Suryaa.co.in

Andhra Pradesh

త్వరలో మూడు రోజులపాటు రాష్ట్రంలో మేధో మథన సదస్సు

-ప్రత్యేక హోదా, పునర్వ్యస్థీకరణ చట్టం లోని అంశాలపై పోరాటం
-అన్ని స్థాయిల్లో శిక్షణా తరగతులు
-పిసిసి నూతన అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు

కేంద్రంలో బిజేపి..రాష్ట్రంలో వైసిపి ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రధాన పోరాటం చేయాలనేది ఏపి కాంగ్రెస్ రాజకీయ విధానంగా వుంటుందని స్పష్టం చేశారు.ప్రత్యేక తరగతి హోదా…. పునర్వ్యస్థీకరణ చట్టం లోని అంశాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఏపీసీసీ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం అనంతరం ఈ రోజు ఆంధ్ర రత్న భవన్ లో పిసిసి నూతన అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఎఐసిసి సెక్రెటరీ మయప్పన్, ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, కిసాన్ సెల్ చైర్మన్ జెట్టి గురునాధం, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు రుత్తల శ్రీరామమూర్తిలు మాట్లాడారు.

త్వరలో మూడు రోజులపాటు రాష్ట్రంలో మేధో మథన సదస్సు జరపనున్నట్టు ప్రకటించారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉదయపూర్లో జరిపిన మేధో మథన సదస్సు మాదిరిగా ఏపీ లో కూడా ముఖ్యమైన కీలక అంశాలపైన మేధో మథన సదస్సు జరిపి పార్టీ దిశా నిర్దేశం, కార్యాచరణలను రూపొందించుకుంటామని గిడుగు రుద్రరాజు చెప్పారు. ఏపీలో అధికార,ప్రతిపక్షాలు మోదీకి, బిజెపి కి భయపడి రాష్ట్ర ప్రయోజనాలను బలిపెడుతున్నయని చేప్పారు. బిజెపితో పోరాడేశక్తి కాంగ్రెస్ పార్టీకి వుందని, రాష్ట్ర ప్రజల హక్కులు, అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా పోరాడతామని చెప్పారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి అవసరమైన చోట కమిటీలను పునర్నిర్మాణం చేస్తామని ప్రకటించారు. పార్టీ లో 50శాతం పదవులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మహిళలకు ఇస్తామని చెప్పారు.

పార్టీలో నాయకత్వాన్ని పెంపొందించేందుకు అన్ని స్థాయిల్లో శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్టు చెప్పారు. తమను ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించిన ఎఐసిసి అధక్షులు మల్లిఖార్జున్ ఖర్గే కు రాహుల్ గాంధీ కి ఎఐసిసి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.. పూర్వ అద్యక్షులు సాకే శైలజానాథ్ కు, రాష్ట్ర జిల్లా కమిటీలకు అభినందనలు తెలిపారు. ఆస్తుల పరిరక్షణ కమిటీ చైర్మన్ గా చేవూరి దేవకుమార్ రెడ్డి నియామకం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల్లో ఉన్న ఆస్థుల పరిరక్షణకు రాష్ట్ర ఆస్థుల పరిరక్షణ కమిటీకి, చెరుకూరి దేవకుమార్ రెడ్డిని రాష్ట్ర చైర్మన్ గా నియమించారు. దేవకుమార్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు.

LEAVE A RESPONSE