ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళీ?
ప్రముఖ నటుడు ఆలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. కొద్ది రోజుల క్రితం ఆలీ ఏపీ సీఎం జగన్ తో భేటీ కావటం.అప్పట్లో ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తారంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ అదేమీ జరగలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించేందుకు ఉద్దేశించిన ఫైలు సీఎం జగన్ దగ్గరకు చేరిందని.దీనికి సంబంధించి ఆదేశాలు ఎప్పుడైనా రావొచ్చని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఆలీతోపాటు మరో సినిమా నటుడు పోసాని కృష్ణ మురళి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్ డీసీ) ఛైర్మన్ గా నియమించనున్నారు. ఆలీతోపాటు ఈయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు ఒకేసారి వస్తాయని వైసీపీ నాయకుల అభిప్రాయం.