Suryaa.co.in

Andhra Pradesh

3,200లకు పైగా రైతుల్ని బలితీసుకున్న జగన్ రెడ్డి రైతుల్ని, వ్యవసాయరంగాన్ని ఉద్ధరిస్తాడా?

• మూడున్నరేళ్లలో 3,200లకు పైగా రైతుల్ని బలితీసుకున్న జగన్ రెడ్డి రైతుల్ని, వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తాడా?
• వైసీపీ ప్రభుత్వంలో రైతు సంక్షేమం సాక్షి మీడియాలో, ముఖ్యమంత్రి ఉత్తుత్తి సమీక్షల్లో కనిపిస్తోంది తప్ప, వాస్తవంలో కాదు
• జగన్ రెడ్డి వచ్చాక రాష్ట్రంలోని ప్రతిరైతు తలపై రూ.2.54లక్షల అప్పు
– తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

మూడున్నరేళ్ల పాలనలో అన్నదాతల ఆత్మహత్యల్లో, దేశంలో రాష్ట్రాన్ని 3వస్థానంలో నిలిపి న జగన్ రెడ్డి, ఉత్తుత్తి సమీక్షలు ఊకదంపుడు ఉపన్యాసాలకే రైతుసంక్షేమాన్ని పరిమితం చేసి, వ్యవసాయరంగాన్ని గాలికివదిలి, అన్నదాతల కష్టాన్నికూడా అప్పనంగా దోచుకుం టున్నాడని టీడీపీ నేత, తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“పార్లమెంట్ సమావేశాలసాక్షిగా జగన్ రెడ్డి హయాంలో రైతులకు జరిగిన అన్యాయం బట్టబయలైంది. రైతుఆత్మహత్యల్లో ఏపీ మూడోస్థానంలో నిలవడం జగన్ రెడ్డి ఘనతే. మూడున్నరేళ్ల పాలనలో 3,200పైచిలుకు రైతుల్ని ముఖ్యమంత్రి బలితీసుకున్నాడు. స్వచ్ఛందసంస్థలు, సేవాసంస్థలు, రైతుసంక్షేమసంఘాలే ఈ అంకెలుచెప్పాయి. రాష్ట్రంలో సగటున సంవత్సరానికి 1000మంది అన్నదాతలు చనిపోతున్నారు. 3వేలకు పైగా రైతులుచనిపోతే, కేవలం మూడేళ్లలో 700 రైతుకుటుంబాలకు మాత్రమే అరకొరసాయం చేసి చేతులుదులుపుకున్నాడు. ఒక వ్యక్తి బలవన్మర ణానికి పాల్పడ్డాడంటే, దానివెనకాల ఎన్నిఒత్తిళ్లు, ఎంతదుర్భర పరిస్థితులు ఉంటాయో గమనించాలి. జగన్ రెడ్డి సీఎం అయ్యాకే రాష్ట్రరైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వైసీపీప్రభుత్వమిచ్చే రూ.7వేల ఆర్థికసాయం రైతులకు ముష్టితో సమానం. వాణిజ్య పంటలకు వినియోగించే లీటర్ పురుగుమందు కూడా ఆ డబ్బుతోరాదు. ఎన్నోబాధలు, టన్నులకొద్దీ ఆవేదన దిగమిం గుకుంటూ రైతులు పంటలు సాగుచేస్తున్నారు. ఏడుస్తూ రైతుకి ఏడాదికి రూ.7వేలుఇస్తూ, సాక్షిమీడియాలో మాత్రం జగన్ రెడ్డి వేలకోట్ల ప్రకటనలు ఇచ్చుకుంటున్నాడు.

రైతులపై జగన్ రెడ్డికి ప్రేమే ఉంటే, చంద్రబాబు అమలుచేసిన పథకాలు రద్దు చేస్తాడా?
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చీరాగానే రైతులకోసం చంద్రబాబు అమలుచేసిన పథకాల న్నింటినీ అటకెక్కించాడు. రైతులపై ప్రేమే ఉంటే, ముఖ్యమంత్రి ఆపనిచేస్తాడా? ఉచిత భూసార పరీక్షలు, సూక్ష్మ పోషకాలు ఎరువులపంపిణీ, బోర్లువేయించడం, గిట్టుబాటుధర, పంటలబీమా వంటి వాటిని పకడ్బందీగా టీడీపీప్రభుత్వం అమలుచేసింది. అదేవిధంగా పోలవరం నిర్మాణంచేపట్టి, నదుల అనుసంధానం దిశగా అడుగులేసి, రాష్ట్రవ్యాప్తంగా కొన్నిలక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చేందుకు శ్రమించింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంటనష్టాన్ని అంచనావేసి, కేవలం 48 గంటల్లోనే అన్నదాతలకు పరిహారం అందించిన ఘనుడు చంద్రబాబు. 5 ఏళ్ల పాలనలో పంటలబీమా కింద రూ.4,200 కోట్లను రైతులకు అందించి వారిని ఆదుకున్న మహానుభావుడు చంద్రబాబు. తడిచి రంగుమారిన ధాన్యం, ఇతరపంటఉత్పత్తుల కొనుగోళ్లలో టీడీపీప్రభుత్వం, మార్కెట్ ధరకంటే అదనంగా బోనస్ రూపంలో క్వింటాల్ కు అదనపు సాయం చేసింది. వ్యవసాయాన్ని పండుగగామార్చి, రైతుని రాజుని చేయడానికి చంద్రబాబుగారు అహర్నిశలు శ్రమించా రనడం అతిశయోక్తికాదు. జగన్ రెడ్డి వచ్చాకే రైతులపరిస్థితి హృదయవిదారకంగా తయారైంది. రైతు భరోసా కేంద్రాలే (ఆర్బీకేలు) సర్వరోగనివారుణులు అంటూ రైతుల్ని బలితీసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి చెప్పే రైతుభరోసా కేంద్రాలు, అధికారపార్టీనేతలకు మేలుచేస్తూ, రైతులకష్టాన్ని దోచుకుంటున్నాయి.

జగన్ రెడ్డి వచ్చాక రాష్ట్రంలోని ప్రతిరైతు తలపై రూ.2.54లక్షల అప్పు….
కేంద్ర ప్రభుత్వ జాబితా ప్రకారం రాష్ట్రంలోని ప్రతిరైతు తలపై రూ.2.54లక్షల అప్పుఉంది. రాష్ట్రంలోని ప్రతి 100మంది రైతుల్లో 94 మంది అప్పులఊబిలో ఉన్నారని కేంద్రగణాంకాలు చెప్పడం జగన్ రెడ్డి ప్రభుత్వపనితీరుకి నిదర్శనం. దేశవ్యాప్తంగా ప్రతిరైతు తలపై సగటున్న ఉన్నఅప్పు కేవలం రూ.74వేలు మాత్రమే. కౌలురైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండోస్థానంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి అవినీతి, దోపిడీ, బాధ్యతారాహిత్యం అన్నదాతల జీవితాల్లో చీకట్లు నింపింది. గంటా, అరగంటా లాంటి పనికిమాలిన వాళ్లు నీటిపారుదల శాఖ మంత్రులుగా ఉంటే రాష్ట్ర రైతాంగానికి నీటివసతి కల్పిస్తారా? ప్రభుత్వం నీరుఇవ్వదని తెలిసే, రైతులు సొంతంగా బోర్లుతవ్వుకొని, విద్యుత్ కనెక్షన్లకోసం దరఖాస్తు చేసుకుంటే, లక్షా25వేలమంది రైతుల దరఖాస్తుల్ని ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. ఎక్కడైనా కర్మకాలి రైతులపొలాలకు నీరిందించే మోటార్ల తాలూకా ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతే, వాటిని మార్చే దిక్కులేదు.

తుఫాన్ ప్రభావంతో ధాన్యం తడుస్తుందన్న ఆందోళనలో రైతాంగం ఉంటే, జగన్ రెడ్డి కొనుగోళ్లు ఎందుకు జరపడంలేదు?
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, వయా సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి ధాన్యం కొనుగోళ్ల ముసుగులో సంవత్సరానికి రూ.6వేలకోట్ల రైతులసంపదను దోచుకుంటున్నారు. కోనసీమ ప్రాంతంలోగానీ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో రైతాంగమంతా ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసి, కొనేవారికోసం ఎదురుచూస్తున్నారు. తుఫానుతో ధాన్యం తడిచిపోతుందనే ఆందోళనలో రైతాంగం ఉంటే, ముఖ్యమంత్రి ఆర్ బీకే ల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ఎందుకు జరపడంలేదు? రాయలసీమప్రాంతంలోని ఉద్యానవన పంటలు వర్షాలకు నేలకొరుగుతున్నా, పట్టించుకునే నాథుడులేడు.

రైతులకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వయంత్రాంగంగానీ, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులుగానీ ఎలాంటిచర్యలు తీసుకోవడంలేదు. ఈ ప్రభుత్వం, జగన్ రెడ్డి శాశ్వతం కాదనే వాస్తవాన్ని రైతాంగం గుర్తుంచు కోవాలని కోరుతున్నాం. అన్నదాతలు ఎవరూ కూడా బలవన్మరణాలకు పాల్పడవద్దని, చంద్రబాబుగారి ప్రభుత్వం రాగానే వ్యవసాయానికి మంచిరోజులువస్తాయని, అన్నదాతల జీవితాలు బాగుపడతాయని విన్నవించుకుంటున్నాం.

ప్రభుత్వం తక్షణమే ధాన్యంకొనుగోళ్లు జరపాలన్న డిమాండ్ తో పాటు, తుఫానుప్రభావంతో దెబ్బతిన్నపంటలకు ప్రభుత్వం వెంటనే తగిన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, సోమవారం నుంచి తెలుగురైతు విభాగం బృందాలు రాష్ట్రంలో పర్యటించనున్నాయి. తుఫాన్ వల్ల, ధాన్యకొనుగోళ్లు జరపకపో వడంవల్ల రైతులుఎంతగా నష్టపోతున్నారో తెలియచేస్తూ పూర్తివివరాలను వాస్తవాలతో సహా పాలకుల ముందు ఉంచబోతున్నాం” అని శ్రీనివాసరెడ్డి చెప్పారు.

LEAVE A RESPONSE