Suryaa.co.in

Andhra Pradesh

పెనుకొండలో అంబరాన్ని అంటిన మినీ మహానాడు మహోత్సవం

– పండుగ వాతావరణంలో పెనుకొండ టీడీపీ 2025 మినీ మహానాడు.
– మినీ మహనాడులో పలు కీలక అంశాలపై తీర్మానాలు
– అభివృధ్ధికి మారు పేరు తేదేపా
– స్కాంరెడ్డి పని ఐపోయింది
– ఐదేళ్ళళో వైసిపి చేయని అభివృధ్ధి పది నెలల్లో చేసి చూపాం
– అమృత్ పథకం ద్వారా పెనుకోండ మున్సిపాలిటీ లో 100 కోట్లతో ఇంటింటికి తాగునీరు
– మంత్రి సవిత

పెనుకొండ : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మినీ మహనాడు లో భాగంగా బుధవారం పెనుకోండలో మిని మహనాడు రాష్ట్ర బిసి సంక్షేమం,చేనేత జౌళి శాఖా మంత్రి సవిత ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా ,హిందుపురం ఎంపి బికే పార్థసారథి,పెనుకోండ నియోజకవర్గ పరిశీలకులు నరసింహ రావు జిల్లా అధ్యక్షులు కొల్లకుంట అంజినప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

స్థానిక ఎన్టిఆర్ సర్కిల్ ఎన్టీఆర్ విగ్రహనికి పూల మాలలు వేసి నివాళుళు అర్పించారు .అనంతరం నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగ తెదేపా శ్రేణులను అత్సాహ పరుస్తు తేదేపా కార్యాలయంకు వెళ్ళారు,అక్కడ ఎన్టీఆర్ విగ్రహనికి నివాళుళు అర్పించి,జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం ఇటీవల మరణించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు వీర జవాన్ మురళినాయక్ కు నివాళి అర్పించారు.

అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ వైసిపి హయంలోదోచుకో,దాచుకో,పంచుకో అనే సంస్కృతికి తెర లేపారని,ప్రజలు ఎమైపోతె ఎంటి మనం బాగుండాలనే ధోరణి అవలంభించారన్నారు,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా వైసిపి ఐదేళ్ళళో చేయలేని అభివృధ్ధి కూటమి ప్రభుత్వం కేవలం పది నెలల్లో పూర్తి చేసిందన్నారు.

గత పాలకుల నిర్లక్ష్యం వలన పెనుకొండ అస్తవ్యస్థం అయ్యిందని ,ఎన్నో పరిశ్రమలు వెళ్ళిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేసారు,గతంలో వలస పక్షులు ఇక్కడకు రావడం,దొరికింది దోచుకోవడం తరువాత పారిపోవడం జరిగేదని,వైసిపి మంత్రిగా ఉన్న కూడా పెనుకోండలో అభివృధ్ధి శూన్యంగా ఉందన్నారు,తాను మంత్రిగ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి పెనుకోండ నియోజకవర్గం వ్యాప్తంగా నూతన రోడ్లు, డ్రయినేజీలు,సిసి రోడ్లు,బోర్లు వేయించామని,అమృత్ పథకం ద్వారా పెనుకోండ మున్సిపాలిటీ లో 100 కోట్లతో ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు.

అభివృధ్ధితో పాటు పిల్లల చదువులు ముఖ్యమని బిసి హస్టల్స్ ను పునః ప్రారంభించామని,మోన్న వచ్చిన పదవ తరగతి ఫలితాల్లో ఎంజేపి పాఠశాలలు మొదటి స్థానంలో నిలిచాయంటే అది అభివృధ్ధికి కేరాఫ్ అడ్రస్ అన్నారు,మాజి సియం పరదాలకే పరిమితమయ్యాడని,పచ్చని చెట్లు నరికేయించాడని,నిరుద్యోగ యువతకు భవిత లేకుండా చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వం రాగానే మెగా డియస్సి ఫైల్ మీద సంతకం చేసిన ఘనత చంద్రబాబూది అన్నారు,తనకి పెనుకోండ ఓ కన్ను,రాష్ర్టం ఓ కన్ను అని,తేదేపా కోసం కష్ట పడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని,అందులో భాగంగానె సోమందేపల్లీ కి చెందిన నిమ్మకాయల రామాంజి అనారోగ్యంతో మరణించాడని,అతను గతంలో తెదేపా హయంలో చేసిన పనుల బిల్లులను వైసిపి ప్రభుత్వం నిలిపివేసిందని,ఆ బిల్లును కూటమి ప్రభుత్వం ఇచ్చిందని,నిమ్మకాయల రామాంజి కుటుంబానికి 5 లక్షల 50 వేలు నగదు అందించామన్నారు.

తెదేపా కోసం కష్టపడి పని చేస్తున్న ప్రతి ఒక్కరికి తను అండగా ఉంటానని, వైసీపీ ప్రభుత్వంలో తన మీద తో పాటు ఎంతో మంది తేదేపా నాయకులూ, కార్యకర్తల పై తప్పుడు కేసులు పెట్టారని,విటికి భయపడకుండా నా వెంట నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు తల వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు,అనంతరం మినీ మహనాడుకు వచ్చిన తేదేపా శ్రేణులకు మంత్రి సవిత గిఫ్టు బాక్సులు అందించారు.. ఈ కార్యక్రమంలో నియోజకవర్గము నుండి సీనియర్ నాయకులు వేలాదిమంది కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A RESPONSE