Suryaa.co.in

Andhra Pradesh

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారం కోసం ఏఐ ఫర్ ఆంధ్రప్రదేశ్

– ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎఐ హ్యాకథాన్
– ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ జాతీయ స్థాయిలో ఎఐ హ్యాకథాన్‌ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంబించనున్నారు. ఈ వినూత్న కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం పోలీసింగ్ మరియు ప్రజాసేవలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలను అన్వేషించడమే లక్ష్యంగా ఈ ఎఐ హ్యాకథాన్‌ నిర్వహించబడుతోంది.

ఈ కార్యక్రమం జూన్ 27,28 మరియు 29వ తేదిలలో RVR & JC College of Engineering, గుంటూరులో నిర్వహించబడుతోంది. ఈ ఎఐ హ్యాకథాన్‌ ఈవెంట్‌కు RVR & JC College of Engineering అధికారిక హోస్టింగ్ పార్టనర్ గా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , రాష్ట్ర ఉన్నతాధికారులు, దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ రంగ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా నేడు తన కార్యాలయంలో ఆవిష్కరించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ కు అనుగుణంగా, పరిపాలనలో ఆధునిక సాంకేతికతను అమలు చేయాలనే సంకల్పంతో ఈ హ్యాకథాన్ నిర్వహించబడుతోంది. శాస్త్రీయంగా మరియు ఆచరణాత్మకంగా ఉండే ఎఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఇది ఒక వ్యూహాత్మక వేదికగా నిలవనుంది.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం 4SightAI సంస్థతో భాగస్వామ్యం చేసుకుంది. 4SightAI ఈ హ్యాకథాన్‌కు నాలెడ్జ్ పార్టనర్ గా వ్యవహరిస్తోంది.

హ్యాకథాన్ సందర్భంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రత్యేక AI సింపోజియం నిర్వహించబడుతుంది. ఇందులో ప్రభుత్వ నిర్ణయాధికారులు, పరిశ్రమ నాయకులు, పెట్టుబడిదారులతో నేరుగా మంతనాలు జరిపే అరుదైన అవకాశం పాల్గొనేవారికి లభిస్తుంది.

ఈ ప్రెస్టీజియస్ హ్యాకథాన్‌లో దేశీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు, స్టార్టప్స్, విద్యాసంస్థలు పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆహ్వానిస్తోంది. అవార్దుల ఎంపిక కమిటీలో సీనియర్ ఐపిఎస్ అధికారులు, పరిశ్రమ నిపుణులు, అకడమిక్ పరిశోధకులు సభ్యులుగా ఉంటారు.

అభివృద్ధి చేయబడే పరిష్కారాల సాంకేతిక నైపుణ్యం మరియు వాస్తవ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని విజేతలను ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రథమ విజేతలకు నగదు బహుమతులు కూడా ఇవ్వబడతాయి. ఎంపికైన టీమ్‌లకు బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చులు ఉచితంగా అందించబడతాయి.

హ్యాకథాన్‌కు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. ఎంపికైన బృందాలకు ఉచితంగా బస మరియు భోజన సదుపాయాలు కల్పించబడతాయి. అర్హత సాధించిన బృందాలకు పోలీస్ విభాగం సర్టిఫికెట్లు అందించడంతో పాటు, అత్యుత్తమ ప్రదర్శన చేసిన బృందాలకు నగదు బహుమతులు లభిస్తాయి.

ప్రభుత్వ సేవలలో ఎఐ సామర్థ్యాలను వినియోగించేందుకు ఈ కార్యక్రమం ఓ కీలకమైన మైలురాయి కానుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ, విజన్ కలిగిన అన్ని AI బృందాలను పాల్గొనమని కోరుతోంది.

LEAVE A RESPONSE