Suryaa.co.in

Andhra Pradesh

జాతి పునర్నిర్మాణం కోసం ఏబీవీపీ

-పూర్వ ABVP జాతీయ నేత నాగోతు రమేశ్ నాయుడు

స్వాతంత్య్రానంతరం చాలా విద్యార్థి సంఘాలు ప్రారంభమైనవి, అయితే వాటి లక్ష్యాలు తమ రాజకీయ పార్టీలకు కేవలం కొత్త రక్తం అందించడం, పార్టి, విధానాలు, మరియు నాయకత్వ పలుకుబడి క్రిందివరకు తీసుకపోవడం లక్ష్యంగా, పనిచేసే ఓక విభాగం మాత్రమే !
*కానీ ABVP ప్రారంభం ఒక చారిత్రక అవసరం అయిన వ్యక్తి నిర్మాణం జాతీయ పునర్నిర్మాణం జరుగుతుందని, హక్కుల కోసం – పోరాడుతున్న వారికి భాద్యతలు కూడా గుర్తెరగాలని – రాజకీయాలకు అతీతంగ, ఏ రాజకీయ పార్టీకి అనుభందంగా కాకుండా స్వతంత్రంగా సంఘ పరివార్ సంస్థగా ప్రారంభమై , ఇంతింతై-వటుడింతై అన్నట్లు ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘంగా రూపాంతరం చెందింది – కావున నేడు జాతీయ విద్యార్థి దినోత్సవంగా” జరుపుకోవడమే కాదు – -ప్రపంచంలోని అనేక దేశాలలో WOSY పేరు మీద 44 దేశాల్లో కార్యక్రమాలు నిర్వహించు కోంటున్నాము .

ఈ దేశంలో విద్యార్థి పరిషత్ ప్రయాణం అన్ని విభాగాల్లో ను , విరాట పర్వం దాల్చి ముందు కెళ్తున్నది !
కళాశాల నాలుగు గోడల మధ్య చదువుతున్న విద్యార్థులలో వున్న నాయకత్వ లక్షణాలు గుర్తించి వారిని వివిధ రంగాలలో భవిష్యత్ జాతి అవసరాలకు తగ్గట్టు తీర్చి దిద్దుతున్న సంస్థ విద్యార్థి పరిషత్-కావుననే విద్యార్థి సంఘ సన్నికలలో సైతం – ఏరాష్ట్రం అయిన – ఏ సిద్ధాంత భావజాలా పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రం అయినా సరే ABVP ప్రస్ఫుటమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నది – కళాశాల క్యాంపస్ లలోABVP ఒక వైపు జ్ఞానం -శీలం- ఏకత ద్యేయంగా విద్యార్థులను జాతీయ వాద, సాంస్కృతిక సిద్ధాంతాలను వైపుకు ప్రోత్సాహించుచున్నది – దీనిని ఎదుర్కోలేక ABVP ని నిలువరించడమే ధ్యేయంగా – కాంగ్రెస్ కు వ్యతిరేకంగ పుట్టిన కమ్యూనిష్టు విద్యార్థి సంఘాలు, విదేశి భావజాల సంఘాలు , అన్ని కూడబలుక్కోని సిద్ధాంత, రాద్దాంతాలు మరిచి ఓకటై – abvp ని నిలువరించాలని అపసోపాలు పడుతున్న దయనీయ స్థితి?

ఈ రోజు దేశంలోABVP ప్రయాణం ప్రారంభం నుండి దేశ హితము తోలి ప్రాదాన్యత, కాబట్టి చైనా యుద్ద సమయం నుండి – కార్గిల్ యుద్ధం వరకు సైనిక, దేశరక్షణ కోరకు విద్యార్థులను సమీకరించి ఆయా అవసరాలు ( రక్తం ఇవ్వడం, డిల్లి Repubic Parade నంగా నెహ్రు కోరిక మేరకు పాల్గొనడం) తీర్చడానికి ముందు వుంది – అంతే కాకుండా దేశం emergency లాంటి క్లిష్ట పరిస్థితులలో జే. పి. నాయకత్వంలో పోరాడి అనేకమంది జైలుకు వేళ్ళడమే కాకుండా ABVP పోషించిన పాత్ర అమేఘం -దివిసీమ ఉప్పెన నుండి కరోనా వరకు నిరంతర ప్రకృతి ప్రకోపాల సమయంలో ప్రాణాలను పణంగా పేట్టి చేసిన సేవా కార్యక్రమాలు పరిషత్ కార్యకర్త పాత్ర ఆదర్శనీయం – అంతే కాదు ఈశాన రాష్ట్రాలలోని యువత ఒకప్పుడ భారత్ ను శత్రువుగా,తామువేరు, ఢిల్లి వేరు అనే భావన ను తుడిచి పెట్టి దేశ అంతర్భాగం లో అందరం అనే భావనలు పెంపొందించేలా SEiL అనే విభాగం ద్వారా అన్ని రాష్ట్రాల విద్యార్థులను సమీకరించి దేశ లోని అన్నిప్రాంతాలను చుట్టి వచ్చేల, అన్ని సంస్క్రుతుల మిళితమే మన భారతం అని తరించేలా, ఈశాన్యభారతం నుండి జమ్ము కాశ్మిర్ వరకు, ప్రతి ప్రాంతం నుండి విద్యార్థులను ఏంపిక చేసి ప్రతిమెడాది 30 రోజుల పాటు పర్యటనలను అనేక సంవత్సరాల నుండి యోజన చేయడం వల్ల నేడు ఏర్పాటు వాదం తగ్గుముఖం పట్టిందనడంలో సందేహం లేదు – అలాంట పర్యటన లోని ఒకనాటి సభ్యుడే మన గౌతమ్ సవాంగ్ మాజి DGP అని చెప్పడానికి గర్వకారణం !

అంతేకాకుండా ఏర్పాటు వాదం దేశానికి ప్రమాదకరంగాను ఓక రకంగా ఛాలెంజ్ చేస్తే దానిని కూకటి వేళ్ళతో పేకళించి జాతీయ వాదాన్ని పేంచడానికి అనేక మంది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలనుండి -మురళీధర్ రావు. సూరిజీ, పెరాల చంద్ర శేఖర్, శ్రీకాంత్, బాల క్రిష్ణ , కడకంచి రమేశ్ లాంటి వారెందరో త్యాగాలు చేసి అక్కడ నాటిన జాతీయ వాద విత్తనాలు నాటిన ఫలితమే నేటి శాంతికి కుసుమాలు ఈశాన్య భారతం నుండి కాశ్మీర్ వరకు పరిమళించడానికి ఓక క్రతువు ,కాశ్మీరీ 370 ఆధికరణ రద్దు, జాతీయ జెండా ఆవిష్కరణ కొరకు ABvp చెపట్టిన ఛలో ఉద్యమాలు ,సామాజిక సమరసత, నుండి భూతాపం తగ్గించడానికి కోటి మెక్కలు నాటడం, ఉచిత శిక్షణా తరగతులు , నీటి సంరక్షణ అవగాహన పేంపు కోరకు జలసంరక్షణ కార్యక్రమాల్లాంటి సామాజిక కార్యక్రమాలతో పాటు కాలానుగుణంగా వస్తున్న ప్రపంచీకరణలో విద్యార్థులు సృజనాత్మకత వేలికి తీయడం కోరకు సృష్టి ,వైద్య విద్యార్థులు కోసం మెడివిజన్ , ఇంజనీరింగ్ వారికోసం సృుజన, ధింక్ ఇండియా, గిరిజన ప్రాంతాల్లో ” వనవాశి ” విదేశీ విద్యార్థులు కోరకు 44 దేశాల్లో WOSY పేరు మీద ఇలాంటి కార్యక్రమాలు యోజన చేసి వారి వికాసమునకు, జాతి పురోభివృద్ధి కోరకు స్రుజనాత్మక ఆలోచనల మేలవింపు చేయడం, ఒక వైపు అయితే సాంస్కృతిక జాతీయ వాద స్పురణలో భాగంగా మహా పురుషుల జీవిత చరిత్ర భవిష్యత్ తరాలకు స్ఫూర్తి నింపాలనే ఉద్దేశ్యంతో జయంతి ఉత్సవాలు నిర్వహించడం ABVP ప్రత్యేకత !!

ఇలాంటి ఎన్నో విన్నూత కార్యక్రమాలు,వివిధ వర్గాల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ” సర్వవ్యాపి ” సర్వ స్పర్శి లక్షంగా! పని చేస్తున్న సంస్థ విద్యార్థి పరిషత్ – మరొక వైపు ABVP సంఘర్ష నాత్మక” ఉద్యమాల్లో విద్యార్థి పరిషత కార్యకర్తలు తమ ప్రాణాలు సైతం తర్పణ చేసిన సంఘటనలు కేరళ, ఆంధ్ర, తెలంగాణ లో నేటికి సజీవసాక్ష్యాలు. * తుపాకి గోట్టం ద్వారా రాజ్యాధికారం అన్న నక్షలైట్ గూండాలు విశ్వవిద్యాలయాలు ను కేంద్రం గా చేసుకోని సాగించిన దాష్టీకాలులో భాగంగా వరంగల్ కాకతీయ యూనివర్శిటీ నందు స్వతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండాను అవమానించిన నక్సల్స్ ను ఎదిరించి ప్రాణాలోడ్డిన – సామ జగనన్న, ఉస్మానియా నందు మెరెడ్డి చంద్రా రెడ్డి , కావళి నందు మాస్టర్‌ కుమార స్వామి త్యాగం మరువు లేనిది!

విద్యార్థుల స్కాలర్ షిప్, అధ్యాపక నియామకాలు, విశ్వవిద్యాలయాలను అధికార పార్టీలు రాజకీయ ఆవాసాలుగ మార్చుకొని అవినీతి, కులతత్వం, ఆశ్రిత పక్షపాతాలకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమాల్లో ABVP ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ నాయకత్వంలో వీరగోపాల్ శాసనసభ లోనికి పోవడం, అలాగే YS రాజశేఖర్ రేడ్డి హయాంలో విద్యారంగ పరి రక్షణ ఉద్యమం సందర్బంగా వ్యాసకర్త అయిన నేను స్వయంగా నా నాయకత్వంలో పోలీసు వలయాన్ని చేదించుకోని సెక్రటరియెట్ లోని సమతా బ్లాక్ వరకు చోచ్చుకు పోయి సంచలనాలకు మారు పేరైన ఉద్యమాలు దేశాన్ని ఆకర్షించాయి!

ఇంతటి ఘన వారసత్వం కలిగిన కార్యకర్తలను, విద్యార్థి దశ దాటి వివిధ రంగాలలోకి వెళ్ళిన తరువాత వారు జాతీయ స్థాయిలో సేవా, పత్రి కారంగంలో భద్రినాద్, రాజకీయాల్లో ప్రమోద్ మహాజన్, సుస్మస్వరాజ్, నితిన్ గడ్కరీ, నుండి నెట్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరకు వివిధ రంగాలలో పోసిస్తున్న పాత్ర , శాస్త్ర సాంకేతిక రంగాలలో సతీస్ రెడ్డి , సంఘపరివార్ వివిధ హోదాల్లో మాననీయ శేషాద్రి గారి నుండి, ప్రస్తుత సర్ కార్య వాహ్ వరకు” మీడియా విభాగంలో యూరియా కుంభకోణం బయటికి తీసిన బద్రినాథ్ వరకు – ABVP నేర్చిన సంస్కారం, దేశభక్తి నేను దేశం కోసం ఏదో ఓకటి చేయాలన్న కార్యకర్త అంతర్ సౌందర్యానికి చిహ్నం!

ABVP ఏ కాలమాన పరిస్థితులనైనా తట్టుకొని నేటికి అన్ని వర్గాల విద్యార్థుల కలయికతో నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం గా వర్ధిల్లుతున్న సందర్భంగా? అదేసమయంలో ప్రపంచీకరణ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా క్యాంపస్ లలో తన జాతీయ వాద , సాంస్కృతిక వికాసం వైపు విద్యార్థులను ఆకర్షిస్సుత ముందుకు పోతున్నది, హక్కులతో పాటు, బాధ్యతలను గుర్తించేలా!

సమస్యల పరిష్కారం కొరకు యాజమాన్యలను, ప్రభుత్వాలను ప్రశ్నించడం కాదు, స్వయంగా పరిష్కార మార్గాలను అన్వేషించి ముందుకు పోవాలని సంస్థ నైజం, ఆకోణంలో విజయాలు సాధిస్తూ ప్రతి సంవత్సరం జులై 9 వ తేదీన “జాతీయ వాద విద్యార్థి దినోత్సవం” జరుపుకుంటున్న తరుణంలో
మిగతా విద్యార్థి సంఘాలు సైతం దేశ ABVP ని చూసి కాకపోయినా , కమ్యూనిస్టు సంఘాలకు స్వయంగా నంబూద్రి ప్రసాద్ గారు ఇచ్చిన సందేశంలో భాగంగా వామపక్ష విద్యార్థి సంఘాలు సైతం అనుబంధ సంఘాలుగా కాకుండా జాతీయ పునర్ నిర్మాణంలో భాగస్వామ్యం కోరకు ప్రయత్నం చేయాలి, అన్న సూచన స్వీకరించి , భిన్న మార్గంలో పయనించైనా మాకు ధీటుగా జాతి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయాలనిABVP కోరుతోంది!

సరస్వతి నిలయాలు కుల సంఘాలకు C/O గా ? మారుతున్న పరిస్థితి నుండి సమ సమాజ నిర్మాణ కేంద్రాలుగా మార్చడానికి నడుంకట్టాలి !ప్రత్యర్థులు నుండి ABVP ideology fighting కోరుకుంటూ నేడు పేద్దయేత్తున నిర్మాణాతమక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యుంటారని ఆశిస్తూ విద్యార్థులకు, కార్యకర్తలకు “జాతీయ విద్యార్థి దినోత్సవం “శుభాకాంక్షలు

LEAVE A RESPONSE