పార్టీని కాపాడుకోవాలంటే అభినవ వీరేశలింగంపై చర్యలు తీసుకోవాలి

-చర్యలు తీసుకోకపోతే ఒక్క మహిళ కూడా మనకు ఓటేసే పరిస్థితి లేదు
-నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

“పార్టీని కాపాడుకోవాలని ఉద్దేశం మీకు ఉంటే.. అభినవ వీరేశలింగం గా బిరుదాంకితుడైన గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకుండా, వాహిని వారి పెద్ద మనుషుల లాగా…వాళ్లతో, వీళ్ళతో మాట్లాడిస్తే కుదరదు. పార్టీని కాపాడుకోవాలన్న, మహిళల ఓట్లు మనకు రావాలన్నా, మాధవ్ పై చర్యలు తీసుకోవడం తప్పనిసరి. లేకపోతే కనీసం ఒక్క మహిళ కూడా మనకు ఓటేసే పరిస్థితి లేదని”నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. ఇప్పటికే సిస్టర్ అవుట్, మదర్ ను చెల్లి వద్దకు పంపారు, ఇది కూడా జరిగితే పార్టీ అవుట్ అని ఆయన అన్నారు. పార్టీని కాపాడుకునేందుకు తన వంతు ప్రయత్నాన్ని తాను చేస్తున్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

శనివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మాధవ్ పై చర్యలు తీసుకొని, పార్టీ ఇమేజ్ ను కాపాడుకుందామని అన్నారు. అలాకాకుండా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళని, అయినా పరుగు పందెంలో ఫస్ట్ వచ్చిందన్న మీ వైఖరిని మార్చుకోకపోతే ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడాలన్నారు. యత్ర నార్యేషు పూజ్యంతే శ్లోకం చదివిన గోరంట్ల మాధవ్ ను చూసి, అభినవ వీరేశలింగం మళ్లీ ఉద్భవించారని ప్రజలు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మాధవ్ నగ్న వీడియో వ్యవహారంపై అనంతపురం జిల్లా ఎస్పీ పకీరప్ప ఏదో కవరింగ్ చేయడానికి ప్రయత్నించారని, మాజీ మంత్రులు రకరకాలుగా మాట్లాడారని, ప్రస్తుత మంత్రులు సిల్లీగా మాట్లాడారని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. అయితే టిడిపి నాయకుడు పట్టాభి విడుదల చేసిన మీడియా ప్రకటనను చూసి, ఎక్లిప్స్ సంస్థ గురించి తాను ఆరా తీశానని చెప్పారు. ప్రతిష్టాత్మకమైన సంస్థ గా ఎక్లిప్స్ గుర్తింపు పొందిందని చెప్పారు. ఎక్లిప్స్ ఫోరెనిక్స్ సంస్థ మాధవ్ నగ్న వీడియోను పరిశీలించి, పరీక్షించి అందులో ఎటువంటి మార్ఫింగ్ జరగలేదని నిర్ధారించిందని చెప్పారు. ఒక మహిళకు వీడియోలో ఉన్న వ్యక్తి పురుషాంగాన్ని చూపిస్తుండగా, మొబైల్ ఫోన్ కుడి వైపున సదరు మహిళ ముఖచిత్రం ఉన్నట్లుగా ఎక్లిప్స్ ఫోరెన్సిక్ సంస్థ యజమాని జిమ్ స్టాఫర్డ్ తన నివేదికలో తెలియజేశారని తెలిపారు. వీడియోలో ఉన్న వ్యక్తి ముఖం, పురుషాంగము ఒక్కరిదేనని ఆయన తేల్చి చెప్పారని వివరించారు.. ఈ వీడియోలో ఎటువంటి మార్ఫింగ్ జరగలేదని తేట తెల్లం చేశారని పేర్కొన్నారు.

మాధవ్ నగ్న వీడియో ను విధి వంచితులమై అందరం చూసి కంగు తిన్నామన్న ఆయన, తన పేరు చెప్పుకోలేని ఓ స్త్రీ మోడ్రన్ ఎక్విప్మెంట్ తో రికార్డు చేసి, మరొక ఫోన్ తో షూట్ చేసిన వీడియో జన బాహుల్యంలోకి వచ్చిందన్నారు. ఒరిజినల్ వీడియో అందుబాటులోకి వస్తే చిటికలో చెప్పేస్తానని పకీరప్ప చెప్పడం గమనిస్తే, ఒరిజినల్ వీడియో ఉన్న ఫోను వెలుగులోకి రాదని ఆయనకు ఎవరో భరోసా ఇచ్చినట్లుగా కనిపిస్తుందన్నారు. ఎక్లిప్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకమైనదే కాకుండా, దాని యజమాని జిమ్ స్టాఫర్డ్ ఇప్పటికే ఈ తరహా కేసులు ఈ ఏడాదిలోనే 40 పరిశోధించారని తెలిపారు. ఎక్లిప్స్ సంస్థ గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత మంత్రులు, మాజీ మంత్రులు, తమ వీడియోలు ఎక్కడ బయటకు వస్తాయోనని ఆందోళన చెందుతున్న పార్టీ ముఖ్య పదవులలో ఉన్న నాయకులు ఆరా తీయవచ్చునని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. తాను ఎక్లిప్స్ సంస్థ యొక్క పనితనాన్ని పరిశీలించిన తర్వాతే నమ్మకంతో చెబుతున్నానని, ఇది అంగంగాలను ప్రదర్శించిన మాధవ్ పై కోపంతో కాదన్నారు. తమ పార్టీ మహిళా పక్షపాతిగా, జగన్మోహన్ రెడ్డి తనకు తానే రాష్ట్రంలోని మహిళలకు అన్నయ్యగా చెప్పుకుంటారని… నగ్న వీడియో మాధవే నని నిర్ధారణ అయ్యాక కూడా 500, వెయ్యి వాహనాలతో రాయలసీమలో ఊరేగిస్తే, రానున్న ఎన్నికలను వస్తాయనుకుంటున్న 30, 35 స్థానాలు కూడా రావన్నారు.

ఇప్పటికే బోగస్ సర్వే రిపోర్ట్ ను సోషల్ మీడియాలో పెట్టారన్న ఆయన, సర్వాంగ, అంగాంగ ప్రదర్శన చేసింది మాధవే నని నిరూపణ అయిన తర్వాత కూడా ఈ ఊరేగింపుల ద్వారా సభ్య సమాజానికి, ముఖ్యంగా మహిళా సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నట్లని ప్రశ్నించారు. గొడ్లు కాసుకునేవారు, అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు కూడా నగ్న వీడియో చూసిన తర్వాత, అది ఒరిజినల్ అనే చెబుతారని అన్నారు. ఇంకా కాదనడానికి ఏముందన్న ఆయన, ఫేసు ఒకరిది బేస్ మరొకరిదని మాజీ మంత్రులు పేర్కొంటుండగా, ఫేస్, బేసు ఒక్కరిదేనని, ఆ రెండు కూడా మాధవ్ వేనని నిర్ధారణ అయిందన్నారు. ఇప్పుడు చేయవలసిన తక్షణ కర్తవ్యం ఏమిటన్నది ఆలోచించాలని, చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తే , ఇప్పటికే మన పార్టీ కి పర్యాయపదం పెట్టి పిలుస్తున్నారని, అది మీ చెవికి చేరిందో లేదో తెలియదన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే యోడుగురి సంధింటి వారి శృంగార రసిక చిలిపి పార్టీ అంటూ నెటిజెన్లు ఎద్దేవా చేస్తున్నారని చెప్పారు. గోరంట్ల మాధవ్ నగ్న వీడియో పై సైబర్ రత్న అవార్డు గ్రహీతలైన పార్టీకి చెందిన సైబర్ నిపుణులతో తప్పుడు నివేదికలను సృష్టించే ప్రయత్నం చేయవద్దని, ఎందుకంటే ఎక్లిప్స్ సంస్థ న్యాయస్థానాల చేత ఆమోదించబడిందని గుర్తు చేశారు.. ఏపీ ప్రభుత్వ నివేదికలను ఎవరు నమ్మడం లేదని, ప్రభావతి ప్రభావం చూసిన తర్వాత, అన్ని బోగస్ రిపోర్టులు, బోగస్ అకౌంట్లు, బోగస్ పార్టీ అంటూ ప్రజలు విరుచుకపడుతున్నారని తెలిపారు. మాధవ్ నగ్న వీడియో నిర్ధారణ కోసం స్పీకర్, ప్రధానమంత్రి కార్యాలయం ఢిల్లీలోని ప్రతిష్టాత్మక పరిశోధన కేంద్రానికి పంపే అవకాశం ఉన్నదని చెప్పారు. తాను కూడా ఈ అంశాన్ని ప్రధానమంత్రి కార్యాలయంతో కలిసి పార్టీ మీద ఉన్న ప్రేమతో పర్యవేక్షిస్తానని తెలిపారు.

జిమ్ స్టఫార్డ్ కమ్మవాడనే కథలు చెప్పకండి
ఎక్లిప్స్ సంస్థ యజమాని జిమ్ స్టఫార్డ్ ఆంధ్రుడు అని, అందులో కమ్మవాడనే కథలు చెప్పే ప్రయత్నాలను చేయవద్దని రఘురామకృష్ణంరాజు సూచించారు.. మంత్రులు రోజా, వనితలతో ఎన్నో మాట్లాడించారని, మనం కహానీలు చెప్పే సమయం ముగిసిపోయిందన్నారు. ఇప్పటికైనా మాధవ్ పై చర్యలు తీసుకోవాలని, పార్టీ నుంచి సస్పెన్షన్ చేయాలన్నారు. దేశంలోని ప్రతిష్టాత్మకమైన ల్యాబ్ కు పరిశీలన నిమిత్తం పంపాలని, అప్పటివరకు సస్పెన్షన్ లో ఉంచి, నివేదిక అందిన తర్వాత ఆ వీడియో నిజమేనని తేలితే ఏమి చేయాలో అప్పుడు నిర్ణయించుకోవాలన్నారు. ఒకవేళ నిజంగానే మాధవ్ కు నిద్రలో షేకింగ్ హ్యాబిట్ ఉందేమో మనకు తెలియదు కదా అని అపహాస్యం చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ చేత తూతూ మంత్రంగా మాట్లాడించి, ఒరిజినల్ వీడియోను ఫేక్ వీడియో అని చెప్పించే ప్రయత్నం చేశారన్నారు.

తనకున్న మంచి పేరును పోగొట్టుకోవడం ఇష్టం లేక, తాను ఒరిజినల్ వీడియో లభించే వరకు టెస్టుకు పంపించలేనని ఆయన చెప్పారన్నారు. ఇక ఏకచిత్ర నటుడు, మంత్రి తానేటి వనిత మాత్రం వీడియోను టెస్ట్ నిమిత్తం ల్యాబ్ కు పంపామని చెప్పారని, అసలు వీడియోను టెస్ట్ నిమిత్తం ల్యాబ్ కు పంపడం ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు. ఈ వీడియో గురించి మాట్లాడిన వారిని తిట్టించేందుకు కొంతమందిని ప్రభుత్వ పెద్దలు పోగు చేశారని, వారేమో ఇష్టారీతిలో మాట్లాడారని విమర్శించారు. నగ్న వీడియో నిర్ధారణ కోసం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ల్యాబ్ కు పంపాలని, అక్కడ ప్రభావతి మాదిరిగా ప్రభావితమై నివేదికలను తయారు చేయరని, పీవీ సునీల్ కుమార్ మాదిరిగా నెత్తిమీద కూర్చొని నివేదికలను సిద్ధం చేయించే అధికారులు ఉంటారని అనుకోవడం లేదన్నారు. నగ్న వీడియో వ్యవహారంలో నిజానిజాలు ప్రజలకు తెలియాలన్న ఆయన, తప్పు చేయకపోతే మాధవ్ నిర్దోషిగా బయటపడాలన్నారు. ఒకవేళ తప్పు చేసిన పెద్ద శిక్ష లేమి ఉండవని, కర్ణాటక అసెంబ్లీలో నీలి చిత్రాలను చూసిన ఇద్దరు సభ్యులను కోడ్ ఆఫ్ కండక్ట్ కింద సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. శవాల మీద చలి మంటలు కాచుకునే రీతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని రఘురామకృష్ణంరాజు ధ్వజమెత్తారు. మాధవ్ తో కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టిచ్చింది తమ పార్టీ పెద్దలేనన్న ఆయన, ఒక కులాన్ని కులం పేరుతో దూషించడం కాకుండా, మరొక కులం చేత నిరసన ప్రదర్శనలను చేయిస్తారా అంటూ మండిపడ్డారు. గుడ్డలు విప్పడానికి కూడా కులాలు ఏమిటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఖర్చుతో సాక్షి దినపత్రికలో వ్యాపార ప్రకటనలను వేసుకోవడం దారుణం అక్రమం కాదా అని ప్రశ్నించారు. జాతీయ జెండా మధ్యలో నీలిరంగు ఏమిటి అని ప్రశ్నించిన ఆయన, మూడున్నర లక్షల ఇళ్లకు, పంచాయతీ కార్యాలయాలకు నీలిరంగు వేశారన్నారు .. మనము వేసేది బ్లూ రంగు, మనవాళ్లు రిలీజ్ చేసేది బ్లూ ఫిలింలు అంటూ ఎద్దేవా చేశారు. బ్లూ పిచ్చి వదలాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

పిటిషన్ కొట్టివేశారు అంటూ ఆ చెత్త రాతలు ఏమిటిరా యూజ్ లెస్ సాక్షి పేపరో డా?
న్యాయస్థానంలో రఘురామ కృష్ణంరాజు పిటిషన్ ను కొట్టివేశారంటూ సాక్షి చెత్త ఛానల్ లో ప్రసారం చేశారని మండిపడ్డారు. యూస్ లెస్ సాక్షి ఛానల్ తప్పుడు కథనాలను ప్రసారం చేయడమేమిటి అని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, కోర్టు ఆర్డర్ కు వక్రీకరణ భాష్యాలు చెప్పిందని మండిపడ్డారు. కోర్టు తీర్పును ఈ సందర్భంగా చదివి వినిపించారు. కోర్టు పిటిషన్ ను కొట్టి వేస్తే, ఈనెల 22వ తేదీన ఎందుకని లిస్టు చేసిందని ప్రశ్నించారు. పేపర్, చానల్ ఉన్నదని ఇష్టం వచ్చినట్లు రాస్తావురా… రాసి ఏమి పీక్కుంటావు రా సాక్షి పేప రోడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడలో సన్మానం చేయండి
అభినవ వీరేశలింగం గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకుంటారా?, లేకపోతే విజయవాడలో బ్రహ్మాండమైన సన్మానాన్ని చేస్తారా? అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు తమ పరువును కాపాడాలని కోరారు. యూ ఆర్ దట్ వీడియో పార్టీ అంటే మా పరువు పోతుందని, మీరు ఎలాగో ఇంటి నుంచి బయటికి రారని ఎద్దేవా చేశారు. మహిళల పట్ల కాసింత గౌరవంతో నైనా మాధవ్ పై చర్యలు తీసుకోవాలన్నారు. బటన్ నొక్కుతున్నానంటే కుదరదని, చర్యలు తీసుకోకపోతే ఎన్నికల్లో మహిళలే మన పార్టీకి వ్యతిరేకంగా బటన్ నొక్కుతారని అన్నారు.

Leave a Reply