల చేయాలి

– నీకు దమ్ముంటే సీబీఐ విచారణకు ఒప్పుకో
– పవన్ క్రిస్టియన్ అని చెప్పి మళ్ళీ సనాతన ధర్మం అని మాట్లాడుతున్నాడు
– వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి

వైయస్సార్ జిల్లా: రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోంది. ఇది ప్రజల ప్రభుత్వం కాదు. ఈవీఎం లా ప్రభుత్వం. అందుకే కింది నుంచి చంద్రబాబు వరకూ దోపిడీకి దిగారు. మేనిఫెస్టో లో సూపర్ 6 అని ప్రజల్ని మభ్యపెట్టి చేతులెత్తేశారు. ఈ వందరోజుల్లో 30వేల కోట్లు అప్పు చేసి ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియదు. చేసిన అప్పులు, ఖర్చుపై శ్వేత పత్రం విడుదల చేయాలి. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.

ప్రజలు తప్పు చేశాం అని బాధ పడుతున్నారు..పాలిచ్చే ఆవును వదిలి తన్నే గేదెను తెచ్చుకున్నామని బాధపడుతున్నారు.ఓ పక్క దోపిడీ, మరో పక్క వైఎస్సార్సీపీ వారిపై దాడులు. వరదలు నుంచి డైవర్ట్ చేయడానికి ప్రకాశం బ్యారేజ్ బోటు అంటూ ఆరోపించారు. తీరా చూస్తే అది టిడిపి వారి బోటు.

ఆ తర్వాత కాదంబరి అనే మహిళ వ్యవహారం తెచ్చారు. వీళ్ళు ఎన్ని చేసినా ప్రజలు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోరు. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ ప్రసిద్దతను దెబ్బతెస్తున్నారు. ఇలాంటి నీచమైన పాలిటిక్స్ చేసే వారు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. నెయ్యి వచ్చింది, టెస్ట్ చేసింది అంతా చంద్రబాబు హయాంలోనే జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చాకే టెండర్లు పిలిచారు..సరఫరా కూడా జరిగింది ఆ తర్వాతే. మార్చి 16 నుంచి మా ప్రమేయం లేదు.

తిరుమల, తిరుపతిలో రెండు ల్యాబ్స్ ఉన్నాయి..అక్కడ అన్నీ పరీక్షలు జరుగుతాయి. వాస్తవానికి ఉన్నత పరీక్షల కోసం మైసూర్ CFTRI కి పంపుతారు. కానీ దీన్ని గుజరాత్ NDDBకి పంపారు. ముందు రోజు ఈ సంస్థ ప్రతినిధులు టీటీడీ ఈవో శ్యామలరావు కలిశారు. NDDB ప్రస్తుత చైర్మన్ మనీషా, మాజీ చైర్మన్ వర్షా ఇద్దరూ శ్యామలరావును కలిశారు. ఆ తర్వాతే ఈ రిపోర్ట్ వచ్చింది. గూడు పుటానీ చేసి జగన్ పై ఆరోపణలు చేస్తున్నారు.

ఈవో, ముఖ్యమంత్రి వేర్వేరు స్టేట్మెంట్లు ఇచ్చారు. రెండు నెలల తర్వాత ఈ నివేదిక విడుదల చేయడంలో ఆంతర్యమేమిటి..? ఒక కీలకమైన టీటీడీ రిపోర్ట్ టిడిపి ఆఫీసు లో విడుదల చేయడం ఏమిటి .? ఇవన్నీ చూస్తుంటే పెద్ద కుట్ర జరిగింది అని స్పష్టమవుతుంది. హిందువులను జగన్ కు దూరం చేయాలని ఈ కుట్ర పన్నారు. లడ్డూ నే కాదు.. ఏ ఆహార పదార్థాల్లో జంతువుల కొవ్వు కలిపితే రెండు రోజుల్లోనే దుర్వాసన వస్తుందని నిపుణులు చెప్తున్నారు.

కేవలం వైఎస్ఆర్సీపీని దెబ్బతీయాలని ఎన్డీఏ భాగస్వాములు అంతా కలిసి చేసిన కుట్ర. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. జగన్ దేవుని దర్శనానికి వెళ్తుంటే అడ్డుకుని, మేమెప్పుడు అడ్డుకున్నాం అంటూ బుకాయిస్తున్నాడు. వైఎస్సార్సీపీ వారికి నోటీసులు ఇచ్చి, పోలీసులను పెట్టీ అడ్డుకున్నారు.

30 యాక్ట్ పెట్టీ వైఎస్సార్సీపీ వారినే ఆదుకుంటారా. ? ఇతర పార్టీల వారు తిరుమల చేరుకున్నా యాక్ట్ అమలు కాదా .? నీకు దమ్ముంటే సీబీఐ విచారణకు ఒప్పుకో. జగన్ ప్రధానికి లేఖ రాశారు..సిట్టింగ్ జడ్జితో విచారణ డిమాండ్ చేశారు. ప్రజలు అంతా గమనిస్తున్నారు…నీకు బుద్ధి చెప్తారు. నిన్న వైఎస్సార్సీపీ పిలుపు మేరకు ప్రజలు నిన్న దేవాలయాల్లో చంద్రబాబుకు మంచి బుద్ధి రావాలని పూజలు చేశారు.

పవన్ కళ్యాణ్ …తన ఓనర్ స్క్రిప్ట్ ఇస్తే అప్పుడు బయటకు వచ్చి డ్రామాలు వేస్తాడు. ప్రశ్నిస్తాను అన్నాడు…పిల్లల మిస్సింగ్ అన్నావు. డిప్యూటీ సీఎంగా నువ్వు ఎంతమందిని కాపాడావు .? వరదల్లో కనీసం బయటకు వచ్చావా .? ఓనర్ స్క్రిప్ట్ ఇవ్వగానే బయటకు వచ్చి హంగామా చేశాడు. తాను క్రిస్టియన్ అని చెప్పి మళ్ళీ సనాతన ధర్మం అని మాట్లాడుతున్నాడు. మీ అందరికీ బుద్ధి చెప్పే రోజు వస్తుంది.

LEAVE A RESPONSE